అయోధ్య‌లో రామమందిరంపై మోడీ ఎందుకు మాట్లాడ‌లేదు..?

ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా అయోధ్య‌లో భారీ బ‌హిరంగ సభ నిర్వ‌హించారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ. ఈ స‌భ‌లో కాంగ్రెస్ తోపాటు యూపీలోని ఎస్పీ, బీఎస్పీల‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ఎస్పీ బీఎస్పీ కాంగ్రెస్ పార్టీ… ఈ మూడూ ఒకే స్వ‌భావంతో వ్య‌వ‌హ‌రిస్తాయ‌ని మోడీ అన్నారు. మాయావ‌తి ఎప్పుడు చూసినా అంబేద్క‌ర్ గురించి మాట్లాడ‌తారే త‌ప్ప‌, ఆయ‌న సిద్ధాంతాలు ఆమెకి అవ‌స‌రం లేద‌ని విమ‌ర్శించారు. సమాజ్ వాదీ పార్టీ కూడా లోహియా విధానాల గురించి గొప్ప‌గా చెప్పుకుంటుంద‌నీ, యూపీలో శాంతిభ‌ద్ర‌త‌లు ధ్వంసం కావ‌డానికి వారి పాల‌నే కార‌ణ‌మ‌ని మోడీ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి ప్ర‌జ‌ల అవ‌స‌రాల‌తో ఏమాత్రం ప‌ని ఉండ‌ద‌నీ, ఒక కుటుంబం మేలు కోస‌మే ఆ పార్టీ నాయ‌కులు ప‌ని చేస్తార‌ని ఎద్దేవా చేశారు.

అయోధ్యకు వ‌చ్చిన ప్ర‌ధాని, రామ‌మందిరం గురించి ఏదో ఒక ప్ర‌క‌ట‌న క‌చ్చితంగా చేస్తార‌ని చాలామంది అనుకున్నారుగానీ…. ఆయ‌న ఆ జోలికి వెళ్ల‌లేదు! త‌న ప్ర‌సంగంలో ఆ ప్ర‌స్థావ‌న కూడా తేలేదు. ఇది శ్రీరాముడి నేల అంటూ మాత్ర‌మే త‌న ప్ర‌సంగంలో మాట్లాడారు. ఇది ఆత్మ గౌర‌వానికి ప్ర‌తీక‌గా నిల‌చే భూమి అనీ, ఈ ఆత్మ‌విశ్వాస‌మే గ‌డ‌చిన ఐదు సంవ‌త్స‌రాల్లో దేశ‌వ్యాప్త‌మైంద‌న్నారు మోడీ. నూట ముప్పై కోట్ల మంది ప్ర‌జ‌లు చేతులు క‌లిపేలా తాము చేశామ‌నీ, న‌వ భార‌త నిర్మాణానికి ముందుకు సాగుతున్నామ‌న్నారు. అంతే, అంత‌కుమించి రామ‌మందిర‌ నిర్మాణం జోలికి ఆయ‌న వెళ్ల‌క‌పోవ‌డం విశేషం! నిజానికి, ఈ ఏడాది జ‌న‌వ‌రి త‌రువాతి నుంచే రామమందిరంపై మోడీ ప‌లుమార్లు మాట్లాడిన సంద‌ర్భాలున్నాయి. మందిర నిర్మాణం వేగ‌వంతం చేస్తామంటూ చెప్పిన ఘ‌ట‌న‌లూ ఉన్నాయి. భాజ‌పాకి అత్యంత ఆవ‌శ్య‌క‌మైన ప్ర‌చారాస్త్రాన్ని మోడీ ఎందుకు ప్ర‌యోగించ‌లేదా అనే చ‌ర్చ ఇప్పుడు మొద‌లైంది. అయోధ్యలో రామ‌మందిరం గురించి మాట్లాడ‌క‌పోవ‌డం కూడా ప్ర‌త్యేక‌త‌గా మారింది!

ఇదే రోజున ప్ర‌ధానికి క్లీన్ చీట్ ఇచ్చిన అంశాన్నీ ప్రస్థావించుకోవాలి. హిందువుల‌ను కాంగ్రెస్ అవ‌మానించింద‌నీ, అందుకే ఆ పార్టీని ప్ర‌జ‌లు శిక్షించాల‌నుకుంటున్నార‌ని ఏప్రిల్ లో మోడీ చేసిన కొన్ని వ్యాఖ్య‌ల‌పై కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. అయితే, ఆ వ్యాఖ్య‌ల‌ను పెద్ద‌గా త‌ప్పుబ‌ట్టాల్సిన ప‌నిలేద‌ని ఈసీ ఇవాళ్లే క్లీన్ చీట్ ఇచ్చింది. అయితే, తాము ఇంత‌వ‌ర‌కూ ప్ర‌ధాని వైఖ‌రిపై ఐదు ఫిర్యాదులు ఇస్తే, ఒక్క‌దానిపై మాత్ర‌మే ఈసీ స్పందించిందంటూ కాంగ్రెస్ నేత‌లు అంటున్నారు. దేశ‌వ్యాప్తంగా ఈసీ తీరు మీద జ‌రుగుతున్న చ‌ర్చ‌‌, వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో ఫిర్యాదులు… ఇవ‌న్నీ దృష్టి పెట్టుకునే అయోధ్య‌లో రామ‌మందిర నిర్మాణ అంశంపై ప్ర‌ధాని మాట్లాడ లేద‌ని భావించొచ్చు!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘కాంతార 2’లో మోహ‌న్ లాల్‌?

దేశాన్ని కుదిపేసిన క‌న్న‌డ చిత్రం 'కాంతార‌'. ఏమాత్రం అంచ‌నాలు లేకుండా, ఏమాత్రం ప్ర‌మోష‌న్లు చేయ‌కుండానే పాన్ ఇండియా స్థాయిలో విజ‌య ఢంకా మోగించింది. క‌న్న‌డ చిత్ర‌సీమ స్థాయిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది. ఇప్పుడు...

మంత్రి ఉత్తమ్ ఇలాకాలో విద్యార్ధినిలకు అస్వస్థత..రీజన్ అదేనా..?

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులు వరుసగా అస్వస్థతకు గురి అవుతుండటం కలకలం రేపుతోంది. యదాద్రి భువనగిరి జిల్లా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కు గురై ఇటీవల ఓ విద్యార్ధి...

చిలుకూరుకు పోటెత్తిన భక్తులు…ఫుల్ ట్రాఫిక్ జామ్

కోరిన కోరికల్ని తీర్చే సుప్రసిద్ధ చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఆలయ సిబ్బంది అంచనా వేసిన దానికంటే పది రేట్లు ఎక్కువగా రావడంతో క్యూలైన్లు అన్ని నిండిపోయాయి. ఆలయానికి...

అచ్చెన్నాయుడు అన్నీ అలా కలసి వస్తున్నాయంతే !

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అన్నీ అలా కలసి వస్తున్నాయి. ఆయన ప్రత్యర్థి .. దువ్వాడ శ్రీనివాస్.. భార్య చేతిలోనే పదే పదే ఓడిపోతున్నారు. తాజాగా మరోసారి ఆయన భార్య రంగంలోకి దిగారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close