మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్-లాలూ

హైదరాబాద్: ప్రస్తుత ఫలితాలలో లాలూకు చెందిన రాష్ట్రీయ జనతాదళ్ 80 స్థానాలలో గెలిచి అతిపెద్ద ఏకైక పార్టీగా నిలవటం విశేషం. గత అసెంబ్లీ ఎన్నికలలో కేవలం 22 స్థానాలలో గెలిచి ప్రధాన ప్రతిపక్షంగా నిలవటానికికూడా అర్హత సాధించలేకపోయిన స్థితినుంచి ప్రస్తుతం మళ్ళీ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించే స్థాయికి రావటం ఫీనిక్స్ పక్షిని గుర్తుకు తెస్తోంది. వరసగా పదిహేను సంవత్సరాలు బీహార్‌ను పాలించిన లాలూకు 2010లో 22 స్థానాలు మాత్రమే దక్కటంతో, రాజకీయంగా దాదాపుగా ఔటాఫ్ ఫోకస్ అయిపోయారు. అయితే 2014 పార్లమెంట్ ఎన్నికల తర్వాత నితీష్‌తో చేతులు కలపటం లాలూ దశ, దిశను తిప్పేసింది. అయితే కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వంలో లాలూ పాత్రగురించి చర్చ మొదలయింది. మామూలుగానే లాలూ డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. ఇక మెజారిటీ తనది ఉన్నప్పుడు ఎలా ఉంటుందనేది వేచి చూడాలి. ఆయన పిల్లలలో ముగ్గురు – మీసా భారతి, తేజ్ ప్రతాప్, తేజస్వికూడా ఈ ఎన్నికలలో గెలిచారు.

ఇవాళ మధ్యాహ్నం మీడియాతో మాట్లాడుతూ, భారతీయ జనతాపార్టీని బీహార్‌నుంచి తరిమికొట్టామని, ఢిల్లీ సింహాసననుంచికూడా దించుతామని లాలూప్రసాద్ యాదవ్ అన్నారు. ఇవాళ మధ్యాహ్నం పట్నాలో తన నివాసంలో బీహార్ ఫలితాలపై ఆయన స్పందించారు. లాలూను అభినందించటానికి వచ్చిన నితీష్ కుమార్ కూడా అక్కడే ఉన్నారు. బీహార్ ప్రజలు తమ సోదరులిద్దరిపై నమ్మకం ఉంచారని లాలూ చెప్పారు. బీజేపీకి గట్టి గుణపాఠం చెప్పారని వ్యాఖ్యానించారు. మతతత్వానికి వ్యతిరేకంగా ప్రజలు తీర్పునిచ్చారని అన్నారు. మహాకూటమి బీహార్‌ను కొత్త ఎత్తులకు తీసుకెళుతుందని చెప్పారు. అభివృద్ధిపైనే దృష్టి పెడతామని అన్నారు. నితీష్‌కు అభినందనలు తెలిపారు. ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని చెప్పారు. అభినందనలు తెలిపిన ప్రధాని మోడిని ప్రశంసించారు. త్వరలో వారణాసి వెళ్ళి అక్కడ ర్యాలీ జరుపుతానని లాలూ చెప్పారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉద్యోగం ఊస్టింగ్ ? వెంకట్రామిరెడ్డి ఇక జగన్ సేవకే.. !

ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘం నేత వెంకట్రామిరెడ్డిని సస్పెండ్ చేసింది ఈసీ. ఆయన వైసీపీ కోసం ఎన్నికల ప్రచారం చేయడంతో నిర్ణయం తీసుకుంది. అంతే కాదు ఆయనను అమరావతి దాటి వెళ్లవద్దని ఉత్తర్వులు...

సీఎస్, డీజీపీ బదిలి ఇంకెప్పుడు !?

ఏపీలో వ్యవహారాలన్నీ గీత దాటిపోతున్నాయి. ఎన్నికలకోడ్ ఉన్నా.. రాజారెడ్డి రాజ్యాంగమే అమలవుతోంది. ఐపీసీ సెక్షన్ల కాకుండా జేపీసీ సెక్షన్లతో పోలీసులు రాజకీయ కేసులు పెట్టేస్తున్నారు. అమాయకుల్ని బలి చేస్తున్నారు. మరో...

ఎక్స్ క్లూజీవ్: మారుతి నుంచి ‘బేబీ’లాంటి ‘బ్యూటీ’

గ‌తేడాది వ‌చ్చిన సూప‌ర్ హిట్ల‌లో 'బేబీ' ఒక‌టి. చిన్న సినిమాగా వ‌చ్చి, సంచ‌ల‌న విజ‌యాన్ని అందుకొంది. నిర్మాత‌ల‌కు, పంపిణీదారుల‌కూ విప‌రీత‌మైన లాభాల్ని పంచిపెట్టింది. ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా...

కాళ్లు పట్టుకోవడంలో పెద్దిరెడ్డి ఎక్స్‌పర్ట్ – కిరణ్ చెప్పిన ఫ్లాష్ బ్యాక్ !

కిరణ్ కుమార్ రెడ్డికి.. పెద్దిరెడ్డికి రాజకీయ వైరం దశాబ్దాలుగా ఉంది. ఆ విషయం అందరికీ తెలుసు. ఒకే పార్టీలో ఉన్నా కిరణ్ కుమార్ రెడ్డిపై పెద్దిరెడ్డికి వ్యతిరేకత ఉంది. కానీ తాను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close