జగన్ “స్టే” ఆశల్ని వమ్ము చేసిన తప్పుల పిటిషన్..!

మూడు రాజధానుల బిల్లుల అమలుపై హైకోర్టు ఇచ్చిన స్టేటస్‌కోపై స్టే తెచ్చుకుందామనుకున్న ఏపీ సర్కార్‌కు.. కాలం కలసి రావట్లేదు. సుప్రీంకోర్టులో పిటిషన్లు వేస్తున్న ఏపీ ప్రభుత్వ న్యాయ నిపుణులు తప్పుల తడకలుగా వేయడంతో.. ఆ పిటిషన్ వెనక్కి వచ్చింది. హైకోర్టు స్టేటస్ కో ఇచ్చిన ధర్మాసనం పేర్లు తప్పుగా రాశారు. అలాగే..ఇచ్చిన ఉత్తర్వులేమిటో.. పిటిషన్‌కు జత చేయలేదు. దీంతో తప్పులు సరిదిద్దుకోవాలని సూచించినట్లుగా తెలుస్తోంది. సోమవారమే విచారణకు వస్తుందని ఆశపడిన ఏపీ సర్కార్‌కు సోమవారం విచారణకు రాలేదు. దాంతో అర్జంట్‌గా విచారించాలంటూ.. మరో అప్లికేషన్ పెట్టారు. ఈ తరుణంలో పిటిషన్‌లో తప్పులు బయటపడ్డాయి.

ఇప్పుడు ఏపీ సర్కార్ పని రెంటికి చెడ్డ రేవడి అయినట్లయింది. ఓ వైపు హైకోర్టులో 14వ తేదీకి కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంది. సుప్రీంకోర్టులోనూ మళ్లీ పిటిషన్ వేయాల్సి ఉంది. రెండు కోర్టుల్లోనూ సమాంతరంగా విచారణ జరిగే అవకాశం లేదు. ముందుగా సుప్రీంకోర్టులో పిటిషన్ పై విచారణ తేలిన తరవాత హైకోర్టులో విచారణ జరుగుతుందని న్యాయనిపుణులు చెబుతున్నారు. సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లలో తప్పుల వల్ల.. పదహారో తేదీకి క్లియరెన్స్ వచ్చే అవకాశం లేదు. దీంతో… శంకుస్థాపన కార్యక్రమాన్ని వాయిదా వేసుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది.

అయితే.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. ఇలాంటి అడ్డంకులను పట్టించుకునేవారు కాదని.. ఆయన అనుకుంటే శంకుస్థాపన చేసేస్తారని అంటున్నారు. ప్రభుత్వ ఆలోచన ఏమిటో.. రెండు మూడు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం నియమించిన న్యాయనిపుణులకు పిటిషన్లు వేయడం కూడా రావడంలేదు. గతంలో నిమ్మగడ్డ విషయంలో తప్పుల తడకలతో పిటిషన్లు వేయడంతో ఓ సారి వెనక్కి వచ్చాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వెంకయ్యనాయుడికి కరోనా ..!

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు కరోనా సోకింది. అతి స్వల్ప లక్షణాలు ఉండటంతో ఆయన కరోనా పరీక్ష చేయించుకున్నారు. దాంతో ఆయనకు పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతానికి హోమ్ ఐసోలేషన్‌లోనే వెంకయ్యనాయుడు ఉన్నారు. లక్షణాలు పెరిగితే...

‘ఆదిపురుష్`’పై అనుష్క క్లారిటీ

ప్ర‌భాస్ న‌టిస్తున్న మ‌రో బ‌హుళ భాషా చిత్రం `ఆది పురుష్‌`. రావ‌ణుడి పాత్ర‌కు సైఫ్ అలీఖాన్‌ని ఎంచుకున్నారు. సీత పాత్ర కోసం చాలామంది క‌థానాయిక‌ల పేర్లు ప‌రిశీల‌న‌లో ఉన్నాయి. అందులో అనుష్క పేరు...

గ్యాప్ రాలేదు.. తీసుకున్నా: అనుష్క

బాహుబ‌లి త‌ర‌వాత‌.. అనుష్క మ‌రీ న‌ల్ల‌పూస అయిపోయింది. `భాగ‌మ‌తి` త‌ప్ప మ‌రే సినిమా ఒప్పుకోలేదు. నిశ్శ‌బ్దం.. సినిమాకి దాదాపుగా రెండేళ్లు కేటాయించాల్సివ‌చ్చింది. అనుష్క‌కి సినిమా అవ‌కాశాలు లేవా? వ‌చ్చినా చేయ‌డం లేదా?...

సోనూసూద్‌కి ఐరాస పుర‌స్కారం

నటుడు సోనూసూద్ కు అరుదైన పురస్కారం ప్ర‌క‌టించింది ఐక్య‌రాజ్య స‌మితి. ఐరాస అనుబంధ సంస్థ‌ యునైటెడ్‌ నేషన్స్ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ (యుఎన్‌డిపి) స్పెషల్‌ హ్యుమానిటేరియన్‌ యాక్షన్ అవార్డుని ఈ యేట...

HOT NEWS

[X] Close
[X] Close