మోడీ మూడు రోజుల యాత్ర ఏమైనా సాధిస్తుందా?

ప్రస్తుతం జరుగుతున్న 5 రాష్ట్రాల ఎన్నికల్లో తెలుగువారికి ఆసక్తికరంగా ఉండేది తమిళనాడు ఎన్నికలు మాత్రమే. తమిళనాడులో జాతీయ పార్టీలకు ఠికానా లేదు. కేవలం ద్రవిడ పార్టీలు మాత్రమే మార్చి మార్చి రాజ్యం చేస్తుంటాయి. అలాంటి రాష్ట్రంలో ఇప్పుడు తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఇటు కాంగ్రెస్‌, కేంద్రంలో చక్రం తిప్పుతున్న భాజపా కూడా తపన పడుతున్నాయి. సోనియా గాంధీ గురువారం నాడు తమళనాడులో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రధానమంత్రి మోడీ కూడా తమిళనాడు ఎన్నికల ప్రచారానికి మూడు రోజులు కేటాయించడం విశేషం.

నిజానికి తమిళనాడులో భారతీయజనతా పార్టీ బోణీ కొడుతుందనే నమ్మకం కూడా ఎవ్వరికీ లేదు. ఆ పార్టీ చివరి నిమిషం వరకు ఎంతగా ఆరాటపడినప్పటికీ.. వారితో పొత్తులు పెట్టుకోవడానికి కూడా ద్రవిడ పార్టీలు ఏవీ ముందుకు రాలేదంటే.. భాజపా గతిలేనితనం ఏపాటిదో అందరికీ అర్థమైపోతోంది. కాంగ్రెస్‌ పార్టీకైనా కనీసం కొన్ని సీట్లు ఈ రాష్ట్రంలో దక్కే అవకాశం ఉంది. వారు ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న డీఎంకే తో కలిసి పొత్తులు పెట్టుకుని బరిలోకి దిగుతున్నారు. వారు ప్రసాదించినన్ని సీట్లలోనే రంగంలోకి దిగుతున్నప్పటికీ.. కొన్నయినా కాంగ్రెస్‌ గెలిచే అవకాశం ఉంది.

ఇలాంటి సమయంలో ప్రధాని మోడీ తమిళనాట ఎన్నికల ప్రచారానికి రావడంపై చాలా కాలం పాలు సస్పెన్స్‌ నడిచింది. ఆయన రాకపోవచ్చునని బాగా ప్రచారం జరిగింది. కానీ చివరికి అసోం, పశ్చిమ బెంగాల్‌, అన్ని చోట్లకు వెళ్లి తమిళనాడుకు ప్రచారానికి రాకపోతే పరువు పోతుందని ఆయన భయపడ్డారో ఏమో గానీ.. మూడు రోజుల సమయం కేటాయించి సుడిగాలి పర్యటన జరపనున్నారు. అయినా సరే.. మోడీ ఎన్నికల సందర్భంగా ఇచ్చే హామీలకు వల్లించే మాటలు, నీతులకు ఇప్పుడు ప్రజల్లో విలువ లేకుండా పోయింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల్ని ఎంత దారుణంగా వంచించారో అందరికీ కళ్ల ముందు కనిపిస్తూ ఉండగా.. మోడీని మళ్లీ పొరుగునే ఉన్న తమిళ ప్రజలు నమ్ముతారని అనుకోవడం భ్రమే. తన ప్రచారం ఖాతాలో మోడీ మరో పరాజయభారాన్ని మూటగట్టుకోవాల్సి ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close