ఎంసీఏ ట్రైల‌ర్ : మ‌రిది Vs వ‌దిన‌ల వినోదం


నాని సుడి గిర్రుగిర్రున తిరుగుతోంది. భ‌లేటి ప్రాజెక్టులు ప‌డుతున్నాడు. అన్నీ హిట్లే. ఎంసీఏలోనూ ఆ ల‌క్ష‌ణాలు స్ప‌స్పుటంగా క‌నిపిస్తున్నాయి. వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్ర‌మిది. సాయి ప‌ల్ల‌వి క‌థానాయిక‌. దిల్‌రాజు నిర్మాత‌. ఈనెల 21న విడుద‌ల అవుతోంది. 16న వ‌రంగ‌ల్‌లో ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ చేస్తున్నారు. ఇప్పుడు ట్రైల‌ర్ వ‌చ్చింది.

ఇది వ‌దిన – మ‌రిదిల క‌థ అని దిల్‌రాజు ముందే హింట్ ఇచ్చేశాడు. ఆ క‌థ ఎలా సాగ‌బోతోందో… ట్రైల‌ర్‌లో డిటైల్డ్‌గా చూపించారు. వదిన పాత్ర‌లో భూమిక క‌నిపించ‌బోతోంది. అదో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఆ ఇంట్లో వ‌దిన‌దే పెత్త‌నం. మ‌రిది గారేమో.. జ‌స్ట్ ప‌ని మ‌నిషి టైప‌న్న‌మాట‌. వ‌దిన‌పై ఫ‌స్ట్రేష‌న్‌. ఏం చేయాలో తెలీక పిన్నితో మొర పెట్టుకుంటుంటాడు. చివ‌రికి ఆ వ‌దిన‌కే ఓ స‌మ‌స్య వ‌స్తుంది. అప్పుడు మిడిల్ క్లాస్ అబ్బాయి ఏ విధంగా రివైంజ్ తీర్చుకున్నాడ‌న్న‌ది క‌థ‌. ట్రైల‌ర్ చూస్తే… క‌థ సింపుల్‌గా అర్థ‌మైపోతోంది. ఇందులో పెద్ద‌గా మెరుపులేం లేవు గానీ, నాని ఎప్ప‌ట్లా త‌న స‌హ‌జ‌సిద్ధ‌మైన న‌ట‌న‌తో డైలాగుల్ని వ‌ల్లించి… ర‌క్తి క‌ట్టించే ప్ర‌య‌త్నం చేశాడు. సాయి ప‌ల్ల‌విని ట్రైల‌ర్‌లో స‌రిగా చూపించ‌లేదేమో అనిపిస్తోంది. దేవి ఇచ్చిన ఆర్‌.ఆర్ ఓకే అనిపిస్తే.. విజువ‌ల్స్ మాత్రం ఎప్ప‌ట్లా రిచ్‌గానే క‌నిపించాయి. ఈ సినిమా ద్వారా ఓ కొత్త విల‌న్‌ని చూసే అవ‌కాశం ల‌భించిన‌ట్టైంది. మొత్తానికి మిడిల్‌క్లాస్ అబ్బాయి ఆక‌ట్టుకొనేలానే ఉన్నాడు. మ‌రి వెండి తెర‌పై ఏం జ‌రుగుతుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.