మోడీ గులాబీ ప్రేమ : ఈ ట్వీట్లు మాపై రాలేదే?

తాను ఇప్పటికి 22 సార్లు ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రుల్ని ప్రధానిని కలిసి వచ్చానని చంద్రబాబునాయుడు చెప్పుకుంటారు. దేశంలో మరే ఇతర ముఖ్యమంత్రి కూడా వెళ్లనన్ని సార్లు తాను ఢిల్లీ వెళ్లి అందరితో భేటీ అయి రాష్ట్ర ప్రయోజనాలను రాబట్టుకోవడానికి కష్టపడుతున్నానని ఆయన తన గురించి తాను చెప్పుకుంటూ ఉంటారు. అంతా నిజమే కావచ్చు.. ఆయన వీలైనంత వరకు ప్రతిసారీ ప్రధానిని కూడా కలిసి రాష్ట్రంలో సాధిస్తున్న పురోగతి గురించి అటు రాజధాని లేదా ఇతర పథకాల విషయంలో చొరవ గురించి గానీ వివరిస్తూనే ఉండవచ్చు. కానీ ప్రధాని తరఫు నుంచి మాత్రం ఎలాంటి స్పందన వస్తున్నదో సామాన్యులకు తెలియడం లేదు. కానీ కేసీఆర్‌ ఇలా ఢిల్లీ వెళ్లి ప్రధానితో సమావేశం అయ్యారో లేదో.. మిషన్‌ భగీరథ గురించి, మిషన్‌ కాకతీయ గురించి ముఖ్యమంత్రి కేసీఆర్‌ గారు తనకు వివరించి చెప్పారంటూ ప్రధానమంత్రి ట్వీట్లు పెట్టడం విశేషం.

మోడీ లో క్రమంగా గులాబీ ప్రేమ వెల్లి విరుస్తున్నదా అనే అనుమానాలను రాజకీయ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. ఒక దేశానికి ప్రధాని అన్న తరువాత.. అన్ని రాష్ట్రాలు లేదా అన్ని ప్రాంతాల మీద సమానమైన వ్యవహార సరళిని కనబరచాలి. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తాజా పర్యటనలో ఆయనకు ఎక్కువ ప్రాధాన్యం దక్కిందేమో అనే అభిప్రాయం పలువురిలో వ్యక్తం అవుతోంది. గంటన్నరపాటు ప్రధానితో సమావేశం సీరియస్‌గా జరగడం మాత్రమే కాదు… భేటీ ముగిసిన తర్వాత కేసీఆర్‌ ప్రెస్‌మీట్‌ ద్వారా వివరాలు వెల్లడిస్తే, మోడీ ట్వీట్‌ల ద్వారా కేసీఆర్‌ తనకు చెప్పిన వివరాలను తెలంగాణ సాధిస్తున్న పురోగతి క్రమాన్ని ప్రపంచానికి చెప్పడం విశేషం.

నిజానికి లెక్కకు మిక్కిలిగా ఢిల్లీ వెళ్తున్న చంద్రబాబునాయుడు కూడా అమరావతి దగ్గరినుంచి, పట్టిసీమ వరకు ఏపీలో చేపడుతున్న అన్ని పనుల గురించి మోడీకి వివరిస్తూనే ఉన్నారని… అయితే ఏనాడూ వాటి గురించిన పురోగతి తన దృష్టికి వచ్చినట్లుగా మోడీ ట్వీట్‌ చేయడం జరగలేదని ఓ తెలుగుదేశం నాయకుడు వ్యాఖ్యానించడం విశేషం.

అమరావతి, పట్టిసీమ లేదా పోలవరం వంటి వాటి విషయంలో ఎప్పటికప్పుడు తనకు వివరాలు తెలుస్తున్నప్పటికీ వాటి గురించి కామెంట్‌ చేయడం మోడీ కి ఇష్టం ఉండకపోవచ్చునని ఇప్పుడు కొందరు నాయకులు విశ్లేషిస్తున్నారు. వాటి గురించి ట్వీట్‌చేస్తే ఏపీ పట్ల తన జవాబుదారీతనం పెరిగిపోతుందని, దాని నుంచి తప్పించుకోవడానికి అసలేమీ తెలియనట్లుగా, పట్టనట్లుగా మోడీ వ్యవహరిస్తుంటారని కొందరు ఆరోపణలు గుప్పిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close