క్రైమ్ : ఆన్‌లైన్‌లో ప్రముఖుల పిల్లలపై ప్రేమ వల..! దొరికిన కేటుగాడు..!!

సోషల్ మీడియా పెరిగిపోయాక.. డాటా విప్లవం వచ్చిన తర్వాత మోసాలు కూడా కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఆన్‌లైన్ ఫ్రాడ్స్ కన్నా.. మించి… మోసాలు జరుగుతున్నాయి. మార్ఫింగ్‌లు చేసి బెదిరించడం చాలా పాత పద్దతి. ఇప్పుడు ట్రెండ్ ఏమిటంటే… ఆన్‌లైన్‌ ప్రొఫైల్స్‌లో అందమైన యువకుల ఫోటోలు పెట్టి… పెద్ద కుటుంబాల అమ్మాయిల్ని ట్రాప్‌లోకి లాగడం… వారి నుంచి డబ్బు దస్కం తీసుకుని ఉడాయించడం. ఇలా ఒకర్నో ఇద్దర్నో చేస్తే అది పెద్ద విశేషం కాదు కానీ.. ఏకంగా ఐదు వందల మందికి అటూఇటుగా పెద్ద కుటుంబాల అమ్మాయిల్ని ట్రాప్ చేసి… నమ్మకంగా వారి దగ్గర్నుంచి డబ్బులు, నగలు తీసుకుని ఉడాయించిన ఘనుడు ఒకడు పోలీసులకు చిక్కాడు. వెదికి.. వెదికి చివరికి పోలీసులు పట్టుకుని చరిత్ర తీసేసరికి పోలీసులు కూడా… నోరెళ్లబెట్టేంత చరిత్ర బయటకు వచ్చింది.

తూర్పుగోదావరి జిల్లాకు జోగాడ వంశీకృష్ణ సంపన్న కుటుంబం నుంచి వచ్చినా… బెట్టింగ్, గుర్రపు పందాల పిచ్చితో మొత్తం పోగొట్టుకున్నాడు. ఉద్యోగాలు రుచించక… ఫేస్ బుక్, వాట్సాప్ ద్వారా అమ్మాయిల్ని ట్రాప్ చేసి.. మోసాలు చేయడం ప్రారంభించాడు. రెండేళ్ల నుంచి దాదాపుగా ఐదు వందల మందిని ఇలా మోసం చేశాడు. కోటిన్నరకు పైగా ఇలా వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఈ సొమ్మంతా వంశీకృష్ణ గుర్రప్పందాల్లో పోగొట్టుకున్నాడు. వరుసగా ఫిర్యాదులు రావడంతో పోలీసులు వల వేసి పట్టుకున్నారు. చాటింగ్‌లో.. అమ్మాయిల్నీ ఇట్టే పడేయడంతో వంశీకృష్ణ నేర్పరి అని పోలీసులు చెబుతున్నారు. వంశీకృష్ణ ప్రేమ మాటల మాయలో పడి… మోసపోయిన వాళ్లలో రాజకీయ నేతల కుమార్తెలు కూడా ఎక్కువగానే ఉన్నారు.

తెలంగాణకు చెందిన ఓ ఎంపీ మనవరాలు వంశీకృష్ణ మాటల మాయాజాలానికి చిక్కుకుని పెద్ద మొత్తంలో సమర్పించుకుందని పోలీసులు చెబుతున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మరికొంత మంది ప్రముఖుల పిల్లలూ మోసపోయిన వారి జాబితాలో ఉన్నారంటున్నారు. చాలా మంది పరువు పోతుందనే ఉద్దేశంతో ఫిర్యాదు చేసేందుకు కూడా ముందుకు రావడం లేదు. కొద్ది రోజులుగా వరుసగా ఫిర్యాదులు వస్తూండటంతో… తీగలాగిన పోలీసులకు అసలు విషయం తెలిసింది. టెక్నాలజీ వాడకంలో రాటుదేలిపోయిన వంశీకృష్ణ.. తన గుర్తింపును దొరకకుండా.. అమ్మాయిల్ని ఎలా మోసం చేశాడో… పోలీసుల్నీ కూడా అలాగే బురిడి కొట్టించాడు. చివరికి… కాకినాడలోనే దొరికిపోయాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

HOT NEWS

css.php
[X] Close
[X] Close