ప్రధాని నరేంద్ర మోడీపై మంత్రి కేటీఆర్ విమర్శలు

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో తెదేపా-బీజేపీ బంధాలు ఒకరకంగా సాగుతుంటే, తెలంగాణాలో బీజేపీ-తెరాస సమబ్దాలు మరొకరకంగా సాగుతున్నాయి. ఆంద్రప్రదేశ్ లో తెదేపా, బీజేపీలు మిత్ర పక్షాలుగా, ప్రభుత్వంలో భాగస్వాములుగా సాగుతూనే ఒకదానినొకటి విమర్శించుకొంటూ ఉంటాయి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా హామీని మోడీ ప్రభుత్వం విస్మరించినప్పటికీ కేంద్రంతో చంద్రబాబు నాయుడు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ, బీజేపీ అధిష్టానంతో సత్సంబంధాలు కొనసాగిస్తూ రాష్ట్రానికి రావలసిన నిధులు, ప్రాజెక్టులు సాధించుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు.

కానీ తెరాస ప్రభుత్వం కేంద్రంతో మొదటి నుండి యుద్ధం చేస్తూనే రాష్ట్రానికి రావలసినవి సాధించుకొంటోంది. బీజేపీతో ఎటువంటి స్నేహ సంబంధాలు లేకపోయినపటికీ అవకాశం దొరికితే మోడీ ప్రభుత్వంలో తెరాస నిజామాబాద్ ఎంపీ కవిత కేంద్రమంత్రి అయిపోవాలని కలలుకని భంగపడ్డారు. అయినా ఎన్డీయేలో భాగస్వామి కాని తెరాస ఏవిధంగా మోడీ ప్రభుత్వంలో కేంద్రమంత్రి పదవి ఆశించిందో తెలియదు కానీ అది దక్కకపోవడంతో మళ్ళీ మోడీ ప్రభుత్వంతో యుద్ధం ఆరంభించింది.

గల్లీలో నాయుడు (చంద్రబాబు నాయుడు), డిల్లీలో నాయుడు (వెంకయ్య నాయుడు) కలిసి తెలంగాణా రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని తెరాస నేత ఒకరు విమర్శిస్తే, మంత్రి కేటీఆర్ నేరుగా ప్రధాని నరేంద్ర మోడీపైనే తన అస్త్రాలు సంధించారు. పంట రుణాల మాఫీ, రైతుల ఆత్మహత్యల సమస్యలపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ప్రతిపక్షాలన్నీ నేడు తెలంగాణా బంద్ కి పిలుపు నిచ్చాయి. దానికి రాష్ట్ర బీజేపీ నేతలు కూడా మద్దతు ఇచ్చి అందులో చురుకుగా పాల్గొంటున్నారు.

మంత్రి కేటీఆర్ బీజేపీ నేతలు బంద్ లో పాల్గొనడాన్ని విమర్శిస్తూ, “ఎవరూ అడగకపోయినా అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీహార్ రాష్ట్రానికి ఏకంగా రూ.1.65 లక్షల కోట్లు ప్రధాని నరేంద్ర మోడీ మంజూరు చేసారు. ఓట్ల కోసం ఆయన ఇటువంటి చిల్లర ఫీట్లు చేయడం మానుకోవాలి. కిషన్ రెడ్డి లాంటి బీజేపీ నేతలు ఇక్కడ ఇటువంటి చిల్లర నాటకాలు ఆడే బదులు డిల్లీ వెళ్లి తమ అధిష్టానంతో మాట్లాడి రాష్ట్రానికి నిధులు సాధించుకొని వస్తే రైతుల సమస్యలన్నీ తీరిపోతాయి. ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ పాలిత రాష్ట్రాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ మిగిలిన రాష్ట్రాలను పట్టించుకోవడం లేదు. ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి ఇటువంటి సంకుచిత భావాలు ప్రదర్శించడం న్యాయమేనా? మోడీ ప్రభుత్వం తెలంగాణా రాష్ట్రాన్ని పట్టించుకోకపోయినా రాష్ట్ర బీజేపీ నేతలు నోరు విప్పి ప్రశ్నించరు, కానీ ప్రజలను ఆకట్టుకోవడానికి ఇటువంటి చిల్లర ఫీట్లు చేస్తుంటారు,” అని విమర్శించారు.

తెరాసలో కేసీఆర్ కుటుంబ సభ్యులు అందరూ మంచి మాటకారులే. తాము ఇబ్బందిపడే అంశంపై కూడా వారు తమకు అనుకూలంగా చాలా సమర్ధంగా మాట్లాడగల నేర్పు వారికే స్వంతం. రాష్ట్రంలో నానాటికీ పెరిగిపోతున్న రైతుల ఆత్మహత్యలను నివారించేందుకు పంట రుణాలు ఒకేసారి చెల్లించాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు నేడు తెలంగాణా బంద్ పాటిస్తున్నాయి. తెలంగాణా దేశంలో రెండవ ధనిక రాష్ట్రమని, దేశంలో ఏ-1 గ్రేడ్ కలిగిన ఆర్ధికశక్తిగల రాష్ట్రాలలో తెలంగాణా ఒకటని తెరాస ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా గర్వంగా చాటుకొంటారు. వందలు వేల కోట్లు వ్యయం అయ్యే భారీ కట్టడాలు, ప్రాజెక్టులు, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నట్లు నిత్యం ప్రకటిస్తుంటారు. మరి అటువంటప్పుడు ఒకేసారి పంట రుణాలు మాఫీ చేయడానికి ప్రతిపక్షాలు కోరుతున్నట్లుగా రూ.8,500 కోట్లు ఎందుకు మంజూరు చేయడం లేదు? (ఆంధ్రా) కాంట్రాక్టర్లకి ఒకేసారి కోట్లాది రూపాయల బిల్లులు చెల్లించగలుగుతున్నపుడు తెరాస ప్రభుత్వం రైతుల ప్రాణాలు కాపాడటం కోసం ఒకేసారి రుణ మాఫీ ఎందుకు చేయడం లేదు? అని రేవంత్ రెడ్డి మంచి ప్రశ్న వేశారు. దానికీ తెరాస జవాబీయలేదు. కానీ మంత్రి కేటీ ఆర్ తన మాటకారితనం ప్రదర్శించుకొంటూ మోడీ ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. కానీ ఒకవైపు నిత్యం రైతులు ఆత్మహత్యలు చేసుకొంటుంటే ఎల్లకాలం ప్రజలను తెరాస నేతలు ఇటువంటి మాటలతో మభ్యపెట్టడం సాధ్యం కాదనే సంగతి గ్రహిస్తే మేలు. లేకుంటే వారే నష్టపోతారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close