మారుతి భ‌యం అదే!

ఓ మాదిరి హీరో సినిమా వ‌చ్చి చాలా రోజులైంది. `శైల‌జా రెడ్డి అల్లుడు`తో ఆ లోటు తీర‌బోతోంది. మారుతి బ్రాండ్ – `అల్ల‌రి అల్లుడు` టైపు కాన్సెప్ట్ తో… ఈసినిమాపై అంచనాలు ఏర్ప‌డ్డాయి. పైగా శివ‌గామి క్రేజ్‌, అనుఇమ్మానియేల్ గ్లామ‌ర్ ఈ సినిమాకి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌లుగా నిలిచాయి. కాక‌పోతే.. మారుతిని ఓ భ‌యం వెంటాడుతోంది. `శైల‌జా రెడ్డి అల్లుడు` అనే పేరు వ‌ల్ల ప్ర‌మాదం ఏమైనా పొంచి ఉందేమో అన్న‌ది ఆయ‌న అనుమానం. ఎందుకంటే.. టైటిల్లో పాత వాస‌న కొడుతోంది. పైగా.. అత్తా అల్లుళ్ల కాన్సెప్ట్‌లో చాలా సినిమాలొచ్చాయి. అది ముత‌క ఫార్ములా అయిపోయింది. ఇప్పుడు అలాంటి క‌థ‌ల్ని చూడ్డానికి ఎవ‌రూ ఇష్ట‌ప‌డ‌డం లేదు. మారుతి క‌థ అత్తా అల్లుళ్ల గొడ‌వ కాదు. అత్త‌కీ, అత్త‌కూతురికీ ఉన్న ఈగో వ‌ల్ల అల్లుడు ఎలా న‌లిగిపోయాడ‌న్న‌ది కాన్సెప్ట్‌. ఇప్ప‌టి వ‌ర‌కూ ఇలాంటి కాన్సెప్ట్ రాలేదు. కానీ.. జ‌నం మాత్రం ఇది రొటీన్ అత్తా అల్లుళ్ల క‌థ అనుకునే ప్ర‌మాదం ఉంది. అందుకే మారుతి భ‌య‌ప‌డుతున్నాడు. `టైటిల్ పాత‌దే కానీ.. క‌థ కొత్త‌ది`, `ఇది మామూలు అత్తా అల్లుళ్ల క‌థ కాదు` అని ప‌దే ప‌దే చెబుతున్నాడు. మొన్న మీడియాకి ఇచ్చిన ఇంట‌ర్వ్యూల‌లోనూ, నిన్న జ‌రిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనూ మారుతి ప్ర‌సంగంలోని ముఖ్యాంశం ఇదే. పేరు పెట్టేట‌ప్పుడే మారుతి ఈ విష‌యాన్ని ఆలోచించాల్సింది. ఇప్పుడు లేట్ అయిపోయింది. సినిమా విడుద‌లై… ఓ షో ప‌డ్డాక‌.. `ఇది రెగ్యుల‌ర్ సినిమా కాదులే` అని ప్రేక్ష‌కుడు న‌మ్మాక‌… మారుతి భ‌యం పోతుంది. అంత వ‌ర‌కూ.. ప్రేక్ష‌కులు ఎలా రిసీవ్ చేసుకుంటారో.. అనే అనుమానాలు మాత్రం వెండాడుతూనే ఉంటాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హిందూపురం నుంచి పరిపూర్ణనంద పోటీ – బాలకృష్ణే కారణమా..?

హిందూపురం అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు శ్రీపీఠం వ్యవస్థాపకుడు పరిపూర్ణనంద స్వామి.లోక్ సభకు పోటీ చేస్తానని ప్రకటించి అనూహ్యంగా అసెంబ్లీకి పోటీ చేస్తుండటం చర్చనీయాంశం అవుతోంది. బీజేపీ తరఫున...

పవన్‌ను ఆశీర్వదించిన పిఠాపురం !

పిఠాపురం చరిత్రలో ఎప్పుడూ లేనంత భారీ ర్యాలీ జరిగింది. పవన్ తాను అద్దెకు తీసుకున్న చేబ్రోలులోని ఇంటి నుంచి నామినేషన్ వేసేందుకు ఆర్వో ఆఫీసుకు వచ్చేందుకు ఐదు గంటలకుపైగా సమయం...

సూరత్ తరహాలో సికింద్రాబాద్ చేజారుతుందా..?

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మల్కాజ్ గిరి, సికింద్రాబాద్ , చేవెళ్లలో ఎలాగైనా గెలవాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. మల్కాజ్ గిరి, చేవెళ్లలో అభ్యర్థుల ప్రచారంలో దూకుడుగా సాగుతున్నా సికింద్రాబాద్ లో మాత్రం...

వైసీపీకి ఏబీవీ భయం – క్యాట్ ముందు హాజరు కాని ఏజీ !

సస్పెన్షన్ లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కేసును వీలైనంతగా లేటు చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. విచారణకు హాజరు కావాల్సిన అడ్వాకేట్ జనరల్ డుమ్మా కొట్టారు. అదే కారణం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close