సర్దార్ గురించి మెగా హీరోలు నోరు మెదపరే..!

మెగా హీరోలు పవన్ మీద స్ట్రైక్ ఏమన్నా చేశారా ఏంటి.. అదేంటి మళ్లీ కొత్తగా మొన్ననేగా మెగాస్టార్ వచ్చి సర్దార్ ఆడియోని గ్రాండ్ గా రిలీజ్ చేశారు అంటే.. మరి అంత గ్రాండ్ గా రిలీజ్ అయిన ఆడియో గురించి కాని సర్దార్ గబ్బర్ సింగ్ ట్రైలర్ గురించి కాని మెగా హీరోలైన రాం చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరం తేజ్ లు ఏమీ మాట్లాడకపోవడం ఆశ్చర్యంగా ఉంది.

ఆడియో బాగుందంటూ ప్రస్తావించి ట్రైలర్ టాక్ గురించి మాట్లాడకుండా ఉన్నాడు రాం చరణ్. ఇక ఏ చిన్న సినిమా తన ఆకర్షణలో పడ్డ దాని గురించి పొగిడే అల్లు అర్జున్ కనీసం సర్దార్ గురించి మాట్లాడనేలేదు. ఇక సాయి ధరం తేజ్, వరుణ్ తేజ్ సర్దార్ షూటింగ్ స్పాట్ కి అయితే వెళ్లి సందడి చేశారు కాని.. సర్దార్ ఆడియో గురించి కాని.. ట్రైలర్ గురించి కాని తమ స్పందన తెలుపలేదు. ఇక ప్రతి చిన్న విషయాన్ని ట్వీట్ చేస్తుండే మెగాహీరో అల్లు శిరీష్ కూడా సర్దార్ ఊసే ఎత్తలేదు.

మరి వీరందరికి సర్దార్ గబ్బర్ సింగ్ నచ్చలేదా లేక కావాలనే సర్దార్ గురించి మాట్లాడకుండా దూరం జరుగుతున్నారా అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఒక వారం రోజుల నుండి హోరెత్తిస్తున్న సర్దార్ హంగామా మెగా హీరోల్లో లేకపోవడం కాస్త విచిత్రంగానే ఉంది. ఇక ఒక వైపు సర్దార్ గబ్బర్ సింగ్ ట్రైలర్ అభిమానులు ఊహించనంత పవర్ ఫుల్ గా లేదు అన్న టాక్ కూడా వస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close