మంగళి కృష్ణ మళ్లీ దొరికాడు..! వ్యాపారం లో వాటా ఇవ్వకపోతే ఏం చేస్తాడంటే….!

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్య అనుచరుడు మంగలి కృష్ణ అలియాస్ దంతులూరి కృష్ణ బెదిరింపుల కేసు నమోదయింది. అనుచరులతో కలిసి కొంత కాలంగా సెటిల్మెంట్లు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దంతులూరి కృష్ణ.. వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. జగన్ కు చిన్ననాటి స్నేహితుడు. వైఎస్ అధికారంలో ఉన్న సమయంలో… అనేక నేర కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఆజ్ఞాతంలో ఉంటున్నారు. ఎక్కువగా హైదరాబాద్ లో ఉంటున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ ప్రభుత్వం గన్‌మెన్లకు కేటాయించిందని.. గతంలో.. సోషల్ మీడియా చానళ్లకు ఇచ్చిన ఇంటర్యూల్లో చెప్పుకొచ్చారు. ఇటీవల జగన్ పై.. విశాఖ విమానాశ్రయంలో కోడి కత్తితో దాడి జరిగిన తర్వాత…. ఆయన హైదరాబాద్ లోని సిటీ న్యూరో ఆస్పత్రిలో చికిత్స చేయించుకోవడానికి చేరారు. అక్కడ ఏర్పాట్లన్నీ మంగలి కృష్ణనే చేశారు.

ఆస్పత్రి లోపలి దృశ్యాల్లో మంగలి కృష్ణ వైసీపీ నేతలతో ఉల్లాసంగా ఉత్సాహంగా మాట్లాడుతూ ఉండటం కనిపించింది. చెందిన మంగళి కృష్ణ అనుచరులు హైదరాబాద్‌లో వీరంగం సృష్టించారు. వ్యాపారంలో భాగస్వామ్యం ఇవ్వాలంటూ ఓ స్థిరాస్తి వ్యాపారిపై మంగళి కృష్ణ అనుచరులు ఒత్తిడి తెచ్చారు. ఆ వ్యాపారి ఇంట్లోకి చొరబడి కారు, వస్తువులు ధ్వంసం చేశారు. దీంతో మంగళికృష్ణపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. కృష్ణపై దౌర్జన్యం, దాడి, భూకబ్జా ఆరోపణలపై పలు కేసులు ఉన్నాయి. దేశ, విదేశాల్లో నిర్మాణ వ్యాపారాలు నిర్వహించే దుర్గారావు, ఆయన కుమారుడు సుభాష్ హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో నివసిస్తున్నారు. ఇటీవల వారి ఇంట్లో కొందరు చొరబడి కారు, అద్దాలు, లైట్లు ధ్వంసం చేశారు. పోలీసులు సీసీ ఫుటేజ్ పరిశీలించగా.. కడప జిల్లా పులివెందులకు చెందిన సమీర్‌ను గుర్తించారు. సమీర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా… విష్ణువర్ధన్ రెడ్డి, మోహన్, వీరబాబు, ప్రతాప్‌లతో కలిసి ఈ దాడికి పాల్పడినట్లు సమీర్ అంగీకరించాడు.

పులివెందులకు చెందిన మంగళికృష్ణ ఆదేశాల మేరకు దాడి చేసినట్లు చెప్పాడు. వ్యాపారంలో తనకు భాగస్వామ్యం ఇవ్వాలని మంగళికృష్ణ కొంతకాలంగా బెదిరిస్తున్నాడని సుభాష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుభాష్ ఫిర్యాదు మేరకు మంగళికృష్ణ, అతని అనుచరులపై జూబ్లీహిల్స్ పోలీసులు ఐపీసీ 448, 427 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సమీర్, విష్ణువర్ధన్ రెడ్డిలను ఈనెల 5న అరెస్టు చేశారు. ఈ కేసులో మంగళికృష్ణ నిన్న నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు. కృష్ణను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కృష్ణను కిడ్నాప్ చేశారంటూ అతని అనుచరులు కొంతసేపు హంగామా సృష్టించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

బస్సు యాత్ర : వైసీపీ రాంగ్ స్ట్రాటజీ

ఎన్నికల షెడ్యూల్ వచ్చినా నోటిఫికేషన్ రావడానికి సమయం ఉండటంతో...జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్లాన్ చేసుకున్నారు. ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి బస్సు యాత్ర...

చ‌ర‌ణ్ సినిమాలో.. సుకుమార్ హ్యాండ్ ఎంత‌?

సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ సినిమా తీశాడంటే అందులో త‌న క్రియేటీవ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా త‌ప్ప‌కుండా ఉంటుంది. 'విరూపాక్ష‌' సినిమా స్క్రీన్ ప్లేలో సుకుమార్ ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close