మోదీ బ్రాండ్ “మసాలా”..! బీజేపీ మార్క్ ఘాటు..!!

‘మీ అంతట మీరే మీడియాకు మసాలా కావొద్దు. అనవసర విషయాల జోలికి వెళ్లి వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దు’… బీజేపీ నేతలకు వారం రోజుల క్రితం ప్రధాని నరేంద్రమోదీ చేసిన పదునైన సూచన ఇది. మోదీ మాటలను… బీజేపీ నేతలు మరోలా అర్థం చేసుకున్నారు. ఆడవారి మాటలకు అర్థాలే వేరులో టైపులే.. బీజేపీలో మోదీ మాటలకు అర్థాలే వేరనే.. ఆదేశాలు ఉన్నాయేమో అనుకుని… భారతీయ జనతాపార్టీ నేతలు రెచ్చిపోతున్నారు. ఒకరిని మించిన ఒకరు మసాలా ప్రకటనలు చేస్తూ పోతున్నారు. మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నారు.

వివాదాస్పద ప్రకటనలకు బీజేపీ నేతలు ఎప్పుడూ బ్రాండ్ అంబాసిడర్లే. అయితే వారి వ్యాఖ్యలు గతంలో విద్వేష పూరితంగా ఉండేవి. కొన్ని వర్గాలను కావాలని రెచ్చగొట్టేందుకు చేసినట్లు ఉండేవి. అందుకే విద్వేషపూరిత ప్రసంగాల్లో అత్యధిక కేసులు బీజేపీ నేతలపైనే ఉన్నాయని.. రెండు రోజుల క్రితం వచ్చిన ఏడీఆర్ నివేదిక తేల్చింది. అయితే ఇటీవలి కాలంలో ఆ డోస్ లో తేడా రానప్పటికీ… ప్రత్యేకమైన మార్పు చూపిస్తున్నారు బీజేపీ నేతలు. అదీ కూడా మోదీ.. ఎలాంటి మసాలా ప్రకటనలు చేయవద్దని… తమ నేతలకు స్పష్టమైన సూచనలు ఇచ్చిన తర్వాత.. తమ మార్క్ వివాదాస్పద కామెంట్లకు మరింత మసాలా జోడించి మీడియాకు మసాలా అందిస్తున్నారు.

నిన్నగాక మొన్న త్రిపురకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విప్లవ్ దేవ్ ( బిప్లబ్ దేబ్ ) అనే కొత్త నేత నోట్లో ఈ మసాలా ఎక్కువ ఊరుతోంది. మొన్నటికి మొన్న మహాభారతంలో ఇంటర్నెట్ వాడారని… ప్రకటించి ఒక్కసారిగా హెడ్ లైన్స్ కు ఎక్కారు. అప్పుడు విప్లవ్ ఫేస్ బుక్ కూడా వాడారని చాలా మంది సెటైర్లు కూడా వేశారు. అదేదో బాగుందనుకున్నారేమో కానీ … ప్రపంచ సుందరి పోటీల మీద మళ్లీ కామెంట్ చేశారు. పనిలో పనిగా డయానా హైడెన్ మీద నోరు పారేసుకున్నారు. స్కిన్ కలర్ మీద చర్చ లేవదీశారు. అది అలా ఉండగానే నిన్నటికి నిన్న సివిల్ సర్వీస్ ఫలితాలు రాగానే.. సివిల్ ఇంజినీర్లంతా..సివిల్ సర్వీస్‌లో చేరి.. దేశాన్ని నిర్మించడానికి అనుభవం సంపాదించుకోవాలని కుళ్లు జోకేశారు. దాంతో బీజేపీ నేతలు భళ్లున నవ్వుకున్నారేమో కానీ… మిగతా వాళ్లకు వాంతి వచ్చినంత పనయింది.

విప్లవ్ దేవ్ మాత్రమే కాదు… హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ దగ్గర్నుంచి చాలా చాలా హై ప్రోఫైల్ మినిస్టర్స్ కూడా మసాలాలను దట్టించి ప్రకటనలు చేస్తున్నారు. రాజ్‌నాథ్..రాముడు, కృష్ణుడే రాజకీయాలు చేశారని కొత్త కోణం ఆవిష్కరించారు. దీన్ని అందిపుచ‌్చుకున్న హ్యూమన్ రిసోర్సెస్ మినిస్టర్ జవదేకర్.. ఆధునిక విద్యావ్యస్థ ఫెయిలయిపోయిందని తేల్చి.. భారతీయ విద్యావ్యవస్థకు వేదాలు ఒక్కటే మార్గమని నిర్ణయించేశారు. అంతటితో ఆగలేదు.. కొత్త విధానాన్ని సిద్ధం చేస్తున్నారట. త్వరలో ప్రకటిస్తారట.

మొత్తానికి మోదీ మసాలా ప్రకటనలు చేసి.. మీడియాలో హైలెట్ కావొద్దని చెప్పారో..అవే చేసి.. సమస్యలపై చర్చ రాకుండా… వాటిపైనే మీడియా దృష్టి పెట్టేలా చేయమన్నారో కానీ.. బీజేపీ నేతలు మాత్రం ప్రస్తుతం తమ ప్రకటనల్లో మసాలాను దట్టించేందుకు పోటీ పడుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close