మెగాస్టార్ ‘కొత్త’ అడుగు.. యువ దర్శకులకు ‘జోష్’ !

మెగాస్టార్ చిరంజీవితో సినిమా అంటే దర్శకులందరికీ మెగా డ్రీమ్. చిన్న, మీడియం,పెద్ద… ఇలా అందరి దర్శకులకు చిరంజీవితో సినిమా చేయాలనే కోరిక వుంటుంది. అయితే ఇప్పటి వరకూ మెగాస్టార్ కెరీర్ లో.. మాస్ హిట్ లేకుండా.. చిన్న, మీడియం దర్శకులతో సెట్స్ పైకి వెళ్ళిన సందర్భాలు చాలా తక్కువ. చిరు కెరీర్ ని పరిశిలిస్తే…రాఘవేంద్రరావు, దాసరి, కే విశ్వనాద్, బాపు, బాలచందర్, జంధ్యాల, భారతీరాజా, విజయ బాపినీడు, కోదండరామి రెడ్డి, బి గోపాల్.. తర్వాత వివి వినాయక్, సురేందర్ రెడ్డి, నేటి కొరటాల శివ వరకూ దాదాపు అందరూ సినీయర్, స్టార్ దర్శకులే.

మధ్యలో శ్రీను వైట్ల లాంటి దర్శకులకు అవకాశం వచ్చినా ” మెగాస్టార్ ని సరిగ్గా చూపించలేకపోయా” అని స్వయంగా ఒప్పుకున్నారు వైట్ల. ఇక మెగాస్టార్ రీఎంట్రీ కోసం చాలా కసరత్తులు చేసి.. చివరికి వివి వినాయక్ వైపే మొగ్గు చూపారు కానీ మరో డైరెక్టర్ వైపు తూగలేదు. కారణం.. మెగాస్టార్ చిరంజీవితో సినిమా అంటే మామూలు విషయం కాదు. మాస్ పల్స్ తెలియాలి. మంచి కథ కుదిరిపోగానే సరిపోదు.. చిరంజీవిని ఎలా ప్రజంట్ చేయాలనే పాయింట్ మీదే.. సక్సెస్ ఆధారపడి వుంటుంది.

ఇప్పుడు సెట్స్ పై వున్న చిరు సినిమాల దర్శకులని పరిశిలిస్తే.. కొరటాల శివ, మెహర్ రమేష్, మోహన్ రాజా.. బాబీ .. వీళ్ళంతా కూడా సినియర్లు. కొరటాల అపజయం ఎరుగని దర్శకుడు. ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబు లాంటి కమర్షియల్ హీరోలతో సినిమాలు చేసి సూపర్ హిట్లు కొట్టారు. మెహర్ రమేష్ ఫామ్ లో లేకపోవచ్చు కానీ ఒక మాస్ హీరోని ఎలా ప్రజంట్ చేయాలో తెలిసిన దర్శకుడు. ప్రభాస్, ఎన్టీఆర్ లతో సినిమాలు చేసిన అనుభవం వుంది. పైగా మెహర్ చేస్తున్నది ఒక రీమేక్. మోహన్ రాజా కూడా సీనియర్. ఆయనదీ రీమేకే. బాబీ విషయానికి వస్తే.,.రవితేజ లాంటి మాస్ హీరో తో రెండు హిట్లు వున్నాయి, ఎన్టీఆర్ ని ట్రిపుల్ యాక్షన్ లో చూపించి హిట్టు కొట్టిన ట్రాక్ రికార్డ్. పవన్ కళ్యాణ్ ని డైరెక్ట్ చేసిన అనుభవం వుంది.

అయితే మెగాస్టార్ చిరంజీవి వచ్చిన కొత్త సినిమా ప్రకటన మాత్రం..నిజంగానే ‘కొత్తగా’ వుంది. యువ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో నటించడానికి సిద్దమయ్యారు చిరు. నిజంగా ఇది చాలా ఫ్రెష్ కాంబినేషన్. వెంకీ కుడుముల ప్రతిభ గల దర్శకుడు. సెన్స్ అఫ్ హ్యుమర్ వున్న రైటర్. చేసిన రెండు సినిమాలు విజయాలే. అయితే అవేం మాస్ ఊగిపోయే ఎలిమెంట్స్ వున్న సినిమాలు కావు. నాగశౌర్యతో చేసిన ‘ఛలో’ సినిమా యూత్ ఫుల్ ఎంటర్ట్రైనర్. నితిన్ చేసిన ‘భీష్మ’ కూడా క్లాస్ అండ్ డీసెంట్ మూవీ. ఈ రెండు సినిమాలు కూడా రైటింగ్ పరంగా సూపర్ గా వుంటాయి. వినోదం వుంటుంది. రెండుగంటల పాటు హాయిగా నడిచే సినిమాలే. ఇప్పుడు ఒకేసారి మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే అవకాశం అందుకున్నాడు వెంకీ.

చిరు కెరీర్ ని పరిశేలిస్తే.. గుణశేఖర్ కి ఇలాంటి మెగా అవకాశం దక్కింది. మాస్ హిట్ లేకుండానే మెగాస్టార్ తో ‘చూడాలనివుంది’ అనే హిట్ తీశాడు. తర్వాత జయంత్ సి పరాన్జీకీ ఇలాంటి అవకాశం వచ్చింది. వెంకటేష్ తో తీసిన ‘ ప్రేమించుకుందాం రా” తర్వాత మెగా ఛాన్స్ అందుకొని ‘బావగారు బావున్నారా ?’ లాంటి హిట్ ఇచ్చారు జయంత్. కానీ అప్పటి ఈక్వేషన్ వేరు. వెంకటేష్, చిరులది దాదాపు ఒకే జనరేషన్. చిరు, వెంకీ ఎక్కడ? శౌర్య, నితిన్ ఎక్కడ ?! ఒక జనరేషన్ గ్యాప్ వుంది. పైగా వెంకీ కుడుముల తీసిన రెండు కూడా మీడియం సినిమాలే. ఇప్పుడు ఏకంగా మెగా అవకాశం వచ్చింది వెంకీకి.

నిజానికి ఇది అవకాశం కాదు.. ఒక బాధ్యత. వెంకీ పై ఇప్పుడు చాలా భాద్యత వుంది. వాస్తవానికి మాస్ హిట్టు లేకుండా కొత్త దర్శకులకు ఛాన్స్ ఇవ్వాలంటే చిరుకి మొదటినుంచి ఎక్కడో చిన్న భయం. వెంకీ గనుక మెగాస్టార్ ని సరిగ్గా ప్రజంట్ చేసి విజయం సాధిస్తే.., కొత్త, యువ దర్శకులకులపై చిరుకు మళ్ళీ గురి పెరుగుతుంది. అదే సమయంలో కొత్త, యువ దర్శకులు కూడా మెగాస్టార్ కోసం కథలు సిద్ద చేయాలనే జోష్ కనిపిస్తుంది. మరి ఈ మెగా భాద్యతని నెరవేర్చడంలో వెంకీ ఏ మేరకు సక్సెస్ అవుతాడో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close