కొత్త దర్శకుణ్ణి నమ్మిన మంచు మనోజ్

హిట్టూ ఫ్లాపుల సంగతి పక్కన పెడితే… ప్రయోగాలు చేయడానికి ఎప్పుడూ ముందుంటాడు మంచు మనోజ్. కథ నచ్చితే కొత్త దర్శకులకు అవకాశం ఇవ్వడానికి ఏమాత్రం వెనుకాడడు. ఫైటుల్లో… పాటల్లో… తన మార్క్ వుండేలా చూసుకుంటాడు. ప్రేక్షకుల్లో ఏదో ఒక మంచి ప్రయత్నం చేస్తాడనే పేరు సంపాదించుకున్నా… ‘కరెంట్ తీగ’ తర్వాత సరైన హిట్ మనోజ్ ఖాతాలో పడలేదు. దాంతో కొంచెం గ్యాప్ తీసుకుని కథలపై కాన్సంట్రేట్ చేశాడు. ఇటీవల కొన్ని కథలు విన్న మనోజ్.. అందులోంచి ఓ కథను సెలెక్ట్ చేశాడు. దీంతో చందు అనే కొత్త దర్శకుణ్ణి మనోజ్ పరిచయం చేయనున్నాడు. ఆల్రెడీ చందు చెప్పిన కథకు మనోజ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అతడు ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో పడ్డాడు. మేలో ఈ సినిమాను ప్రారంభించే అవకాశాలు వున్నాయి. ‘ఒక్కడు మిగిలాడు’లో కెప్టెన్ ప్రభాకర్ పాత్ర కోసం బరువు పెరిగిన మనోజ్ ప్రస్తుతం ఆ బరువు తగ్గే పనిలో పడ్డారు. సినిమా ప్రారంభమయ్యే లోపు ప్రేక్షకులు పాత మనోజ్‌ని చూడొచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.