రివ్యూ : ‘మనమంతా’ కలిసి చూడతగ్గ చిత్రం…!

ఐతే..అనే డిఫరెంట్ టైటిల్ తో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగిడిన దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి, ఎప్పటి కప్పుడు ప్రత్యేకత సంతరించుకున్న విలక్షణమైన కథలను మనకు అందిస్తూ, తెలుగులో తనదైన ప్రత్యేకత చాటుకున్న దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి. ఇక తాజాగా ఆయన మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, నాటితరం హీరోయిన్ గౌతమిలతో కలిసి ‘మనమంతా’ అనే సినిమాతో చాలా కాలం తరువాత మనముందుకు వచ్చారు. సక్సెస్ చిత్రాల నిర్మాత సాయి కొర్రపాటి వారాహి చలన చిత్రం పతాకం పై నిర్మించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒకే ప్రపంచానికి చెందిన నలుగురి కథల సమాహారంగా తెరకెక్కిన ఈ సినిమా మరి సినిమా చంద్రశేఖర్ ఏలేటి సినిమాల స్థాయిలోనే ఉందా? నిర్మాత సాయి కొర్రపాటి మరో హిట్ కొట్టాడా… చూద్దాం..

కథ:

ఇది వన్ లైన్ ఆర్డర్ కథ కాదు… నలుగురి కథల సమాహారం తో ఒక సినిమా కథ గా మలిచారు.
ఓ సూపర్ మార్కెట్ లో స్టోర్ అసిస్టెంట్ పని చేస్తుంటాడు సాయిరాం (మోహన్ లాల్). అదే మార్కెట్ లో సేల్స్ అసిస్టెంట్ ఉంటాడు విశ్వనాధ్ (హర్షవర్ధన్). ఐతే మార్కెట్ మేనేజర్ పరుచూరి వెంకటేశ్వరరావు రిటైర్ మెంట్ అయిపోతున్న తరుణంలో మేనేజర్ పోస్ట్ కి సాయిరాం ప్రమోట్ అవుతాడా… విశ్వనాధ్ ప్రమోట్ అవుతాడా అనే టెన్షన్ సూపర్ మార్కెట్ లో వర్క్ చేస్తున్న ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఎలాగైనా తనే మేనేజర్ గా ప్రమోషన్ కొట్టేయాలనే తపన సాయిరాంకి ఉంటుంది. తనే ప్రమోషన్ కొట్టేస్తాననే ధీమాలో విశ్వనాధ్ ఉంటాడు. ఇది ఒక పర్వం ఇలా ఉంటే….

ఇక రెండవది మిడిల్ క్లాస్ మహిళ గాయ్రతి (గౌతమి). తన కుటుంబం కోసం తాపత్రయపడే గాయత్రి స్కూల్, కాలేజ్ డేస్ లో ఫస్ట్ ర్యాంక్ హోల్టర్. ఎప్పుడు చిరునవ్వుతో ఉండే గాయత్రి అంటే ప్రొపెసర్ మారుతీరావు (గొల్లపూడిమారుతీరావు) కి చాలా ఇష్టం. మిడిల్ క్లాస్ జీవితంతో తన ఇష్టాలను పక్కన పెట్టేసి తన గురించి కాకుండా తన కుటుంబం గురించి మాత్రమే ఆలోచించే గాయత్రిని చూసిన ప్రొపెసర్ ఆమె టాలెంట్ ని గుర్తు చేసి సింగపూర్ లో మంచి జాబ్ ఉంది.. కెరియర్ గురించి ఆలోచించి ఆ జాబ్ చేయమని సలహా ఇస్తాడు. తన కుటుంబాన్ని వదిలేసి సింగపూర్ వెళ్లాలా లేదా ఆనే ఆలోచనలో పడిపోతుంది గాయత్రి.

ఇక మూడవది అభిరామ్ (విశ్వాంత్) కాలేజ్ స్టూడెంట్. చదువే అతని ప్రధాన ధ్యేయం. తన తోటి విద్యార్ధులకు ఫీజు తీసుకోకుండా ట్యూషన్ చెప్పేంత మంచి కుర్రాడు. ఓ అమ్మాయి (అనీషా ఆంబ్రోస్) ని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. ఆ అమ్మాయి మాత్రం అభిరాం ని ఫ్రెండ్ లానే అనుకుంటుంది. ప్రేమలో పడిన అభిరామ్ ఎప్పుడూ ఆమె గురించే ఆలోచిస్తూ ఉంటాడు.

మహిత కూడా (రైనా రావు) ఓ కాన్వెంట్‌లో చదివే ఓ అమ్మాయి. తనకు చేతనైనంతలో అడిగిన వారికి సహాయం చేసే మనస్థత్వం మహితది. స్కూల్ వెళుతున్న సమయంలో కనిపించిన చిన్నపిల్లాడు వీరశంకర్ తో మహితకు అటాచ్ మెంట్ పెరుగుతుంది. వీరశంకర్ ఒకరోజు కనిపించకుండా పోతాడు. ఆ పిల్లవాడిని వెతకటానికి మహిత చాలా ధైర్యం చేస్తుంది. చిన్న పిల్ల అయినా మినిష్టర్ కొడుకు, పోలీసులను సైతం ధైర్యం గా నిలదీస్తుంది . ఇదో కథ….ఈ నలుగురు సమస్యలు ఏ విధంగా తీరతాయి అనేదే ఈ సినిమా చిత్ర కథ.

ఆర్టిస్ట్స్ పెర్ఫార్మన్స్ :

సాయిరాం పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ అద్భుతంగా నటించారు అనే కంటే జీవించారు అనొచ్చు. ఓ మిడిల్ క్లాస్ తండ్రి, భర్త పాత్రలో ఆయన లీనమైయ్యారు. తెలుగు నేర్చుకుని మరీ డబ్బింగ్ కూడా ఆయనే చెప్పారు. అయన పట్టుదలకు హ్యాట్సాప్ చెప్పాల్సిందే. గాయత్రి పాత్రను గౌతమి హ్యాండిల్ చేసిన విధానం సూపర్ వుంది. గౌతమి పాత్ర ప్రతి మహిళకు తనని తాను సొంతం చేసుకునే విధంగా సాధారణ మహిళా గా కనబడుతుంది. గౌతమి డబ్బింగ్ కూడా అద్భుతంగా చెప్పింది. ఊర్వశి ని స్ర్కీన్ పై చూస్తుంటే మన పక్కంటి ఆవిడినో, అక్కనో, వదిననో చూస్తున్నట్టు ఉంటుంది. ఈ సినిమాలో కూడా ఆమె పాత్ర అలానే ఉంటుంది.విశ్వాంత్,అనీషా ఆంబ్రోస్, చంద్రమోహన్, పరుచూరి వెంకటేశ్వరరావు, గొల్లపూడి మారుతీరావు, ధనరాజ్, వారి పాత్రలకు పూర్తి న్యాయం చేసారు. హర్షవర్ధన్, అనితా చౌదరి తమ పాత్రల పరిధిమేరకు నటించారు. ఈ చిత్రంలో నటించిన బాల నటీనుటులు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. రైనా రావు వీరశంకర్ పాత్ర పోషించిన పిల్లడు అద్భుతంగా నటించారు. మిగతా నటీనటులందరూ తమ పాత్రల పరిధిమేరకు నటించారు.

సాంకేతిక వర్గం :

ఎప్పుడు కొత్తదనం ఆలోచించే దర్శకులలో ఒకడు చంద్రశేఖర్ ఏలేటి, తానెంత కొత్తగా ఆలోచస్తాడో ఈ సినిమాతో మరోసారి రుజువు చేసుకున్నాడు. ఇప్పటి వరకు ఆయన రాసుకున్న ది బెస్ట్ స్క్రీన్‌ప్లే అనొచ్చు. ఒకే సినిమాలో నలుగురి కథలను చెబుతూ, ఆయన రాసిన స్క్రీన్‌ప్లే మాత్రం అదుర్స్..! ఇక బాగా అనుభవమున్న నటీనటుల నుంచి పర్ఫెక్ట్ నటన రాబట్టుకోవడం, సినిమాను ఎక్కడా కమర్షియల్ అంశాల జోలికి పోనివ్వకుండా, మన రియల్ లైఫ్ లో జరిగిన సంఘటనలు లాగ కథ ను నడపడం దర్శకుడి ప్రతిభకు నిదర్శనం. అయినా కాస్త ఎక్కడో వెలితి కనిపించింది తన గత సినిమాల తరహాలో ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉంటే ఈ సినిమా స్థాయి మరోలా ఉండేది. మహేష్ శంకర్ అందించిన పాటలు సందర్భానుసారంగా వచ్చేవే కావడంతో పాటు, మంచి ఫీల్ తెచ్చిపెట్టాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. సినిమాటోగ్రఫీ బాగున్నా, కథ, సినిమా స్థాయిలో లేదనే చెప్పాలి. ఎడిటింగ్ బాగుంది. ఆర్ట్ డైరెక్టర్ ఎస్.రవీంద్ర పనితనాన్ని మెచ్చుకోవాలి. ముఖ్యంగా స్లమ్ ఏరియా నేపథ్యం చూస్తే, ఆర్ట్ డైరెక్టర్ ప్రతిభను గమనించొచ్చు. సాయి కొర్రపాటి నిర్మాణ విలువలు కథా అవసరానికి తగ్గట్టు బాగున్నాయి.

విశ్లేషణ :

ఒక సినిమా కథ ను అచ్చంగా నిజ జీవితాన్నే తెరపై ఆవిష్కరిస్తే ఎలా ఉంటుందో మరోసారి పరిచయం చేసిన సినిమా ‘మనమంతా’. నలుగురి జీవితాల్లోని సంఘటనలను, వారి ఇష్టాలను, ఆలోచనలను ప్రతిబింబిస్తూ ఒక కథగా చెప్పడం ఈ సినిమా విషయం లో ముఖ్యం గా చెప్పుకో తగినది.కథ కు తగినట్టుగా మోహన్ లాల్, గౌతమి, విశ్వంత్, నైనాల నటన తోడై సెల్ల్యులాయిడ్ పై మరింత బలాన్నిచ్చింది. డబ్బు మనిషికి ఎంత అవసరమో ఆ అవసరం కోసం ఎంత మంచి మనిషి చేత అయినా తప్పు చేయిస్తుంది. తప్పు చేసిన మనిషికి మనశ్శాంతి ఉండదు. తప్పు చేసిన మనిషి బ్రతకడం చాలా కష్టం అనేడే ప్రధాన పాయింట్. జీవితంలో డబ్బు లేకపోయినా ఎన్ని కష్టాలున్నా, సమస్యలున్నా బ్రతికేయవచ్చుగానీ తప్పు చేస్తే ఏమౌతుందో తెలియ చేసే చిత్రం ఇది. ఈ పాయింట్ కనెక్ట్ అవ్వడానికి దర్శకుడు తయారు చేసుకున్న సీన్స్ చాలా బాగున్నాయి. ఓ చిన్నపిల్లకు తప్పుగా జోస్యం చెప్పి, ఆ పిల్ల అమాయకంగా నమ్మడంతో, తను చేసిన తప్పు తెలుసుకుని ఆ జోస్యం చెప్పే వ్యక్తి ఫీలవ్వడంలాంటి సీన్లు తప్పు చేస్తే మనశ్శాంతి ఉండదని బలంగా ఆడియన్స్ మనసుల్లోకి చొచ్చుకుపోయేలా చేస్తుంది. సాయిరాం, గాయత్రి పాత్రలను డైరెక్టర్ మలిచిన విధానం సూపర్. ఓ రౌడీ అయినా, ఓ మిడిల్ క్లాస్ వ్యక్తి అయినా పరిస్థితులు కారణంగానే తమ ఉనికిని కోల్పోయే స్థాయికి దిగజారతారని, కానీ చేసే ఒక్క తప్పు భరించరాని క్షోభకు గురి చేస్తుందని సాయిరాం, దాసు, గాయత్రి పాత్రల ద్వారా చాలా చక్కటి సీన్స్ తో ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా చేయగలిగారు. ప్రీ క్లయిమ్యాక్స్, క్లయిమ్యాక్స్ కి కన్నీళ్లు పెట్టని ప్రేక్షకుడు ఉండడు. ఇలాంటి మంచి సినిమాలు అప్పుడప్పుడు రావడం తో సినిమా లంటే ప్రజలు కూడా గౌరవిస్తారు. ఈ సమాజానికి ఇలాంటి సినిమాలు చాలా అవసరం. మంచితనం మరుగునపడిపోతున్న ఈ తరం వారికి ఈ చిత్రం ఒక మార్గదర్శకం అవ్వాలని ఆశిద్దాం……కుటుంబ సమేతంగా చూడతగ్గ చిత్రం ఇది.

తెలుగు360.కామ్ 3.25/5
బ్యానర్ : వారాహి చలన చిత్రం
నటీనటులు : మోహన్ లాల్, గౌతమి, విశ్వాంత్, రైనా రావ్, అనీషా అంబ్రోస్, నాజర్, ఊర్వశి, గొల్లపూడి మారుతీరావు, పరుచూరి వెంకళటేశ్వరరావు, ఎల్.బి.శ్రీరాం, వెన్నెల కిషోర, బ్రహ్మాజీ, ధన్ రాజ్ , తారకరత్న తదితరులు…..
సినిమాటోగ్రఫీ : రాహుల్ శ్రీవాత్సవ్,
మాటలు : చంద్రశేఖర్ యేలేటి, రవిచంద్ర తేజ,
సంగీతం : మహేష్ శంకర్,
ఎడిటింగ్ : జి.వి.చంద్రశేఖర్,
నిర్మాత : సాయి కొర్రపాటి, రజనీ కొర్రపాటి,
స్ర్కీన్ ప్లే, దర్శకత్వం : చంద్రశేఖర్ యేలేటి,
విడుదల తేదీ : 05.08.2016

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఛోటా కె.నాయుడు Vs హ‌రీష్ శంక‌ర్‌… ఏం జ‌రిగింది?

'మ‌ళ్లీ నా జోలికొచ్చారో... చూసుకొందాం' అంటూ సినిమా ఫ‌క్కీలో కెమెరామెన్‌ ఛోటా కె.నాయుడుకు వార్నింగ్ ఇచ్చాడు హ‌రీష్ శంక‌ర్‌. వీరిద్ద‌రూ క‌లిసి 'రామ‌య్యా వ‌స్తావ‌య్యా' సినిమా చేశారు. అప్ప‌టి నుంచీ ఇద్ద‌రి మ‌ధ్యా...

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close