మీడియాకి క్లాస్‌ పీకిన ‘భ‌ర‌త్‌’

హాట్ న్యూస్‌ల కోసం మీడియా ఎంత తాప‌త్ర‌య‌ప‌డుతుందో తెలిసిన విష‌య‌మే. ఈ పోటీ ప్ర‌పంచంలో ఛాన‌ళ్లు, వెబ్ ఛాన‌ళ్లు పుట్ట‌గొడుగుల్లా పెరిగిపోతున్న నేప‌థ్యంలో… సెన్సేష‌న‌లిజం కోసం తాప‌త్ర‌య‌ప‌డిపోతోంది. ఓ వార్త దొరికితే దాన్ని చిల‌వ‌లు ప‌ల‌వ‌లుగా మార్చి… మ‌సాలా అద్దేస్తోంది. ప్ర‌స్తుతం ఏ టీవీ ఛాన‌ల్ చూసినా ఇదే తంతు. జ‌ర్న‌లిజం విలువ‌ల‌పై కూడా గ‌ట్టిగా చర్చ న‌డుస్తోంది. వీటిపై `భ‌ర‌త్ అనే నేను` సినిమాలో కొంత చ‌ర్చ జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. ఓ కీల‌క‌మైన ఎపిసోడ్‌లో ముఖ్య‌మంత్రి హోదాలో మ‌హేష్ ఓ జ‌ర్నలిస్టుకి క్లాస్ పీకుతాడ‌ట‌. ఆ సీన్‌లో జ‌ర్న‌లిజం విలువ‌ల గురించి మ‌హేష్‌తో కొర‌టాల శివ కొన్ని డైలాగులు ప‌లికించాడ‌ని తెలుస్తోంది. ఈ స‌న్నివేశం ఈ సినిమాలో హైలెట్‌గా నిల‌వ‌బోతోంద‌ని టాక్‌. మొత్తానికి భ‌ర‌త్ అనే నేను సినిమాకి సెన్సార్ ప‌రంగా పాజిటీవ్ టాకే వ‌స్తోంది. శ్రీ‌మంతుడులా మ‌హేష్ ఖాతాలో మ‌రో సూప‌ర్ హిట్ ప‌డ‌బోతోంద‌ని టాక్‌. చూస్తుంటే కొర‌టాల శివ వ‌రుస‌గా నాలుగో హిట్ కొట్టేట్టే క‌నిపిస్తున్నాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close