మంచు మ‌నోజ్ ‘గుంటూరోడు’

శౌర్య ఫ్లాప్ అవ్వడంతో మంచు మ‌నోజ్ బ్యాక్ స్టెప్ వేశాడు. అప్ క‌మింగ్ ప్రాజెక్ట మీద ఇంకాస్త దృష్టి పెట్టాడు. ఈసారి మాస్‌, మ‌సాలా, ఎంట‌ర్‌టైనింగ్ సినిమాల‌నే తీయాల‌ని డిసైడ్ అయ్యాడు. మ‌నోజ్ చేతిలో రెండు సినిమాలున్నాయిప్పుడు. ‘ఒక్కడు మిగిలాడు’ చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. మ‌రోవైపు క్లాప్స్ అండ్ విజిల్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థతో మ‌రో సినిమాని న‌డిపిస్తున్నాడు. స‌త్య ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఈ సినిమా టైటిల్ ఏంటో తెలుసా?? ‘గుంటూరోడు’ అట‌. గుంటూరు నేప‌థ్యంగా సాగే మాస్ క‌థ ఇది. అందుకే గుంటూరోడు అనే టైటిల్ ఫిక్స్ చేసిన‌ట్టు తెలుస్తోంది.

సంప‌త్ ప్ర‌తినాయ‌కుడిగా న‌టిస్తున్న ఈ చిత్రంలో రావు ర‌మేష్‌, కోట శ్రీ‌నివాస‌రావు కీల‌క పాత్రలు పోషిస్తున్నారు. ఈసినిమాలో హీరో క్యారెక్టరైజేష‌నే హైలెట్ అని చిత్రబృందం చెబుతోంది. ఉత్తి పుణ్యానికి గొడ‌వ‌ల‌కు వెళ్లిపోయే యువ‌కుడిగా మ‌నోజ్ న‌టిస్తున్నాడ‌ట‌. మ‌నోజ్‌కీ సంప‌త్‌కీ మ‌ధ్య న‌డిచే ట్రాక్‌.. చాలా బాగా వ‌చ్చింద‌ని, మ‌నోజ్ కి ఈ సినిమా మాస్ హిట్ అందివ్వడం ఖాయ‌మ‌ని చిత్రబృందం న‌మ్మకంగా చెబుతోంది. డిసెంబ‌రులో గుంటూరోడు ప్రేక్షకుల ముందుకు రానుంది. గుంటూరోడు టైటిల్ గురించిన అధికారిక ప్రక‌ట‌న త్వర‌లో వ‌చ్చే అవ‌కాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com