వైకాపా ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీడియాతో మాట్లాడొద్దన్న మంత్రి బాలినేని

వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు సొంత ప్రభుత్వానికి, సొంత పార్టీకి వ్యతిరేకంగా మీడియా ముందు గళమెత్తిన సంఘటనలు ఇటీవల కాలంలో తరచూ జరుగుతూ ఉన్నాయి. అయితే సొంత పార్టీకి ,ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడవద్దని మంత్రి బాలినేని మీడియా ముఖంగా ఎమ్మెల్యేలకు హితవు పలికారు. వివరాల్లోకి వెళితే..

నిన్న వైకాపా ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీలో చర్చకు దారితీశాయి. అధికార పార్టీ ఎమ్మెల్యే అయి ఉండి ప్రజల కోసం అధికారులనే కాకుండా అవసరమైతే ప్రభుత్వాన్ని కూడా నిలదీస్తా అన్న రామ నారాయణ వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. నెల్లూరు జిల్లాలో జలవనరుల శాఖ అధికారులు నీళ్లు అమ్ముకుంటున్నారని, నెల్లూరు జిల్లాలో ఇసుక మాఫియా, క్రికెట్ బెట్టింగ్ మాఫియా ప్రబలి పోయిందని,  తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంత దారుణమైన పరిస్థితి ఎప్పుడు లేదని, ఇలా పలు రకాల చర్చనీయాంశమైన వ్యాఖ్యలు చేశారు వైకాపా ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి. నిన్న చేసిన వ్యాఖ్యలకు కొనసాగింపుగా ఈ రోజు కూడా రాంనారాయణరెడ్డి అధికారులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైకాపా లో ఎమ్మెల్యే రామనారాయణరెడ్డి మాత్రమే కాకుండా ఇటీవల ఈ కాలంలో పలువురు వైకాపా ఎమ్మెల్యేలు బాహాటంగానే ప్రభుత్వ తీరుపై పరోక్ష విమర్శలు చేశారు.

ఉదాహరణకి ఇటీవలి కాలంలో వైకాపా ఎమ్మెల్యేలు సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు ఇవీ: 

రీచ్ లో ఎత్తిన ఇసుక యార్డ్ దాకా రాకుండా మధ్యలోనే మాయమైపోతుంది, ప్రజలు ఇల్లు కట్టుకోవడానికి బొచ్చెడు ఇసుక కూడా దొరకట్లేదు అంటూ ఆ మధ్య వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు విమర్శిస్తే, అదే ఇసుక విధానం పై పొన్నూరు ఎమ్మెల్యే వైఎస్ఆర్ సీపీకి చెందిన కిలారి రోశయ్య, ప్రజలు అడిగినా కూడా కనీసం ట్రాక్టర్ ఇసుక కూడా వారికి ఇప్పించ లేక పోతున్నాను, ప్రస్తుత ప్రభుత్వ ఇసుక విధానం వల్ల సామాన్యుడు ఇల్లు కట్టుకునే పరిస్థితి లేకుండా పోయింది అంటూ విమర్శించారు. అదే ఇసుక విధానం పై వై ఎస్ ఆర్ సి పి నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం 2600 గా నిర్ణయించిన ఇసుక ధర 4 వేలకు 5 వేలకు ఎలా మారుతుందని ప్రశ్నించడమే కాకుండా ఇసుక పక్క రాష్ట్రాలకు యదేచ్ఛగా తరలి పోతుందని ఘాటు విమర్శలు కూడా చేశారు. ఇక వైఎస్ఆర్సిపి ఎంపీ రఘురామకృష్ణంరాజు సైతం పలు విషయాలలో ప్రభుత్వంపై విమర్శలు చేశారు. పేదలకు మంజూరు చేసే ఇళ్ల పట్టాలకు సైతం  డబ్బులు అడుగుతున్నారని విమర్శలు వస్తున్నాయని ఇది మంచి పద్ధతి కాదని దాదాపు హెచ్చరించే స్వరంతో ఆయన వ్యాఖ్యలు చేసి ఉన్నారు.  ఇవన్నీ ఒక ఎత్తయితే సాక్షాత్తు స్పీకర్ తమ్మినేని సీతారాం, ఆంధ్రప్రదేశ్లో సారా వ్యాపారం జోరుగా సాగుతూ, చీకటి వ్యాపారం జరుగుతోందంటూ విమర్శలు చేశారు..

ఎమ్మెల్యేలకు మంత్రి బాలినేని హితవు:

మొత్తం మీద ఈ సెగ ప్రభుత్వానికి కూడా తగిలినట్టుంది. పైగా తాజాగా ఆనం రామనారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీలో కూడా చర్చనీయాంశంగా మారాయి. మంత్రి బాలినేని వీటిపై స్పందిస్తూ వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు ప్రభుత్వంతో ఏదైనా ఇబ్బంది ఉంటే అంతర్గతంగా పార్టీలో కానీ ప్రభుత్వ పెద్దలతో కానీ చర్చించాలని, ఇలా మీడియా ముందుకు వచ్చి సమస్యలు ఏకరువు పెట్టవద్దని ఎమ్మెల్యేలకు హితవు పలికారు. మరి వైయస్సార్ సిపి ఎమ్మెల్యేలు మంత్రిగారి మాటలను ఎంతవరకూ ఆచరిస్తారు అన్నది వేచి చూడాలి.

కొస మెరుపు: 

వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు తమ సమస్యలను మీడియా ముందు ఏకరువు పెట్టడం పై మందలిస్తూ, అలా మీడియా ముందుకు వెళ్లవద్దని అంతర్గతంగా చర్చించుకోవాలి అంటూ-   మంత్రి బాలినేని కూడా మీడియా ముఖంగానే హెచ్చరికలు చేయడం గమనార్హం. కనీసం ఈయనైనా మీడియా ముందు హెచ్చరికలు చేయడం కాకుండా ఆయా ఎమ్మెల్యేలతో అంతర్గతంగా చర్చించి ఉంటే బాగుండేది అంటూ సెటైర్లు వినిపిస్తున్నాయి. 

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇళ‌య‌రాజాకు ఇంకా ఈ వ్యామోహం ఎందుకు?

ఇళ‌య‌రాజా స్వ‌ర‌జ్ఞాని. సంగీత బ్ర‌హ్మ‌. ఆయ‌న అభిమాని కానివారంటూ ఉండ‌రేమో..?! ఆయ‌న్ని దేవుడిగా ఆరాధిస్తారు అభిమానులు. ఇంత గొప్ప ఇళ‌య‌రాజాకు `కాపీ రైట్స్`పై మ‌మ‌కారం ఎక్కువైపోతోంది. త‌న పాట ఎవ‌రు పాడినా, వాడుకొన్నా.....

హీరోయిన్ల నెత్తిమీద `పాన్ ఇండియా` కిరీటం

పాన్ ఇండియా హీరోలు పాన్ ఇండియా సినిమాలూ ఉన్న‌ప్పుడు.. పాన్ ఇండియా హీరోయిన్లూ ఉంటారు. ఉన్నారు కూడా. అదే గుర్తింపుతో సినిమాల్ని చేజిక్కించుకొంటున్న‌వాళ్లూ, ఆ పేరు చెప్పి పారితోషికాన్ని గ‌ట్టిగా గుంజుతున్న‌వాళ్ల గురించే ఈ క‌థ‌నం. ప్ర‌స్తుతం...

గుడ్ న్యూస్ చెప్పిన హైదరాబాద్ వాతావరణ శాఖ

వేసవిలో ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న హైదరాబాద్ ప్రజలకు కాస్త ఊరట లభించింది. శనివారం ఉదయం నుంచి నగరంలో పలు చోట్ల మోస్తరు వర్షాలు కురవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ప్రతి రోజూ వడగాడ్పులతో...

విజ‌య్ పాత లెక్క‌ల‌న్నీ బ‌య‌ట‌కు తీస్తారా?

విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన 'డియ‌ర్ కామ్రేడ్‌', 'ఖుషి' చిత్రాల తాలుకూ క‌మ‌ర్షియ‌ల్ రిజ‌ల్ట్ ఏమిటి? ఈ సినిమాల వ‌ల్ల నిర్మాత‌లు న‌ష్ట‌పోయారా, లాభ‌ప‌డ్డారా? ఈ లెక్క‌ల‌న్నీ బ‌య‌ట‌కు రాబోతున్నాయి. విజ‌య్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close