జగన్‌ను బెదిరిస్తున్న మంత్రులు లొంగిపోతారా?

వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే వైసీపీలో తిరుగులేని నేత. ఆయన చెప్పిందే వేదం… ఆదేశించిందే శాసనం.  అందుకే ఆయన ముందూ వెనుకా చూసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటారు. ఎవరికి పదవులు ఇవ్వాలో.. ఎవర్ని తీసేయాలో చకచకా చేసేస్తారు. మండలిని రద్దు చేస్తున్నామని ఇద్దరు మంత్రుల్ని తీసేసినా.. మళ్లీ మండలి రద్దు తీర్మానాన్ని ఉపసంహరించుకున్నా.. ఆ మంత్రులు తాము బకరాలం అయ్యామని మనుసులో అనుకున్నారు కానీ బయటపడలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయినట్లుగా కనిపిస్తోంది. రాజీనామా లేఖలు ఇచ్చిన మంత్రులు జగన్‌ను తమదైన శైలిలో రాజకీయంగా బెదిరిస్తున్నారు. అసంతృప్తి వాదులం అవుతామని సంకేతాలు పంపుతున్నారు.

సీఎం జగన్ అడిగారని రాజీనామా లేఖలు ఇచ్చేసిన మంత్రుల్లో అత్యధికులు తమకు మళ్లీ చోటు ఇవ్వాలని రకరకాలుగా ఒత్తిడి చేస్తున్నారు. బొత్స సత్యనారాయణ నేతృత్వంలో కొంత మంది మంత్రులు సమావేశమై.. ఆ సమాచారాన్ని  మీడియాలో విస్తృతంగా ప్రచారమయ్యేలా చేసుకున్నారు. అక్కడ్నుంచి ప్రారంభమైన మంత్రుల వ్యూహం రకరకాలుగా సాగుతోంది. జగన్‌ను నమ్ముకుని చంద్రబాబు, టీడీపీ నేతలు, పవన్‌పై బూతులతో విరుచుకుపడ్డ నేతలు ఇప్పుడు మంత్రి పదవులు తీసేస్తే తమ గతేం కాను అనే సంకేతాలను పంపుతున్నారు. వారు హైదరాబాద్ వెళ్లిపోయి .. తాము అసంతృప్తికి గురయ్యామనే సంకేతాలను పంపుతున్నారు.

మరి కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రి పదవి ఇస్తే సరే లేకపోతే… వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోమని చెబుతున్నారు.  కొంత మంది గాలి జనార్ధన్ రెడ్డి వంటి జగన్ సన్నిహితుల ద్వారా మరికొంత మంది కుటుంబసభ్యుల ద్వారా ఒత్తిడి తెస్తున్నారని అంటున్నారు. మొత్తంగా జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు పరిస్థితి తేడాగా మారింది. మొదట ఒకరిద్దర్ని మాత్రమే ఉంచాలనుకున్నా.. ఇప్పుడు అది పది .. పన్నెండుకు చేరింది. మరో రెండు రోజుల సమయం ఉంది. ఈ లోపు ఎంత మంది ఒత్తిడి ప్రయత్నాలు ఫలిస్తాయో చెప్పడం కష్టమంటున్నారు.

ప్రస్తుతం సజ్జలతో కలిసి జగన్ కసరత్తు చేస్తున్నారు. నిజానికి గతంలోనే కసరత్తు పూర్తయింది. ఎవరెవర్ని మంత్రులతో తీసుకోవాలో లిస్ట్ రెడీ చేశారు. కానీ ఇప్పుడది పక్కన పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అనవసరంగా మంత్రివర్గ విస్తరణను గెలుక్కున్నామనే  భావన వైసీపీ హైకమాండ్‌లో వచ్చే పరిస్థితి ఉందని ఆ పార్టీ నేతలు సెటైర్లు వేసుకుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close