ఆగమేఘాల మీద పోలవరం పనులు ప్రారంభించిన మేఘా..!

పోలవరం పనులను… రివర్స్ టెండరింగ్ పొందిన మేఘా ఇంజినీరింగ్ సంస్థ ప్రారంభించింది. స్పిల్ వే వద్ద నీటిలోనే భూమిపూజ చేసి.. మేఘా ఇంజినీరింగ్ కంపెనీ ప్రతినిధులు.. షెడ్యూల్ ప్రకారం పనులు పూర్తి చేస్తామని తెలిపారు. రివర్స్ టెండర్లపై ప్రభుత్వం విధించిన స్టేను.. హైకోర్టు నిన్ననే వేకెట్ చేసింది. దీంతో.. రాత్రికి రాత్రే మేఘా కంపెనీతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. తెల్లవారే సరికి… కొన్ని ప్రొక్లెయిన్లను.. పోలవరం ప్రాజెక్ట్ సైట్ వద్దకు తీసుకొచ్చి… వాటికి పూజలు చేసి.. పనులు ప్రారంభించినట్లుగా ప్రకటించారు. గత కాంట్రాక్ట్ ను రద్దు చేసినప్పుడు ప్రభుత్వం.. నవంబర్ ఒకటో తేదీ నుంచి పనులు ప్రారంభిస్తామని ప్రకటించింది.

దాని ప్రకారం.. ఈ రోజులు పనులు ప్రారంభిస్తున్నట్లుగా భూమిపూజ చేశారు. అయితే.. పోలవరం దగ్గర ఇప్పటికీ వరద ఉంది. అప్రోచ్ రోడ్లన్నీ నీటిలో మునిగి ఉన్నాయి. వరద తగ్గిన తర్వాత ఆ ఆప్రోచ్ రోడ్లు మళ్లీ ఉపయోగపడే పరిస్థితి లేదు. వాటిని మళ్లీ వేయాలి. భారీ యంత్రాలను తెప్పించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో.. చెప్పినట్లుగా పనులు ప్రారంభిస్తున్నట్లుగా భూమిపూజ చేశారు కానీ.. పనులు మాత్రం… ఇప్పటికిప్పుడు ప్రారంభమయ్యే అవకాశం లేదు. మరో వైపు.. పోలవరం పనుల ప్రారంభానికి … గత కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడం కూడా.. ఓ అడ్డంకిగా మారే అవకాశం కనిపిస్తోంది.

భూమిపూజ కోసం మేఘా సంస్థ తీసుకొస్తున్న కొన్ని యంత్రాలను గతంలో పని చేసిన సబ్‌కాంట్రాక్టర్లు, కార్మికులు అడ్డుకున్నారు. తమ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సబ్‌కాంట్రాక్టర్లు, కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీస్‌ రక్షణలో ప్రాజెక్టు వద్దకు యంత్ర సామాగ్రిని చేర్చారు. 2020కల్లా ప్రాజెక్టును పూర్తి చేస్తామని.. ముందుగా స్పిల్ వే పనులను ప్రారంభిస్తామని… మేఘా సిబ్బంది తెలిపారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close