ఈడీ – సీబీఐ మధ్యలో మోడీ..! జగన్ కేసుల నత్త నడక వెనుక సాక్ష్యం ఇదే..!

జగన్ పై సీబీఐ కేసులను ఉద్దేశపూర్వకంగానే నీరు గారుస్తున్నారు. ఈ విషయంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టర్ నేరుగా సీబీఐ డైరక్టర్‌కే లేఖ రాసి అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే తప్పు దిద్దుకోవాలని సూచించారు. కానీ అలా రాసిన లేఖ సీబీఐ ఆఫీసులో మరుగున పడిపోయింది కానీ.. ఈడీ డైరక్టర్ మాత్రం బదిలీ అయిపోయారు .2017లో సీబీఐ డైరక్టర్‌గా ఉన్న అలోక్ వర్మకు ఈడీ డైరక్టర్ కర్నైల్ సింగ్ ఓ లేఖ రాశారు. వైఎస్ హయాంలో హిందూజా సంస్థకు భూకేటాయింపులు జరిపిన క్విడ్ ప్రో కో రూపంలో లంచాలు తీసుకున్నట్లుగా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని… వెంటనే చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో పేర్కొన్నారు. దీని వెనుక చాలా వ్యవహారం నడిచింది.

హిందూజా గ్రూపునకు చెందిన గల్ఫ్ ఆయిల్ అనే కంపెనీ..కూకట్‌పల్లిలో తమకు వంద ఎకరాల భూమి కేటాయించాలని.. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు 2005లో ఓ దరఖాస్తు చేసుకున్నారు. 2009లో ఎన్నికలకు వెళ్లే ముందు వైఎస్ వంద ఎకరాలు కేటాయించారు. హిందూజా గ్రూప్‌నకు ఊరకనే భూములు కేటాయించలేదు వైఎస్. మిస్టర్ టెన్ పర్సంట్‌గా పేరున్న తన కుమారుడికి 11.10 ఎకరాలను బినామీ కంపెనీల ద్వారా జగన్మోహన్ రెడ్డికి చేరేలా… క్విడ్ ప్రో కో ఒప్పందం చేసుకున్నారు. దాని ప్రకారం.. హిందూజా కంపెనీ… ఇందూ శ్యామ్ ప్రసాద్ రెడ్డికి చెందిన కంపెనీలకు రూ.46 కోట్ల 40 లక్షలు బదిలీ చేసింది. దీని కోసం ప్రాజెక్టుల పని అని నాలుగు ఇన్వాయిస్‌లు సృష్టించారు. ఈ సొమ్మును ఇందూ ప్రాజెక్ట్స్ సంస్థ..కోల్‌కతాలోని సూట్‌కేసు కంపెనీలకు పంపింది. ఆ కంపెనీలు… యాగా అసోసియేట్స్ అనే కంపెనీలో ఆ సొమ్ముతో వాటాలు కొనుగోలు చేశాయి. ఈ యాగా అసోసియేట్స్‌ కూడా షెల్ కంపెనీ. దీన్ని విజయసాయిరెడ్డి ఏర్పాటు చేశారు. బెంగళూరు అడ్రస్‌తో ఈ కంపెనీ వ్యవహారాలను ఈడీ లెక్క తీసింది. ఒక్క లావాదేవీ కూడా లేదు. అయినప్పటికీ..షెల్ కంపెనీల ద్వారా షేర్లను ఒక్కోటి 115 రూపాయలకు కొనుగోలు చేసినట్లు చూపించారు. ఆ సొమ్ముతో హిందూజా కంపెనీలకు ఇచ్చిన 11.10 ఎకరాలు కొనుగోలు చేసినట్లు చూపించారు. ఈ మొత్తం వ్యవహారాలకు ఈడీ వద్ద ఆధారాలున్నాయి. ఇదే లేఖలో ఇందూ ప్రాజెక్ట్స్‌కు ఇచ్చిన ఇచ్చిన భూకేటాయింపులు, క్విడ్ ప్రో కో పైనా.. అప్పడి ఈడీ డైరక్టర్ కర్నైల్ సింగ్ పూర్తి వివరాలు పంపారు.

2013లో.. సీబీఐ కోర్టులో.. సీబీఐ మెమో దాఖలు చేసింది. అసలు క్విడ్ ప్రో కోకు మూల సంస్థలు అయిన సండూర్ పవర్, కార్మెల్ ఏషియా, క్లాసిక్ రియాల్టీ, ఆర్ ఆర్ గ్లోబల్, సరస్వతి పవర్, మంత్రి డెవలపర్స్, పీవీపీ వెంచర్స్, జూబ్లీ మీడియా సంస్థలలో క్విడ్ ప్రో కో కు ఆధారాలు లేవని ఆ మెమో సారాంశం. ఈ విషయాన్ని ఈడీ డైరక్టర్ తప్పు పట్టారు. తమ దగ్గర ఉన్న ఆధారాలు చూస్తే.. ఆయా సంస్థలన్నీ.. క్విడ్ ప్రో కోకు పాల్పడ్డాయని ఈడీ డైరక్టర్ లేఖలో పేర్కొన్నారు. ఐదు చార్జిషీట్లలో ముద్దాయిగా ఉన్న కార్మెల్ ఏషియా కేసును మూసేయడాన్ని తప్పు పట్టారు. సీబీఐ మెమోను చూపి ఈడీ కేసులను ఓడించడానికి జగన్ సంస్థలు ప్రయత్నిస్తున్నాయని మండి పడ్డారు. సీబీఐ చర్యలు తీసుకోవాలని ఈడీ డైరక్టర్ కోరారు. ఈడీ డైరక్టర్ నుంచి సీబీఐ డైరక్టర్‌కు ఈ లేఖ చేరి రెండేళ్లయింది. కానీ.. దాన్ని పట్టించుకోలేదు. అప్పటికే.. జగన్మోహన్ రెడ్డి బీజేపీ ఫ్రెండ్స్ జాబితాలో చేరిపోవడమే దీనికి కారణం అనేది రాజకీయ వర్గాలన్నీ సులువుగా అంచనా వేసే విషయం. అందుకే.. ఇంత వరకూ.. జగన్మోహన్ రెడ్డి కేసుల్లో ఒక్క ఇంచ్ కూడా ముందుకు వెళ్లలేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close