మోడీ వచ్చింది వైసీపీ కోసమే..! జగన్ గురించి ఒక్క మాట మాట్లాడలేదేంటి..?

బీజేపీతో తమ పార్టీకి రహస్య ఒప్పందం ఉందని చెబుతూ .. ఓ వైసీపీ నేత జాతీయ మీడియా చేసిన స్టింగ్ ఆపరేషన్‌లో దొరికిపోతారు. బీజేపీ అగ్రనేత పీయూష్ గోయల్.. వైసీపీ తమ మిత్రపక్షమేనని నేరుగా మీడియాకు కూడా చెబుతారు. అంటే రెండు పార్టీలు చెప్పేది ఒక్కటే. అటు వైసీపీ నేతలు చెప్పినా.. ఇటు… బీజేపీ నేతలు చెప్పినా.. రెండింటి అర్థం ఒకటే. వైసీపీ, బీజేపీ మిత్రపక్షాలు. కానీ ఏపీలో బీజేపీతో పెట్టుకుంటే.. కలసి మునిగిపోతామని వైసీపీకి తెలుసు. అందుకే.. ఏమైనా ఉంటే.. ఎన్నికల తర్వాత చూసుకుందామని.. ఇప్పటికైతే.. తెర వెనుక సంబంధాలే కొనసాగిస్తోంది. కానీ అప్పుడప్పుడు బయట పడుతున్నారు.

ఏపీలో భారతీయ జనతా పార్టీకి ఒక్క స్థానంలో కూడా డిపాజిట్లు వచ్చే పరిస్థితి లేదు. ఈ విషయాన్ని బీజేపీ నేతలు కూడా అంగీకరిస్తున్నారు. ఒక్క చోట డిపాజిట్ తెచ్చుకున్నా.. ఐదు లక్షలు ఇస్తానని ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు సవాల్ చేస్తే … ముందుకు రావడానికి ఒక్క బీజేపీ నేత కూడా మందుకు రాలేదు. ఏపీలో బీజేపీ నేతల లక్ష్యం.. వైసీపీని గెలిపించడమేనని టీడీపీ నేతలు అంటున్నారు. ఆ విషయం బహిరంగంగా చెబితే వైసీపీ నష్టపోతుంది కాబట్టి సైలెంట్‌గా ఉంటున్నారు. తమకు ఉండే ఓటు బ్యాంక్‌ను వైసీపీకి తరలించడానికే.. ఆ పార్టీపై ఎలాంటి విమర్శలు చేయడం లేదని అంటున్నారు.

గత ఎన్నికలకు ముందు ప్రజాధనాన్ని దోచుకున్న జగన్‌ను జైలుకు పంపిస్తామని చెప్పి.. ఇప్పుడు… ఆయనపై సీబీఐ విచారణను తొక్కి పెట్టిన వైనాన్ని.. ఈడీ లేఖ ద్వారా బయట పెట్టిందని.. గుర్తుచేస్తున్నారు. ప్రధానమంత్రి మోదీ కూడా.. కర్నూలు పర్యటనకు వచ్చి.. టీడీపీ, చంద్రబాబుపై విమర్శలు చేశారు కానీ.. జగన్‌ను అనలేదు. బెయిల్‌పై తిరుగుతున్న నేతల్ని వెంట బెట్టుకుని తనను ఓడించేందుకు.. చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని.. మోదీ విమర్శించారు. అయితే… ఈ బెయిల్‌పై తిరుగుతున్న నేతలు జగన్ , విజయసాయిరెడ్డి కాదు. మోదీ ఉద్దేశంలో సోనియా, రాహుల్… టీడీపీపై, చంద్రబాబుపై అవినీతి ఆరోపణలు చేసి.. జగన్‌ కు మేలు చేయాలన్న ఉద్దేశంతోనే.. మోదీ ఏపీ పర్యటనకు వస్తున్నారని.. టీడీపీ వర్గాలు గట్టిగానే వాదిస్తున్నాయి. ఈ విషయాన్ని బలపర్చడానికి అనేక ఉదాహరణలు చెబుతున్నారు. పైపైన చూసినా అది నిజమే అనిపించకమానదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close