న్యాయవ్యవస్థపై మోడీ కాలు పెట్టేశారా..? “కొత్తపలుకు”పై బీజేపీ చెప్పుకునేదేమైనా ఉందా..?

తెల్లవారితే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయాల్సిన శశికళ… జైలుకు ఎలా వెళ్లారు..?. ఇది చాలా మందికి ఇప్పటికీ ఉన్న సందేహం. కోల్డ్ స్టోరేజీలో ఉన్న కేసు అప్పటికప్పుడు బయటకు వచ్చి.. దానిలో.. శశికళను దోషిగా తేల్చి.. ఉన్న పళంగా శిక్ష వేసేసి.. జైలుకు పంపేశారు. ఈ మొత్తం ఎపిసోడ్ వెనుక.. బీజేపీ ప్లాన్ ఉందని.. ప్రజలకు అనుమానమే. కానీ.. బయటపెట్టుకోలేరు. కానీ… ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరక్టర్ ఆర్కే మాత్రం… ఈ విషయంలో.. ధైర్యం ప్రదర్శించారు. అసలేం జరిగిందో… పత్రికా మార్క్‌ లో బయటపెట్టారు. ” తమిళనాడులో జయలలిత మరణం తర్వాత శశికళ తమ దారిలోకి రాలేదన్న కక్షతో సుప్రీంకోర్టులోని ఒక న్యాయమూర్తిపై అంతులేని ఒత్తిడి తెచ్చి పెండింగ్‌లో పడి ఉన్న కేసును ఉన్నపళంగా లిస్టులో చేర్పించి ఆమెకు శిక్షపడేలా చేయించారు. ఈ విషయమై ప్రధాని నరేంద్ర మోదీనే స్వయంగా సదరు న్యాయమూర్తితో ఫోన్లో మాట్లాడినట్టు వార్తలు వచ్చాయి..” అని ఆర్కే తన కొత్త పలుకులో రాసుకొచ్చారు. అంటే… చివరికి సుప్రీంకోర్టు న్యాయమూర్తిపైనే.. మోడీ.. స్వయంగా ఒత్తిడి తెచ్చి… శశికళను జైలుకు పంపారన్నమాట. ఇందులో వాస్తవం లేదని చెప్పుకునేంత బలమైన ఘటనలు ఏమీ లేవు.. నిజం ఉందని నమ్మేలానే… వ్యవహారం నడిచింది.

అంతే కాదు.. సోనియా, రాహుల్ గాంధీలు బెయిల్ పై ఉన్నారంటూ.. మోడీ, అమిత్ షా తరచూ ఆరోపణలు చేస్తూంటారు. వారిపై ఉన్న కేసు నేషనల్ హెరాల్డ్‌కు చెందినది. ఈ కేసులో వీరిది తప్పు అని నిర్దారిస్తూ.. వచ్చిన తీర్పును.. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రాశారట. ఇది మరో సంచలనాత్మకమైన అంశం. అరుణ్ జైట్లీ మొదటగా అర్థిక మంత్రి. ఆ తర్వాత న్యాయనిపుణుడు కావొచ్చు. కానీ ఆయన న్యాయమూర్తి మాత్రంకాదు. కానీ తీర్పును ఎలా రాశారు..? ఇదే అవిషయాన్ని ఆర్కే తన కొత్త పలుకులో విశ్లేషించారు. ” నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో తీర్పు ఇచ్చిన న్యాయమూర్తి ఒకరు సోనియాగాంధీకి సందేశం పంపారు. నాపై తీవ్ర ఒత్తిడి ఉన్నందున అలాంటి తీర్పు ప్రకటించాను. నిజానికి ఆ తీర్పు నాది కాదు. ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ రూపొందించినది. నేను కోర్టు హాలులో ఆ తీర్పును చదివాను. నన్ను అపార్థం చేసుకోవద్దు” అని సదరు న్యాయమూర్తి సోనియా గాంధీకి సందేశం పంపారట. ఇది నిజంగా నిజం అయితే… దేశ న్యాయవ్యవస్థ అస్థిత్వం ఇంకా మిగిలే ఉందనుకోవాలా..?

నిజానికి ఇవి సంచలనాత్మక విషయాలు. ఇప్పటికే దేశంలో రాజ్యాంగ వ్యవస్థలన్నీ… నిర్వీర్యమైపోయాయి. ఎన్నికల సంఘం, ఈసీ, సీవీసీ సహా.. ఏ ఒక్క రాజ్యాంగ వ్యవస్థ కూడా.. స్వతంత్రంగా పని చేసే పరిస్థితి లేదు. అంతో ఇంతో… న్యాయవ్యవస్థపైనే అందరూ నమ్మకం పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు న్యాయవ్యవస్థ పై కూడా.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ కాలు పెట్టేశారన్న… కొత్తపలుకులో ఆర్కే తేల్చేశారు. ఈ విషయంలో… బీజేపీ చెప్పుకునేదేమైనా ఉంటుందా..? బహుశా ఉండకపోవచ్చు.. అలా చెప్పినందుకు.. ఆ సంస్థపై.. ఐటీ, ఈడీ దాడులు జరపడమే తమ సమాధానాలు కావొచ్చు. అంతకు మించి ఈ దేశంలో వ్యవస్థలు స్వతంత్రంగా పని చేస్తున్న పరిస్థితులు లేవు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

టీడీపీ కూటమికి వంగవీటి రాధా విస్తృత ప్రచారం !

ఎన్డీఏ కూటమి తరపున స్టార్‌ క్యాంపెయినర్‌ రంగంలోకి దిగారు వంగవీటి రాధా. గతంలో కాంగ్రెస్, PRP, వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నారు....

కల్లాల్లో ధాన్యం… రైతుల కళ్లల్లో దైన్యం

తెలంగాణలో కురిసిన అకాల వర్షం రైతులను కన్నీరుపెట్టిస్తోంది. కోతలకు వచ్చిన ధాన్యం తడిసిపోయిందని కొందరు, కల్లాల్లోకి వచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని మరికొందరు ఆవేదన చెందుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించాలనుకున్న ఈ...

ఇళ‌య‌రాజాకు ఇంకా ఈ వ్యామోహం ఎందుకు?

ఇళ‌య‌రాజా స్వ‌ర‌జ్ఞాని. సంగీత బ్ర‌హ్మ‌. ఆయ‌న అభిమాని కానివారంటూ ఉండ‌రేమో..?! ఆయ‌న్ని దేవుడిగా ఆరాధిస్తారు అభిమానులు. ఇంత గొప్ప ఇళ‌య‌రాజాకు `కాపీ రైట్స్`పై మ‌మ‌కారం ఎక్కువైపోతోంది. త‌న పాట ఎవ‌రు పాడినా, వాడుకొన్నా.....

హీరోయిన్ల నెత్తిమీద `పాన్ ఇండియా` కిరీటం

పాన్ ఇండియా హీరోలు పాన్ ఇండియా సినిమాలూ ఉన్న‌ప్పుడు.. పాన్ ఇండియా హీరోయిన్లూ ఉంటారు. ఉన్నారు కూడా. అదే గుర్తింపుతో సినిమాల్ని చేజిక్కించుకొంటున్న‌వాళ్లూ, ఆ పేరు చెప్పి పారితోషికాన్ని గ‌ట్టిగా గుంజుతున్న‌వాళ్ల గురించే ఈ క‌థ‌నం. ప్ర‌స్తుతం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close