మేరా భారత్ మహాన్

ఉత్తర్ ప్రదేశ్ దాద్రీ ఘటన, ముంబైలో శివసేన దుందుడుకు చర్యలకు నిరసనగా అవార్డులను వెనక్కి ఇవ్వడం ఓ ఉద్యమంలా నడుస్తోంది. అకాడమీ అవార్డులు, పద్మ పురస్కారాలను పాపస్ చేస్తున్నట్టు రచయితలు, మేధాలువు ప్రకటిస్తున్నారు. నిజంగానే మన దేశానికి ఏదో అయిపోయిందా? మైనారిటీలు, ప్రజాస్వామ్య ప్రేమికులు స్వేచ్ఛగా బతికే అవకాశమే లేదా?

దాద్రీలో కొందరు హిందువులు అఖ్లాక్ పై దాడి చేసినప్పుడు, అతడిని కాపాడటానికి పరుగు పరుగున వెళ్లి ప్రయత్నించిన వ్యక్తి కూడా హిందువే. ముంబైలో శివసేన ఘటనను మిత్ర పక్షం బీజేపీతో పాటు ఎన్నో సంస్థలు, వ్యక్తులు ఖండించారు. మరి ఈ కోణాన్ని కూడా చూడాలి కదా. నిజానికి, మైనారిటీలు స్వేచ్ఛగా, సురక్షితంగా నివసించేది భారతదేశంలోనే. ఇక్కడ ముస్లింలు, క్రైస్తవులకు పర్సనల్ లా ఉంది. ప్రపంచంలో మరే దేశంలోనూ మైనారిటీలకు ఇంత అపారమైన స్వేచ్ఛ లేదు. ముస్లిం దేశాల్లో కనీసం ఓ గుడి కట్టుకునే అవకాశం లేదు. ఈ రెండు మతాల వారి అనేక పండుగలకు మన దేశంలో ప్రభుత్వం సెలవు ప్రకటిస్తుంది.

క్రైస్తవులు మెజారిటీగా ఉన్న అభివృద్ధి చెందిన, పాశ్చాత్య దేశాల్లో కనీసం దీపావళికి కూడా సెలవు ప్రకటించే పరిస్థితి లేదు. అగ్రరాజ్యం అమెరికాలో క్షణ క్షణం ప్రాణ భయం. ఎప్పుడు ఏ ఉన్మాది తుపాకీతో కాల్చి చంపుతాడో తెలియదు. ఏ గల్లీలో వెళ్తండగా ఆకతాయి యువకులు లేదా నల్లజాతీయులు చితకబాది దోచుకుంటారో తెలియదు. అందరూ (లేదా 99 శాతం మంది) ముస్లింలే ఉన్నఅనేక దేశాల్లో వారు భద్రంగా లేరు. తెగల పేరుతో మరో పేరుతో కొట్టుకుంటారు. చంపుకొంటారు. మొన్న టర్కీ రాజధానిలో బాంబులు వేసిన వాళ్లూ, వాటికి బలైన వాళ్లూ ముస్లింలే.

రెండో ప్రపంచ యుద్ధ కాలంలో హిట్లర్ నాజీ సేనల దారుణాలకు జడిసి యూదులు చెట్టుకొకరు పుట్టకొకరుగా వివిధ దేశాల్లో తలదాచుకున్నారు. అష్టకష్టాలు పడ్డారు. కానీ భారత దేశంలో ఆశ్రయం పొందిన వారు మాత్రం ఇక్కడి పౌరులతో సమానంగా స్వేచ్ఛ, ఆత్మగౌరవంతో బతికారు. ప్రపంచ యుద్ధం తర్వాత, యూదులు ఇజ్రాయిల్ దేశాన్ని ప్రకటించుకున్నరోజు, వారి ప్రధాన మంత్రి నిండు సభలో చెప్పిన వాస్తవమిది. అదీ భారత దేశం.

సాటి వారిని గౌరవించడంలో మనకు మనమే సాటి. ఏ దేశం వారైనా, ఏ మతం వారైనా సమాదరించడం భారతీయ సంస్కృతి. అందే హిందూ సంస్కృతి. జీహాద్ పేరుతో కొందరు హింసకు పాల్పడ్డంత మాత్రాన ముస్లింలందరూ ఉగ్రవాదులు కాదు. దాద్రీ, ముంబైలో కొందరు దుందుడుకుగా హింసకు పాల్పడినంత మాత్రాన హిందువులందరూ ఉన్మాదులు కారు. కళింగ యుద్ధం చేసిన అశోకుడే బుద్ధం శరణం గచ్ఛామి అన్నాడు. నూటికి నూరు పాళ్లు శాంతి స్థాపనతో ప్రజలు పూర్తి సుఖశాంతులతో జీవించిన దేశం మనది.

కొన్నేళ్లుగా గ్లోబలైజేషన్ పుణ్యమా అని ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలతో పాటు అవాంఛనీయ వాతావరణం కూడా విస్తరించింది. మంచి, మానవత్వం, శాంతి, సహనం మన జాతి మూలాల్లోనే ఉన్నాయి. పాముకు పాలు పోసే భారతీయులకు, పరమత సహనం గురించి ఎవరో నీతులు చెప్పాల్సిన అవసరం లేదు. అది మన రక్తంలో ఉంది. ఈ భూమి మీద అసలు సిసలైన సెక్యులరిస్టులు భారతీయులే. మైనారిటీలను కడుపున పెట్టుకుని కాపాడుకోవడంలో మనకు మనమే సాటి. మహోన్నతమైన భారత దేశానికి మరే దేశమూ సాటి రాదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close