తూచ్.. అక్బర్ రాజీనామా లేదు..! ఎదురుదాడే..!!

వివిధ పత్రికలకు ఎడిటర్‌గా ఉన్న సమయంలో మహిళా జర్నలిస్టులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంజే అక్బర్‌ ఎదురుదాడి ప్రారంభించారు. ఆరోపణలు వచ్చినప్పుడు నైజీరియాలో ఉన్న ఆయన… ఇండియాకు తిరిగి రాగానే సుష్మాస్వరాజ్‌తో సమావేశమయ్యారు. కొందరు దురుద్దేశపూర్వకంగా కట్టుకథలతో ఆరోపణలు చేస్తున్నారని, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం వైరల్‌గా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించిన వారిపై న్యాయపరమైన చర్యలు చేపడతానని హెచ్చరించారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు తనపై ఆరోపణలు చేయడం వెనుక భారీ అజెండా ఉందని ఎంజే అక్బర్‌ ఆరోపించారు. అంటే.. పూర్తిగా ఎదురుదాడి ప్రారంభించినట్లే.

ఎంజె అక్బర్‌పై వచ్చిన ఆరోపణలపై ఇప్పటివరకు అధికార బీజేపీ స్పందించలేదు. కానీ కేంద్రమంత్రి మేనకా గాంధీ సహా… కాంగ్రెస్ పార్టీ .. ఆయన రాజీనామాను డిమాండ్ చేస్తోంది. ఆయనపై.. వరుసగా ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. దీంతో.. రాజీనామా చేయించాలన్న ఆలోచన.. నరేంద్ర మోడీ చేస్తున్నారన్న ప్రచారం జరిగింది. అనుకున్నట్లుగానే.. ఆయన ఇండియాకు రాగానే.. రాజీనామా చేశారన్న ప్రచారం ఊపందుకుంది. అయితే… అనూహ్యంగా బీజేపీ పెద్దలతో మాట్లాడిన తర్వాత.. ఆయన ఎదురుదాడి వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. నిజానికి లైంగిక వేధింపుల ఆరోపణలపై.. ఈ సమయంలో ఓ కేంద్ర మంత్రి రాజీనామా చేస్తే.. అది కేంద్ర ప్రభుత్వంపైనే తీవ్రమైన మచ్చ అవుతుంది. అందుకే వీలైనంతగా ఎదురు దాడి చేసి.. తీవ్రత తగ్గితే.. తప్పించుకోవచ్చన్న వ్యూహం అమలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

అయితే.. అక్బర్‌ను తొలగించాలనే విషయంలో కాంగ్రెస్ మాత్రమే కాదు.. ఆరెస్సెస్ కూడా.. ఒత్తిడి తెస్తోందని తెలుస్తోంది. నైతిక విలువల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ఆర్‌ఎస్ఎస్‌ ఇప్పటికే బీజేపీ ముఖ్యులకు స్పష్టం చేసినట్లు సమాచారం. అక్బర్‌ రాజీనామా చేస్తే ఎన్‌డీఏ ప్రభుత్వ హయాంలో లైంగిక వేధింపుల ఆరోపణలపై తప్పుకున్న మూడో వ్యక్తి అవుతారు. 2017 జనవరిలో మేఘాలయ గవర్నర్‌ వి.షణ్ముగనాథన్‌, 2018 ఆగస్టులో కేంద్ర మంత్రి నిహాల్‌ చంద్‌ మేఘ్‌వాల్‌ లైంగిక వేధింపుల ఆరోపణలతోనే ఉద్వాసనకు గురయ్యారు. అక్బర్‌కు మద్దతుగా మాట్లాడటమంటే పార్టీ ప్రతిష్ఠను మంటగలుపుకోవడమేననే అభిప్రాయం కేంద్ర కేబినెట్‌లోని తోటి మంత్రుల్లోనే వ్యక్తమవుతోంది. ఆయన్ను అవమానకరంగా పంపించే అవకాశం లేదని, పార్టీకోసం పని చేయమని కోరతారని భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘కాంతార 2’లో మోహ‌న్ లాల్‌?

దేశాన్ని కుదిపేసిన క‌న్న‌డ చిత్రం 'కాంతార‌'. ఏమాత్రం అంచ‌నాలు లేకుండా, ఏమాత్రం ప్ర‌మోష‌న్లు చేయ‌కుండానే పాన్ ఇండియా స్థాయిలో విజ‌య ఢంకా మోగించింది. క‌న్న‌డ చిత్ర‌సీమ స్థాయిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది. ఇప్పుడు...

మంత్రి ఉత్తమ్ ఇలాకాలో విద్యార్ధినిలకు అస్వస్థత..రీజన్ అదేనా..?

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులు వరుసగా అస్వస్థతకు గురి అవుతుండటం కలకలం రేపుతోంది. యదాద్రి భువనగిరి జిల్లా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కు గురై ఇటీవల ఓ విద్యార్ధి...

చిలుకూరుకు పోటెత్తిన భక్తులు…ఫుల్ ట్రాఫిక్ జామ్

కోరిన కోరికల్ని తీర్చే సుప్రసిద్ధ చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఆలయ సిబ్బంది అంచనా వేసిన దానికంటే పది రేట్లు ఎక్కువగా రావడంతో క్యూలైన్లు అన్ని నిండిపోయాయి. ఆలయానికి...

అచ్చెన్నాయుడు అన్నీ అలా కలసి వస్తున్నాయంతే !

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అన్నీ అలా కలసి వస్తున్నాయి. ఆయన ప్రత్యర్థి .. దువ్వాడ శ్రీనివాస్.. భార్య చేతిలోనే పదే పదే ఓడిపోతున్నారు. తాజాగా మరోసారి ఆయన భార్య రంగంలోకి దిగారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close