మ‌ణి సార్‌… తెలుగు అంటే ఎందుకంత చిన్న‌చూపు?

రేపే `న‌వాబ్‌` విడుద‌ల‌. త‌మిళ నాట ఈ సినిమాకున్న క్రేజ్ తెలుగులో లేకుండా పోయింది. త‌మిళ‌నాట గురువారం ఉద‌యం ఆట‌ల‌కు టికెట్ల‌న్నీ ఇప్ప‌టికే బుక్ అయిపోయాయి. తెలుగులో మాత్రం ప‌ది శాతం క్రేజ్ కూడా లేదు. దీనికి కార‌ణం… మ‌ణిర‌త్నం చేసిన చేస్తున్న ప‌బ్లిసిటీనే. మ‌ణిర‌త్నంకి తెలుగునాటా వీరాభిమానులు ఉన్నారు. అంతెందుకు?? సినిమాని ప్రేమించిన వాళ్లంతా.. ఆయ‌న్ని ఇష్ట‌ప‌డ‌తారు. టాక్ ఎలా ఉన్నా… థియేట‌ర్లో వాలిపోవాల‌ని చూస్తారు. అయినా స‌రే, ఇక్క‌డున్న మార్కెట్ ని ఆయ‌న ప‌ట్టించుకోవ‌డం లేదు. `న‌వాబ్‌`కి సంబంధించి ఒక్క రోజంటే ఒక్క‌రోజు ప్ర‌మోష‌న్ల‌కు కేటాయించారు. అది కూడా తూతూ మంత్రంగానే సాగింది. తెర‌పై ఒక్క జ‌య‌సుధ త‌ప్ప‌… తెలుగుకు సంబంధించిన న‌టీన‌టులెవ‌రూ క‌నిపించ‌లేదు. ప్ర‌కాష్ రాజ్ ఉన్నా.. ఆయ‌న‌ది క‌న్న‌డ‌సీమ అని గుర్తించుకోవాలి. తెలుగులోనూ త‌మ సినిమాని మార్కెట్ చేసుకోవాల‌నుకున్న‌వాళ్లు క‌చ్చితంగా కొన్ని సూత్రాల్ని పాటించాల్సిన అవ‌స‌రం ఉంది. తెలుగుకి సంబంధించిన న‌టీనటుల్ని ఎంపిక చేసుకోవ‌డం, తెలుగులో ప్ర‌చారం ముమ్మ‌రంగా చేయ‌డం అందులోని అంశాలే. కానీ మ‌ణి ఈ రెండు విష‌యాల్నీ ప‌ట్టించుకోలేదు.

పైగా సినిమా సినిమాకీ ఆయ‌న త‌న బ‌య్య‌ర్ల‌ను మార్చుకుంటూ వెళ్తున్నారు. అటు ప్ర‌చార‌మూ లేక‌, ఇటు సినిమాపై న‌మ్మ‌క‌మూ లేక‌… `న‌వాబ్‌` సినిమాని కొన‌డానికి ఎవ‌రు ముందుకొస్తారు?? అయినా స‌రే,… మ‌ణి అదృష్ట‌మో, మ‌రోటో.. ఎవ‌రో ఓ బ‌య్య‌ర్ దొరుకుతూనే ఉన్నాడు. తాజాగా `న‌బాబ్‌`ని తెలుగులో రూ.3 కోట్ల‌కు కొన్నారు. ప‌బ్లిసిటీ ఈ రేంజులో ఉంటే… ఓపెనింగ్స్ ఎలా వ‌స్తాయి? సినిమా ఫ‌లితం అటూ ఇటూ అయితే… ఆ డ‌బ్బులు కూడా వెన‌క్కి రావు. తెలుగులో త‌న‌కున్న అభిమానుల గురించి కాక‌పోయినా.. త‌న సినిమాని కొన్న బ‌య్య‌ర్ల గురించైనా మ‌ణిర‌త్నం ఓసారి ఆలోచించుకుంటే బాగుంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close