మీడియాలో ఈ అంతర్మధనం గోల ఏమిటో

తమ్ముడూ మీడియాలో ఏమిటీ కాకి గోల?
దేని గురించి అన్నా?

అదే నేనేదో అంతర్మధనం చెందుతున్నట్లు వార్తలు వస్తున్నాయే అవి.
దేని గురించి అంతర్మధనం అన్నా?

అబ్బ పాయింట్ క్యాచ్ చేయలేవు..ప్రతీది విడమరిచి చెప్పాల్సిందే..అదే నాకు దూకుడు ఎక్కువయిపోవడంతో ప్రతీసారి ఎదురు దెబ్బలు తింటున్నానని మధనపడుతున్నానుట!
మహేష్ బాబు సినిమాలో ప్రతీ మనిషికి దూకుడు ఉండాలని చెప్పాడు కదన్నా…ఆ దూకుడు వల్లే ఆ సినిమా హిట్ అయ్యింది కదన్నా మరి నీకు దూకుడు ఎక్కువయిందని వర్రీ అవుతావేమిటన్నా?

అబ్బా సినిమాలు వేరు..రాజకీయాలు వేరు..సినిమాలలో వాళ్లకి కావలసినట్లుగా వాళ్ళు క్లైమాక్స్ ప్లాన్ చేసుకొంటారు..రాజకీయాలలో మనకి ఆ వెసులుబాటు లేదు కదా..
అవునన్నా నిజమే..ఇంతకీ ఏదో అంతర్మధనం అన్నావు అదేమిటి …ఏమయినా ప్రత్యేక ప్యాకేజీయా?

నీ బొందరా…నీ బొంద…అంతర్మధనంలో ‘ధనం’ అని అంటే డబ్బు మూటలు..ప్యాకేజి అనేసుకోవడమేనా…మనం తప్పులు చేస్తున్నామేమోనని బాధపడటం అన్నమాట…
ఓస్ అంతేనా…అయినా మనం ఎప్పుడు తప్పులు చేశామన్నా? లోటస్ పాండ్ ఏసీ గదుల్లో దర్జాగా మారాజులాగా బ్రతకవలసినవాడివి ఎండనక వాననకా కడుపు మాడ్చుకొని మరీ ప్రజల తరపున పోరాడుతున్నావు కదన్నా?ఇంకా ఆ..ఆ.. మధనం ఎందుకు? చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయకముందే పంట రుణాలు మాఫీ చేయాలని పోరాడాము కదా? మరిచిపోయావేమిటన్నా?

అబ్బా..దానిని మధ్యలో ఆపేశాము కదా?
ఆ తరువాత హుదూద్ తుఫాను సహాయ చర్యలు…బాబుగారి విదేశీ యాత్రల గురించి పోరాడాము కదన్నా?

అది పట్టుకొని ఎన్నాళ్ళు వ్రేలాడగలము…?
అవుననుకో ఆ తరువాత రాజధాని భూసేకరణ మీద మంచి ఫైట్ చేసాము కదా?

దాన్నీ మధ్యలో వదిలిపెట్టేసి ప్రత్యేక హోదాకి జంప్ అయిపోయాము కదరా…?
అవునన్నోయ్ మనం ఎప్పుడు జంప్ అయిపోయామో నేను మరిచిపోయినా నువ్వు బాగానే గుర్తు పెట్టుకొన్నావే..అయినా ప్రాబ్లెం ఏమిటి? ముచ్చటగా నాలుగు గంటలు ధర్నా కోసం స్పెషల్ రైళ్ళేసుకొని డిల్లీ వెళ్లిమరీ ధర్నాలు చేసాము..తిరిగి రాగానే ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర బంద్ చేసి మన సత్తా చెక్ చేసుకోన్నాము…ఆ తరువాత తెదేపా ఓళ్ళు ఎన్ని ఇబ్బందులుపెట్టినా పట్టుదలగా కడుపు మాడ్చుకొని వారం రోజులు నిరవధిక నిరాహార దీక్ష చేసావు…ఇంకా ఈ దనం…మధనం ఎందుకన్నా మనకి?

అబ్బా…నీకు ఎలాగా చెపితే అర్ధం అవుతుందిరా…ఆనక ప్రత్యేక హోదా గురించి పోరాటాలు చేయడం మానేశాము కదా?
అవునా…? మనం ప్రత్యేక హోదా కోసం మాట్లాడటం ఎప్పుడు ఆపేశామో నాకే తెలియలేదు…ఎప్పుడు మొదలు పెట్టామో…ఎందుకు మొదలుపెట్టామో..ఎప్పుడు ఆపేశామో…ఎందుకు ఆపేశామో..నాకూ అర్ధం కాలేదన్నా?

అందుకే కదరా మనకి దూకుడు ఎక్కువయిపోయి తప్పులు చేస్తున్నామేమోనని మనం అంతర్మధనం పడిపోతున్నట్లు మీడియాలో తెగ చెప్పేస్తున్నారు..
ఊరుకో అన్నా…నువ్వు మరీను…మనం ఏమయినా తప్పులు చేస్తున్నామా…ఏమిటి..మధ్యలో బ్రేక్ తీసుకొంతున్నాము అంతే…మనం ఏమి చేసిన ప్రజల కోసమే కదా..అయినా మళ్ళీ మనం రాజధాని
భూసేకరణ గురించి ఫైట్ చేస్తామని మొన్నే రైతులకి చెప్పి వచ్చేము కదా?

అవున్రా…నిజమే..కానీ ఎప్పుడో నేను ముఖ్యమంత్రి అయిన తరువాత అమరావతిలో ఆ భవనాల క్రింద నుంచి ఎవరి పొలాలు వాళ్ళకి తీసి ఇచ్చేస్తానని చెపితే రైతులు నామాట నమ్ముతున్నట్లు లేదని డౌట్ వస్తోందిరా….పైగా మనం అమరావతి బయల్దేరగానే మన వెనకాలే ఆ పవన్ కళ్యాణ్ కూడా రెడీ అయిపోతుంటాడు…మనం చచ్చీ చెడీ జనాల్ని పోగేసుకొని రైతుల కోసం కడుపు మాడ్చుకొని ధర్నాలు చేస్తే, ఆ మహానుభావుడు ముందూ వెనక ఒక్కడు లేకపోయినా ‘ఇదిగో నే వస్తున్నా…’ అని ట్వీటర్ లో రెండు ముక్కలు గీకి పడేస్తే చాలు ఓ ఈ వెర్రి జనాలు చీమల పుట్టలోనుంచి చీమలు వచ్చేసినట్లుగా ఎక్కడెక్కడి నుంచో లారీలు బస్సులు కట్టించుకొని మరీ ఎగేసుకు వచ్చేస్తారు…అదేమీ చిత్రమో…?రైతుల కోసం కడుపు మాడ్చుకోనేది మనం.. క్రెడిట్ మాత్రం ఆయన గారిది….అబ్బ మండిపోతోంది అనుకో…
అనుకోవడానికేటన్నా..నిజంగా జరుగుతోంది అదే కదా…

అందుకే ఇప్పుడు భూసేకరణ విషయంలో కూడా మనం డ్రాప్ అయిపోయాము…
అవునా…అదెప్పుడయిందన్నా…నాకు తెలీనే తెలీలేదు…

ఛస్…ఛస్…నీలాంటోడిని వెనకేసుకు తిరగడం నాదే బుద్ధి తక్కువ…వెనకాలే తిరుగుతుంటావు..మళ్ళీ ఎప్పుడు..ఎందుకు…ఏమిటి…అంటూ రామాయణం అంతా విన్న తరువాత రాముడికి సీత ఏమవుతుందనట్లు అడుగుతుంటావు…
నన్ను తిడితే తిట్టావు కానీ అన్నా…నీకు రామాయణం, భారతాల మీద మంచి గ్రిప్పు వచ్చేసినట్లు అర్దమవుతోందన్నా…

ఆ…ఆ…ఈ మధ్య గుళ్ళూ గోపురాలు సాధువులు…పుష్కరాలు ఎటెండ్ అవుతున్నా కదా అందుకేనేమో..
భలే చెప్పవన్నా..ఇంతకీ ఆ..ఆ.. మధనం సంగతి మాట్లాడుకోవడం మరిచిపోయామన్నా…

ఒరేయ్…ఒరేయ్…నీకెలా చెప్పాల్రా బాబు.. ఇంతసేపు మనం మాట్లాడుకొన్నదేమిటి…అదే కదా?
ఆ..ఆ..మధనం అంటే ఓస్ ఇంతేనా…ఈ మాత్రం మాటలు మన చంద్రబాబు వాళ్ళూ మాట్లాడుకొంటారు…డిల్లీలో సోనియా..రాహుల్ గాంధీవాళ్ళూ కూడా మాట్లాడుకొంటారు…బిహార్ లో లాలూ-నితీష్ కుమార్ మాట్లాడుకొంటారు…మనకి తెల్దు గానీ ప్రపంచంలో అందరూ దేనికో దానికి మధనం పడిపోతూనే ఉంటారు…దీనికే నువ్వు ఇంత వర్రీ అయిపోతే ఎలా?

అవుననుకో.. కానీ మీడియా వాళ్ళు దేశంలో మనమొక్కళ్ళమే అంతర్మధనం పడిపోతున్నామని తెగ చెప్పేసుకొంటున్నారు కదా…
అన్నా..నేను కూడా నీకు చెప్పాల్సి వస్తుంటే నాకే సిగ్గేస్తోంది… అవతలోళ్ళు మనల్ని విమర్శిస్తుంటే మన చేతిలో కూడా మీడియా ఉంది కదా..మనోళ్ళకి చెప్పి వాళ్ళకి కౌంటర్ వేసేయమని చెపితే పోలా…?
అవున్రా నిజమే…ఇన్నాళకు కరెక్టుగా చెప్పావు…

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

బస్సు యాత్ర : వైసీపీ రాంగ్ స్ట్రాటజీ

ఎన్నికల షెడ్యూల్ వచ్చినా నోటిఫికేషన్ రావడానికి సమయం ఉండటంతో...జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్లాన్ చేసుకున్నారు. ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి బస్సు యాత్ర...

చ‌ర‌ణ్ సినిమాలో.. సుకుమార్ హ్యాండ్ ఎంత‌?

సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ సినిమా తీశాడంటే అందులో త‌న క్రియేటీవ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా త‌ప్ప‌కుండా ఉంటుంది. 'విరూపాక్ష‌' సినిమా స్క్రీన్ ప్లేలో సుకుమార్ ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా...
video

‘మ‌న‌మే’ ఫ‌స్ట్ సింగిల్: సోలో లైఫే సోబెట‌రంటున్న శ‌ర్వా!

https://www.youtube.com/watch?v=XGJtiqVzZiA ఈమ‌ధ్య టాలీవుడ్ లో గ‌ట్టిగా వినిపిస్తున్న పేరు... హేష‌మ్‌ అబ్దుల్ వాహ‌బ్‌. 'ఖుషి', 'హాయ్ నాన్న‌' సినిమాల్లో సూప‌ర్ హిట్ పాట‌లు ఇచ్చారు. ఇప్పుడు శ‌ర్వానంద్ 'మ‌న‌మే' చిత్రానికీ ఆయ‌నే స్వ‌రాలు అందిస్తున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close