టీజ‌ర్ టాక్ : ‘మేడ‌మీద అబ్బాయి’

గ‌త కొన్నాళ్లుగా అల్ల‌రి న‌రేష్‌కి హిట్లు లేవు. క‌నీసం యావ‌రేజ్ కూడా చూడ‌లేక‌పోయాడు. అందుకే యేడాదికి నాలుగు సినిమాలు చేసే న‌రేష్‌… ఒక‌ట్రెండు సినిమాల‌తోనే స‌రిపెట్టుకొన్నాడు. ఇప్పుడు త‌న ఆశ‌ల‌న్నీ.. `మేడ మీద అబ్బాయి`పైనే. మ‌ల‌యాళ చిత్రానికి ఇదో రీమేక్‌. మాతృక‌కు ద‌ర్శక‌త్వం వ‌హించిన ప్ర‌జీత్‌…. ఈ చిత్రాన్నీ టేక‌ప్ చేశాడు. అవ‌స‌రాల శ్రీ‌నివాస్ కీల‌క పాత్ర‌ధారి. చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. టీజ‌ర్ ఈరోజే విడుద‌ల చేశారు. టీజ‌ర్‌లో పెద్ద‌గా మెరుపులేం లేవు. కాక‌పోతే.. నీట్‌గా ఉంది. న‌రేష్ క్యారెక్ట‌ర్ ని ప‌రిచ‌యం చేయ‌డానికి ఈ టీజ‌ర్‌ని వాడుకొన్నాడు దర్శ‌కుడు. పంచ్‌లు ఏం లేక‌పోయినా చూడ్డానికి బాగుంది. షాన్ రెహ‌మాన్ అందించిన ఆర్‌.ఆర్‌… హాంటింగ్ గా అనిపిస్తోంది. ప్ర‌భాస్ కో, రామ్ చ‌ర‌ణ్ కో క‌థ చెప్పేసి – డైరెక్ట‌ర్ అయిపోవాల‌న్న‌ది హీరో ఆశ‌యం. అత‌ని జీవితంలోకి ఓ అమ్మాయి ప్ర‌వేశిస్తుంది. త‌న‌తో దిగిన ఓ సెల్ఫీ వ‌ల్ల‌… హీరో జీవితం త‌ల‌కిందుల‌వుతుంది. ఆ త‌ర‌వాత ఏమైంద‌న్న‌దే స్టోరీ. మ‌ల‌యాళంలో ఈ సినిమా సూప‌ర్ హిట్ట‌య్యింది. తెలుగులోనూ అదే ఫ‌లితం రిపీట్ అయితే అల్ల‌రి న‌రేష్ కెరీర్ గాడిలో ప‌డుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com