మంచు మ‌నోజ్ ఈజ్ బ్యాక్‌!

మంచు హీరోల గురించి వార్త‌లొచ్చి చాలా కాల‌మైంది. మ‌నోజ్ అయితే అస‌లు ప‌త్తా లేకుండా పోయాడు. మ‌నోజ్‌కి సినిమాల‌పై ఆస‌క్తి త‌గ్గింద‌ని, అందుకే.. సినిమాల‌కు దూరంగా ఉంటున్నాడ‌ని టాక్స్ వినిపించాయి. విష్ణు విష‌యంలోనూ ఇదే మాట్లాడుకున్నారు. అయితే.. విష్ణు ఓ సినిమా మొద‌లెట్టాడు. ఇప్పుడు మ‌నోజ్ కూడా లైన్‌లోకి వ‌చ్చేస్తున్నాడు. మ‌నోజ్ క‌థానాయ‌కుడిగా త్వ‌ర‌లోనే ఓ సినిమా ప‌ట్టాలెక్క‌బోతోంది. ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ దాదాపుగా పూర్త‌యిన‌ట్టే. ఈ సినిమా కోసం మ‌నోజ్‌బ‌రువు త‌గ్గాడు.కొత్త లుక్‌లోకి మారాడు. అందుకు సంబంధించిన లుక్ కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింది. కొత్త ద‌ర్శ‌కుల‌తో ప‌నిచేయ‌డం మ‌నోజ్‌కి ఇష్టం. ఈసారీ.. ఓ కొత్త ద‌ర్శ‌కుడికి మ‌నోజ్ అవ‌కాశం ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. ఎలాంటి హ‌డావుడీ లేకుండా షూటింగ్ మొద‌లెట్టి, లో ప్రొఫైల్‌లో ఈ సినిమాని విడుద‌ల చేయాల‌ని భావిస్తున్నారు. మొత్తానికి మంచు ఫ్యామిలీ మెల్ల‌మెల్ల‌గా మ‌ళ్లీ సినిమాల‌కు ట‌చ్‌లోకి వ‌స్తోంది. మ‌రి రిజ‌ల్ట్స్ ఎలా ఉంటాయో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close