అది గీత అదృష్టమనుకోవాలా లేకపోతే..

సల్మాన్ ఖాన్ నటించిన ‘బజరంగీ భాయ్ జాన్’ సినిమా కారణంగా పాకిస్తాన్ నుంచి ‘గీత’స్వదేశానికి చేరుకోగలిగింది కానీ ఆమె భారత్ చేరుకొని పడి రోజులయినా ఇంతవరకు తన అసలయిన తల్లి తండ్రులను చేరుకోలేకపోయింది. బిహార్ కు చెందిన జనార్ధన్ మహతో గీత తమ కూతురేనని భావించారు. కానీ గీత ఆయనని తన తండ్రిగా గుర్తించలేకపోవడంతో వారిరువురి రక్త నమూనాలు సేకరించి డి.ఎన్.ఏ. పరీక్షలకు పంపారు. వాటి ఫలితాలు రావడానికి కనీసం మరొక వారం పది రోజులు పట్టవచ్చును. అంతవరకు గీతను మధ్యప్రదేశ్ లో ఇండోర్ పట్టణంలో గల మూగ చెవుడు బాలికల శిక్షణ, వసతి గృహంలో ఉంచారు.

ఖమ్మం జిల్లా నుండి దంపతులు, అలాగే ఉత్తరప్రదేశ్ లో ప్రతాప్ ఘర్ లో రాం కా పూర్వ అనే గ్రామానికి చెందిన దంపతులు, మరో రెండు మూడు రాష్ట్రాల నుండి కొందరు దంపతులు గీత తమ కూతురేనని భావిస్తున్నారు. వారిలో కొందరు విదేశాంగ శాఖకు తమకు డి.ఎన్.ఏ. పరీక్షలు నిర్వహించి గీత తమ కూతురు అని నిర్ధారణ అయితే ఆమెను తమకు అప్పగించాలని దరఖాస్తు చేసుకొన్నారు. వారిలో ప్రతాప్ ఘర్ కి చెందిన రామరాజ్ గౌతం, అనరా దేవి దంపతులు గీత ఖచ్చితంగా చిన్నప్పుడు తప్పిపోయిన తమ కుమార్తె సవిత అని చెపుతున్నారు.

వారు జిల్లా కలెక్టర్ పి. నరహరిని కలిసి “నా బావమరిది ఒక సాధువు. ఆయన బిహార్ లోని చప్రా లో ఒక ఆశ్రమంలో ఉంటారు. మా పాపకున్న మూగ చెవుడు సమస్యలను ఆయన సరిచేస్తారనే నమ్మకంతో మేము మా పాపని ఆయన ఆశ్రమంలో వదిలి పెట్టి వచ్చేము. అప్పుడు ఆమె వయసు సుమారు 8 ఏళ్ళు. కొన్ని రోజుల తరువాత మా పాప ఆశ్రమం నుంచి ఏటో వెళ్లిపోయిందని తెలిసి పాప కోసం చాల చోట్ల వెతికాము కానీ ఆమె ఆచూకి దొరకలేదు. మళ్ళీ ఇన్నాళ్ళ తరువాత గీత రూపంలో మాముందు ప్రత్యక్షమయింది. ఆమె మా పాపేనని నిరూపించుకొనేందుకు మేమిద్దరం డి.ఎన్.ఏ. పరీక్షలు చేయించుకోవడానికి సిద్దం. ఒకవేళ ఆమె మమ్మల్ని తల్లి తండ్రులుగా గుర్తుపట్టలేకపోతే మేము మరో మాట మాట్లాడకుండా వెనక్కి తిరిగి వెళ్లిపోతాము,” అని చెప్పారు. వారు తమ వద్ద ఉన్న సవిత (గీత) చిన్నప్పటి ఫోటోను తెచ్చి చూపిస్తున్నారు. వారి దరఖాస్తును జిల్లా కలెక్టర్ పి. నరహరి విదేశాంగ శాఖకు పంపారు. అక్కడి నుంచి పిలుపు వస్తే వారిరువురినీ డిల్లీ పంపించి డి.ఎన్.ఏ. పరీక్షలు చేయిస్తామని తెలిపారు.

గీతకు ఇంతవరకు తల్లి తండ్రులను చేరుకోలేకపోవడం దురదృష్టమనుకొంటే, ఆమె కోసం దేశంలో ఇంతమంది తల్లి తండ్రులు తపించిపోతుండటం అదృష్టంగా భావించాలి. మరో విశేషం ఏమిటంటే ఆమె భారత్ చేరుకోవడానికి మూల కారణమయిన బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ఖాన్‌ను త్వరలో కలుసుకోబోతోంది. ఈనెల 8-10 తేదీలలో ముంబైలో అమితాబ్‌ బచ్చన్‌ చేస్తున్న ఒక రియాలిటీ షో ‘ఆజ్‌ కీ రాత్‌ హై జిందగీ’ అనే కార్యక్రమంలో పాల్గొని సల్మాన్ ఖాన్‌ను కలుసుకొనేందుకు గీత ముంబై వస్తోంది. ఆమె తన అసలయిన తల్లి తండ్రులను చేరుకోనేవరకు బహుశః ఇటువంటి పెద్దపెద్ద నటులు, వి.ఐ.పి.లను కలుస్తూ ఆమె కూడా ఒక సెలబ్రిటీగా ఎదిగిపోతుందేమో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంత్రి ఉత్తమ్ ఇలాకాలో విద్యార్ధినిలకు అస్వస్థత..రీజన్ అదేనా..?

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులు వరుసగా అస్వస్థతకు గురి అవుతుండటం కలకలం రేపుతోంది. యదాద్రి భువనగిరి జిల్లా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కు గురై ఇటీవల ఓ విద్యార్ధి...

చిలుకూరుకు పోటెత్తిన భక్తులు…ఫుల్ ట్రాఫిక్ జామ్

కోరిన కోరికల్ని తీర్చే సుప్రసిద్ధ చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఆలయ సిబ్బంది అంచనా వేసిన దానికంటే పది రేట్లు ఎక్కువగా రావడంతో క్యూలైన్లు అన్ని నిండిపోయాయి. ఆలయానికి...

అచ్చెన్నాయుడు అన్నీ అలా కలసి వస్తున్నాయంతే !

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అన్నీ అలా కలసి వస్తున్నాయి. ఆయన ప్రత్యర్థి .. దువ్వాడ శ్రీనివాస్.. భార్య చేతిలోనే పదే పదే ఓడిపోతున్నారు. తాజాగా మరోసారి ఆయన భార్య రంగంలోకి దిగారు....

‘పారిజాత ప‌ర్వం’ రివ్యూ: సినిమా తీయ‌డం ఓ క‌ళ‌!

Parijatha Parvam movie review తెలుగు360 రేటింగ్: 1.5/5 'కిడ్నాప్ చేయ‌డం ఓ క‌ళ‌'... అనే కాన్సెప్ట్‌తో రూపొందించిన చిత్రం 'పారిజాత ప‌ర్వం'. దాన్ని బ‌ట్టి ఇదో కిడ్నాప్ క‌థ‌ అని ముందే అర్థం చేసుకోవొచ్చు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close