మంచు విష్ణు యూత్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘సరదా’

మంచు విష్ణు హీరోగా డి.కుమార్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఫిలింస్ బ్యానర్ లో సినిమా రూపొందుతోన్న సంగతి విదితమే. దసరా కానుకగా ఈ చిత్రానికి ‘సరదా’ అనే టైటిల్ నిర్ణయించారు. ‘అడ్డా’ ఫేమ్ జి.కార్తిక్ రెడ్డి దర్శకత్వంలో,సోమా విజయ్ ప్రకాష్ ప‌ల్లి కేశ‌వరావ్‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘జాదూగాడు’ ఫేమ్ సోనారిక ఒక హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవ‌ల లాంఛ‌నంగా ప్రారంభమైన ఈ చిత్రం రెండో షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది.

ద‌ర్శ‌కుడు జి.కార్తిక్ రెడ్డి మాట్లాడుతూ ”మంచు విష్ణు లాంటి హీరో, సోమావిజయ్ ప్రకాష్, పల్లి కేశవ్ రావ్ వంటి మంచి నిర్మాతలు ఈ చిత్రంలో ఉండటం చాలా హ్యపీగా ఉంది. ‘సరదా’ లవ్ అండ్ యూత్ ఫుల్ ప్యామిలీ ఎంటర్ టైనర్. ప్రతి మనిషిలో సరదా ఉంటుంది. ప్రతి ప్రేమలోనూ సరదా ఉంటుంది. ఆ సరదాను హైలైట్ చేస్తూ ఫుల్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ‘సరదా’ రెండో షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్ లో హీరో హీరోయిన్స్ పై కొన్ని సన్నివేశాలను, విజయ్ మాస్టర్ నేతృత్వంలో, ఎనిమిది రోజలు పాటు పబ్ లో జరిగే హీరో ఇంట్రడక్షన్ ఫైట్ ను చిత్రీకరించాం. ఈ ఫైట్ హైలైట్ గా వచ్చింది. విష్ణుగారి సరికొత్త బాడీ లాంగ్వేజ్ , సరికొత్త డైలాగ్ డెలివరీని ఈ చిత్రంలో చూస్తారు. టైటిల్ కు తగిన విధంగా ఫస్ట్ ఫ్రేమ్ నుండి లాస్ట్ ఫ్రేమ్ వరకు ప్రతి ఒక్కరూ చూసేలా ‘సరదా’గా, ఎంటర్ టైనింగ్ గా సాగే చిత్రం. అనూప్ మ్యూజిక్, విజ‌య్‌కుమార్ సినిమాటోగ్ర‌ఫీ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయి’’ అన్నారు.

చిత్ర నిర్మాత‌లు సోమా విజయ్ ప్రకాష్, ప‌ల్లికేశ‌వ‌రావ్ మాట్లాడుతూ ”మా బ్యానర్ లో చేస్తున్న రెండో మూవీ ‘సరదా’. ‘సరదా’ను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా రూపొందిస్తున్నాం. ‘సరదా’ అనే టైటిల్ ఎంత ఎంటర్ టైనింగ్ గా ఉందో సినిమాలో అంతకంటే ఎక్కువ ఎంటర్ టైన్ మెంట్ ఉంటుంది. టైటిల్ కి తగ్గట్టే ‘సరదా’లో దర్శకుడు కార్తీక్ రెడ్డిగారు మంచు విష్ణుని కొత్తగా చూపిస్తున్నారు. సోనారికతో పాటు మరో ప్రముఖ హీరోయిన్ ఈ చిత్రంలో నటించనుంది. ఆమె వివరాలను త్వరలోనే తెలియజేస్తాం. మా ‘సరదా’ రెండో షెడ్యూల్ పూర్తయింది. ‘సరదా’ సినిమా చాలా బాగా వ‌స్తోంది. దసరా కానుకగా ‘సరదా’ అనే టైటిల్ ను అనౌన్స్ చేయడం హ్యపీగా ఉంది. కథతో పాటు కామెడి కలిసి ఉండి ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా సాగే చిత్ర‌మిది” అన్నారు.

బ్రహ్మానందం, రఘుబాబు, జయప్రకాష్‌రెడ్డి, రవికిషన్‌, పృథ్వీ, రాజా రవీంద్ర, వెన్నెలకిషోర్‌, శ్రీనివాస్‌రెడ్డి, సత్య, నవభారత్‌ బాలాజీ తదితరులు ఇతర తారాగణంగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, కెమెరా: విజయ్‌ సి.కుమార్‌, ఎడిటర్‌: యస్‌.ఆర్‌.శేఖర్‌, ఆర్ట్‌: రామాంజనేయులు, ఫైట్స్‌: విజయ్‌, పి.ఆర్‌.ఓ: వంశీ-శేఖర్‌,నిర్మాణ, నిర్వహణ: సోమా విజయ్‌ప్రకాష్‌, నిర్మాతలు: సోమా విజయ్ ప్రకాష్, పల్లి కేశవరావు, రచన-దర్శకత్వం: జి.కార్తిక్‌ రెడ్డి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close