తిరంగా యాత్రలు భేష్..కానీ సాధించేది ఏమిటి?

స్వాతంత్రం వచ్చి ఏడు దశాబ్దాలు పూర్తవుతున్న సందర్భంగా కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా తిరంగా యాత్రా (మువన్నెల జెండా యాత్ర) చేపట్టబోతోంది. దానిలో భాగంగా కేంద్రమంత్రులు స్వాతంత్ర్య సమరయోధుల జన్మస్థలాలని సందర్శిస్తారు. సరిహద్దులలో సైనికులకి రాఖీలు కడతారు. స్వాతంత్ర్య సమరంలో చారిత్రాత్మక ప్రాధాన్యత ఉన్న ప్రముఖ కట్టడాలని అందంగా అలంకరిస్తారు. ఆగస్ట్ 15న అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్ళే విమానంలో అందరూ ఖాదీ దుస్తులు ధరిస్తారు. దేశంలో అన్ని కళాశాలలో ఆగస్ట్ 23న ఉదయం 11గంటలకి జాతీయ గీతాలాపన, రేడియో, దూరదర్శన్ లలో స్వాతంత్ర సమరయోధుల జీవిత చరిత్రలు, గాంధీ, నెహ్రులు చేసిన ప్రసంగాలు ప్రసారం చేయడం వంటి అనేక కార్యక్రమాలని కేంద్రప్రభుత్వం చేపడుతోంది.

దేశంలో ఉగ్రవాదం, సరిహద్దులలో వేర్పాటువాదం బుసలుకొడుతున్న ఈ సమయంలో దేశ ప్రజలలో దేశభక్తి, జాతీయవాదం, జాతీయ స్ఫూర్తి రగిలించడానికి తిరంగా యాత్ర తప్పకుండా చాలా ఉపయోగపడుతుంది. నిజానికి దేశప్రజలలో దేశభక్తి ఎప్పుడూ బలంగానే ఉంది. ఉంటుంది కూడా. ఇటువంటి సందర్భాలలో ఇటువంటి కార్యక్రమాల వలన అది ఇంకా పెరిగి ప్రస్పుటంగా కళ్ళకి కూడా కనబడుతుంది. కనుక దీనిని కూడా ఒక మహోద్యమంలా వీలయినంత ఎక్కువ కాలం సాగించడం చాలా మంచిదే. కానీ కేంద్రప్రభుత్వం ఇటువంటి తాత్కాలిక ఉపాయాలు చేయడం కంటే శాశ్వితఉపాయాలు, ప్రణాళికలని అమలుచేయడం వలన ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.

ఉదాహరణకి స్వాతంత్ర్య సమరంలో ఖద్దరుకి ఎంత ప్రాధాన్యత ఉందో అందరికీ తెలుసు. ఆ స్ఫూర్తిని మన నేతలు సరిగ్గా అర్ధం చేసుకోకుండా ఖద్దరు ధరిస్తేనే రాజకీయ నేతలుగా గుర్తిస్తారన్నట్లు దానిని ఒక రాజకీయ యూనిఫారం స్థాయికి దిగజార్చారు. అయినా పరువాలేదు. కానీ వారు దేశంలో చేనేత పరిశ్రమని పట్టించుకొన్నారా? దానిపైనే ఆధారపడి దుర్బర జీవనం సాగిస్తున్న లక్షలాది చేనేత కార్మికుల కష్టాలని కన్నీళ్ళని తుడిచే ప్రయత్నం చేశారా? అంటే లేదనే చెప్పాల్సి ఉంటుంది. విమానంలో ఒకరోజు ఖద్దరు దుస్తులు ధరించడం వలన ఏమీ ప్రయోజనం ఉండదు కానీ ఆ ఖద్దరు బట్టలు నేసే నేతన్నల కంట కన్నీళ్లు తుడిచే ప్రయత్నాలు చేస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. ఇక కేంద్రమంత్రులు స్వాతంత్ర సమరయోధుల జన్మస్థలాలని సందర్శించడం వలన ఏమి ప్రయోజనం ఆశిస్తున్నారో తెలియదు కానీ 70 ఏళ్ల తరువాత కూడా మన నియోజక వర్గాలు ఇంత దయనీయంగా ఎందుకు ఉన్నాయనే ఆలోచన చేస్తే ఏమైనా ప్రయోజనం ఉంటుంది.

దేశవ్యాప్తంగా మువన్నెల జెండా ఠీవిగా రెపరపలాడుతుంటే దేశభక్తి కలిగిన ప్రతీ భారతీయుడు దానిని చూసి చాలా గర్వపడతాడు. చాలా ఆనందపడతాడు. కానీ ఆ మువన్నెల జెండా కాశ్మీర్ లో రెపరెపలాడనందుకు తప్పక బాధ పడతాడు. అక్కడ జెండా ఎగురవేయడం అంటే పాకిస్తాన్ లో జెండా ఎగురవేసినంత సాహసకృత్యంగా మారిపోయినందుకు ప్రతీభారతీయుడి మనసు బాధతో రగిలిపోతుంది. కనుక కాశ్మీర్ లో కూడా మువన్నెల జెండా ఎగురవేసే రోజు రావడానికి, భారతీయులు కాశ్మీర్ సరిహద్దుల వరకు ధైర్యంగా, స్వేచ్చగా వెళ్లివచ్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమి చేయాలో ఆలోచిస్తే మంచిది. కాశ్మీర్ లో వేర్పాటువాదులని మనం ఆందోళనకారులు అని గౌరవంగా పిలుచుకొంటుంటే, వారు కాశ్మీర్ స్వాతంత్ర సమారయోధులని పాకిస్తాన్ వాదిస్తుంటుంది. వారు మన భద్రతాదళాలపై గ్రెనేడ్స్ విసురుతుంటే, మన రాజకీయ పార్టీలు భద్రతాదళాలు చేతిలో ఉన్న పెల్లెట్ తుపాకులని కూడా తీసేసుకోవాలని కోరుతున్నాయి. వారి చేతిలో తుపాకులు తీసుకొని ఆ చేతులకి రాఖీలు కడితే సరిపోతుందా? అది మంచిదేనా? ఆలోచించుకోవాలి. ఎదురుగా ఉన్నదీ పులి అని తెలిసిఉన్నప్పుడు చేతిలో కర్ర అయినా ఉండాలి. కానీ చేతిలో కర్రని కూడా పడేసి దానికి శాంతి ప్రవచనాలు వల్లె వేస్తే ఏమౌతుంది? ఆలోచించుకొంటే చాలా మంచిది. దేశప్రజలలో దేశభక్తి, జాతీయతాభావం పెంచడం ఎంత అవసరమో రాజకీయ నాయకులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృక్పధంలో మార్పు రావడం, ఇటువంటి అనేక సమస్యలని పరిష్కరించడం కూడా అంతే అవసరం. అప్పుడే ఆశించిన ఫలితాలు కనబడతాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మలయాళం కథతో తరుణ్ భాస్కర్ ?

తరుణ్ భాస్కర్ కి నటనపై ఆసక్తి ఎక్కువే. తను తీసిన 'కీడాకోలా' నటుడిగా ఆయన్ని మరో మెట్టుఎక్కించింది. ప్రస్తుతం దర్శకుడిగా కథలు రాసుకోవడంతో పాటు నటుడిగా కూడా కొన్ని ప్రాజెక్ట్స్ సైన్ ...

బీఆర్ఎస్ఎల్పీ విలీనం లేనట్లే – రేవంత్ ఆకర్ష్ ఫెయిల్ !

బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకుంటామని ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని చేస్తున్న ప్రచారం అంతా డొల్గా తేలుతోంది. ముందుకు వచ్చిన ఒక్కో ఎమ్మెల్యేకు కండువా కప్పుతున్నారు...

రోజా దాచిన మద్యం డంప్ పట్టించిన సొంత పార్టీ నేతలు

ఏపీలో మద్యం దుకాణాలను గుప్పిట్లో పెట్టుకుని వైసీపీ నేతలు చాలా మందుగానే అన్ని నియోజకవర్గాలకు మద్యాన్ని సరఫరా చేసి పెట్టుకున్నారు. అది అధికారిక మధ్యమా.. పన్ను కట్టని మద్యమా అన్నదానిపై ఇంకా క్లారిటీ...
video

‘మ‌న‌మే’ టీజ‌ర్‌: క్యారెక్ట‌ర్ల మ‌ధ్య క్లాషు!

https://www.youtube.com/watch?v=_4Ff1zVtKkw శర్వానంద్ - శ్రీ‌రామ్ ఆదిత్య కాంబినేష‌న్‌లో 'మ‌న‌మే' రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. కృతి శెట్టి క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ రూపొందిస్తోంది. శ్రీ‌రామ్ ఆదిత్య త‌న‌యుడు ఈ చిత్రంలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close