వరసగా పట్టుబడుతున్న చైన్ స్నాచర్‌లు

హైదరాబాద్: ఈ ఉదయం కేబీఆర్ పార్క్‌ సమీపంలో నడుచుకుంటూ వెళుతున్న నవీన అనే మహిళను ఒక దొంగ కత్తితో బెదిరించి మెడలో చైన్, సెల్ ఫోన్ ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అయితే ఆ మహిళ నిరాకరించటంతో తనవద్ద ఉన్న కత్తితో దాడిచేశాడు. అయినా ఆమె గట్టిగా అరుస్తూ ప్రతిఘటించగా స్థానికులు వచ్చి ఆ దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

తెలుగు రాష్ట్రాలు రెండింటిలో పెద్ద బెడదగా దాపురించిన చైన్ స్నాచర్లకు ఇటీవల గడ్డుకాలం దాపురించినట్లుంది. రెండు రోజులక్రితం అనంతపురంలో ఒక మహిళ మెడలో గొలుసు తెంపుకు పోతున్న ఇద్దరు దొంగలను ఒక యువకుడు ధైర్యంగా పట్టుకున్నాడు. చైన్ లాక్కొని పరారవుతున్న వారి బైక్‌కు తన బైక్ అడ్డం పెట్టి పడేసి ఇద్దరినీ పోలీసులకు అప్పగించాడు. తీవ్రగాయాల పాలైన ఆ ఇద్దరూ నగరానికే చెందిన షేక్ వలీ, మహ్మద్ వలీగా గుర్తించారు. మరోవైపు ఆదివారం వరంగల్ పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఒక జంట బంగారు ఆభరణాలతో హైదరాబాద్ వెళుతూ పట్టుబడింది. వారివద్ద దొరికిన బంగారు ఆభరణాల బరువు 3 కిలోల 10 గ్రాములు. వీటి విలువ రు.82 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ దంపతులు టీవీ ఛానల్స్‌లో క్రైమ్ న్యూస్ చూసి స్ఫూర్తి పొంది చైన్ స్నాచింగ్‌లు ప్రారంభించారు. 2013నుంచి వీరు ఈ పనిలో ఉన్నట్లు తెలిసింది. హైదరాబాద్‌లో హైస్పీడ్ బైకులపై చక్కర్లు కొడుతూ స్నాచింగ్‌కు పాల్పడుతున్న ముఠాను పోలీసులు గత నెల 28న అరెస్ట్ చేశారు. వీరినుంచి 465 గ్రాముల బంగారు ఆభరణాలు, హైస్పీడ్ బైకులు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఉదయంపూట ఒంటరిగా ఉన్న మహిళలనుంచి వీరు ఆభరణాలు దోచేవారని పోలీసులు చెప్పారు. పదిహేను రోజుల క్రింత విశాఖ జిల్లాలో చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ఒక వ్యక్తిని పెందుర్తి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దుబ్బ పాలెం గ్రామానికి చెందిన ఆ దొంగ ఉదయం వేళల్లో ఒంటరిగా ఉండే మహిళలను లక్ష్యంగా చేసుకుని చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్నాడు. అతనివద్దనుంచి పోలీసులు 400 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.

మొత్తం మీద ఈ మధ్యకాలంలో చైన్ స్నాచర్‌లు బాగానే పట్టుబడుతున్నారు. పట్టుబడినవారిని పరిశీలిస్తే ఎక్కువమంది విద్యార్థులే ఉండటం విశేషం. హైదరాబాద్‌లో చైన్ స్నాచింగ్ సందర్భంగా కొంతమంది బాధిత మహిళలు ప్రాణాలుకూడా కోల్పోవటం విచారకరం. వీటిని అదుపుచేయటానికి పోలీసులు మరింత పటిష్ఠ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close