రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన ప్రధాని..!

ప్రధానమంత్రి నరేంద్రమోడీ రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించారు. దేశ ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడిన పడేలా..ప్రపంచంలోనే మెరుగైన ఆర్థిక వ్యవస్థలా నిలబడేలా.. ప్యాకేజీ ప్రయోజనాలను అన్ని వర్గాల వారికి అందించేలా…ప్యాకేజీని రూపకల్పన చేశారు. దీనికి “ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్” అనే పేరు పెట్టారు. ఇరవై లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ అంటే.. భారత్ జీడీపీలో దాదాపుగా పది శాతం. ఈ ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్” ప్యాకేజీలో వివరాలను… బుధవారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటిస్తారని మోదీ తెలిపారు. ప్రస్తుత ప్యాకేజీ ద్వారా భారత్.. ప్రపంచంలో కీలక పాత్ర పోషిస్తుందని.. గ్లోబల్ సప్లై చైన్‌లో కీలకంగా ఎదుగుతుందని మోడీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఆర్థిక సంస్కరణలకు ఇండియా ఎప్పుడూ ముందు ఉంటుందని.. మోడీ తెలిపారు.

ప్రధానంగా ఇరవై లక్షల కోట్ల ప్యాకేజీలో…కుదేలైన పారిశ్రామిక రంగానికి భరోసా కల్పించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఆ రంగం.. ఈ రంగం అనే తేడా లేకుండా..దేశంలోని అన్ని వ్యాపార,పారిశ్రామిక రంగాలు లాక్ డౌన్ కారణంగా దెబ్బతిన్నాయి. తమకు బెయిలవుట్ ప్యాకేజీలు ప్రకటించాలని విజ్ఞాపనలు చేస్తున్నారు. ఒక వేళ ఆదుకోకపోతే.. ఆ రంగాలన్నీ నష్టాల్లో మునిగిపోయే ప్రమాదం ఉంది. ఈ కారణంగా..నిరుద్యోగం పెరిగిపోతుంది. ఈ పరిస్థితులు రాకుండా ఉండాలంటే… వీలైనంత భారీగా ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని విభిన్న వర్గాలనుంచి కేంద్రానికి సూచనలు, సలహాలు అందాయి. దాని ప్రకారం. కేంద్రం కొత్త ప్యాకేజీకి రూపకల్పన చేసినట్లుగా తెలుస్తోంది.

లాక్ డౌన్ విషయంలోనూ.. ప్రధానమంత్రి రాష్ట్రాలకు స్వేచ్చనిచ్చారు. దీనికి సంబంధించిన విధివిధానాలను..పద్దెనిమిదో తేదీ కన్నా ముందు ప్రకటిస్తామని మోడీ ప్రకటించారు. రాష్ట్రాల అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇచ్చి..లాక్ డౌన్ కొనసాగింపు .. సడలింపుల విషయంలో నిర్ణయం తీసుకోనున్నారు. అనేక రాష్ట్రాలు.. లాక్ డౌన్ కొనసాగించాలని కోరాయి. కొన్ని రాష్ట్రాలు కంటెయిన్‌మెంట్ జోన్లకే పరిమితం చేయాలని కోరాయి. ఈ తరుణంలో మోడీ..లాక్ డౌన్ విషయాన్ని రాష్ట్రాలకే వదిలేయడం మంచిదని భావించారు. ఈ విషయంలో కేంద్రం తరపున ఈ లాక్ డౌన్ ముగిసేలోపు ప్రకటన రానుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఛోటా కె.నాయుడు Vs హ‌రీష్ శంక‌ర్‌… ఏం జ‌రిగింది?

'మ‌ళ్లీ నా జోలికొచ్చారో... చూసుకొందాం' అంటూ సినిమా ఫ‌క్కీలో కెమెరామెన్‌ ఛోటా కె.నాయుడుకు వార్నింగ్ ఇచ్చాడు హ‌రీష్ శంక‌ర్‌. వీరిద్ద‌రూ క‌లిసి 'రామ‌య్యా వ‌స్తావ‌య్యా' సినిమా చేశారు. అప్ప‌టి నుంచీ ఇద్ద‌రి మ‌ధ్యా...

సమయం లేదు…ఆ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తారు..?

తెలంగాణలో 15 లోక్ సభ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేస్తోన్న అధికార కాంగ్రెస్ ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించకపోవడం విస్మయానికి గురి చేస్తోంది. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు అవుతున్నా...

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close