క‌రోనా టెన్ష‌న్‌లో మెగా హీరోలు

క‌రోనా `మెగా` ఇంట్లోనే తిష్ట వేసిన‌ట్టు అనిపిస్తోంది. ఆమ‌ధ్య చిరంజీవికి క‌రోనా అనే సంగ‌తి తెలిసింది. అయితే అది.. త‌ప్పుడు స‌మాచారం అని తెలిసి ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. నాగ‌బాబు కూడా కరోనా బారీన ప‌డి తేరుకున్న‌వారే. ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్ కీ కోవిడ్ 19 సోకింది. ఈ విష‌యాన్ని ఆయ‌నే ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌క‌టించారు. క‌రోనా ల‌క్ష‌ణాలేం లేవ‌ని, హోం క్వారెంటైన్‌లో ఉన్నాన‌ని స‌మాచారం అందించారు.

చ‌ర‌ణ్ క‌రోనాకి గురి కావ‌డం.. మెగా హీరోల్ని క‌ల‌వ‌ర పెట్టే విష‌య‌మే. ఎందుకంటే… ఇటీవ‌ల త‌న ఇంట్లో క్రిస్మ‌స్ వేడుక ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ పార్టీలో మెగా హీరోలంతా పాల్గొన్నారు. అల్లు అర్జున్, వ‌రుణ్ తేజ్, సాయిధ‌ర‌మ్ తేజ్ ,అల్లు శిరీష్‌, క‌ళ్యాణ్ దేవ్, నిహారిక‌, చైత‌న్య‌, శ్రీజ‌, సుస్మిత.. ఈ వేడుక‌లోనే క‌లిశారు. ఇప్పుడు వీళ్లంతా కోవిడ్ ప‌రీక్ష‌లు చేయించుకోవాల్సిందే. అంతేకాదు.. ఇటీవ‌ల `ఆచార్య‌` సెట్లో అడుగుపెట్టాడు చ‌ర‌ణ్‌. చాలా సేపు సెట్లోనే ఉన్నాడు. కొర‌టాల శివ‌తో.. కొంత స‌మ‌యం గ‌డిపాడు. ఇప్పుడు ఆయ‌నా.. కోవిడ్ టెస్ట్ చేయించుకోవాల్సిందే. చ‌ర‌ణ్ క‌రోనా బారీన ప‌డ‌డంతో `ఆర్‌.ఆర్‌.ఆర్‌` షూటింగ్ కి మ‌ళ్లీ బ్రేక్ ప‌డే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. ఎట్టిప‌రిస్థితుల్లోనూ ఏప్రిల్ లో ఈ సినిమా షూటింగ్ ముగించాల‌ని రాజ‌మౌళి భావిస్తున్నారు. ఆయ‌న వేగానికి క‌ళ్లెం వేసిన‌ట్టే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close