మంచు మ‌నోజ్‌.. సొంత కుంప‌టి

మంచు కుటుంబంలో నిర్మాత‌లెక్కువ‌. స్వ‌త‌హాగా మోహ‌న్ బాబు బ‌డా నిర్మాత‌. మంచు విష్ణు కూడా 24 ఫ్రేమ్స్ ఫిల్మ్ ఫ్యాక్ట‌రీ పేరుతో సినిమాల్ని తీశాడు. మంచు ల‌క్ష్మీ ప్ర‌స‌న్న కూడా నిర్మాతే. ఇప్పుడు మంచు మ‌నోజ్ కూడా రంగంలోకి దిగిపోయాడు. `ఎం.ఎం` (మంచు మ‌నోజ్) ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై ఓ నిర్మాణ సంస్థ‌కు శ్రీకారం చుట్ట‌బోతున్నాడు. హైద‌రాబాద్‌లోనే ఆఫీసు తెరిచాడు. ఇటీవ‌ల పూజా కార్య‌క్ర‌మాలు కూడా జ‌రిగాయి. త్వ‌ర‌లోనే త‌న సొంత సినిమాని ప్రారంభించ‌బోతున్నాడు. ఈ సినిమాతో ఓ నూత‌న దర్శ‌కుడ్ని ప‌రిచ‌యం చేయ‌బోతున్నాడు. మ‌నోజ్ బ‌య‌టి హీరోల‌తోనూ సినిమాలు చేయ‌డానికి క‌స‌ర‌త్తు చేస్తున్నాడు. మ‌నోజ్‌కి ఇండ్ర‌స్ట్రీలో స‌ర్కిల్ ఎక్కువ‌. మ‌నోజ్ అడిగితే.. కాద‌న‌లేరు. హీరోల‌కు త‌గిన క‌థ‌ల్ని రెడీ చేసుకున్నాక అప్రోచ్ అవ్వాల‌ని భావిస్తున్నాడు. ఇటీవ‌ల త‌న విడాకులు తీసుకున్న మ‌నోజ్ ఇప్పుడు పూర్తి స్థాయిలో సినిమాల‌పై దృష్టి పెట్టాల‌ని చూస్తున్నాడు. త్వ‌ర‌లోనే మ‌నోజ్ నుంచి ఓ కొత్త సినిమాకి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న రానుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close