`నేతాజీపై నెహ్రూ కుట్ర’ మోదీ మదిలో కొత్త వ్యూహం

కాంగ్రెస్ పార్టీని నామరూపాలులేకుండా చేయడం కోసం, సోనియా, రాహుల్ పెట్టాబేడా సర్దుకుని ఏ ఇటలీకో చెక్కేయడంకోసం వ్యూహాత్మకంగా అడుగులువేస్తున్న బీజేపీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పుడు సరికొత్త అస్త్రాన్ని అందిచేందుకు పావులు చకచకా కదుపుతున్నారు. చాలో గోప్యంగా ఉన్న ఈ వ్యూహానికి మనం ప్రస్తుతానికి `నేతాజీపై – నెహ్రూ కుట్ర’ వ్యూహమని పిలుచుకోవచ్చు.

వ్యూహరచన ఎలా సాగిందో తెలుసుకునే ముందు ప్రముఖుల వ్యాఖ్యలు చూద్దాం…

`ఆనాడు నేతాజీ తిరిగివచ్చి ఉంటే దేశమంతా ఘనంగా స్వాగతించేది, కానీ కాంగ్రెస్ మాత్రం ఆందోళన చెందాల్సివచ్చేది’ – బిజేపీ నేత ఎంజే అక్బర్

`నెహ్రూ పాలనలో నేతాజీ కుటుంబసభ్యులపై ఘోరమైన నిఘా పెట్టారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంటే నెహ్రూ భయపడ్డారనడానికి ఇదే నిదర్శనం’ – బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి

`నెహ్రూ ప్రభుత్వం నేతాజీ కుటుంబసభ్యులపట్ల పక్షపాత వైఖరినే అనుసరించింది’ – సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అశోక్ కుమార్ గంగోలీ

ఈ మూడు వ్యాఖ్యలను గమనిస్తుంటే, నేతాజీ ఉనికి పట్ల నాటి ప్రధాని నెహ్రూకీ, ఆయనగారి ఘనమైన ప్రభుత్వానికి చమటలుపట్టాయనే అనిపిస్తుంది. ఇది నిజంకూడా.

మరణించాక మాట్లాడతారా !

నేతాజీ సుభాష్ చంద్రబోస్ మనదేశం బ్రిటీష్ వారి పాలనలో ఉన్నప్పుడు సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం పోరాడారు. అహింసావాదంకంటే సాయుధ పోరాటంతోనే స్వాతంత్ర్యం వస్తుందని భావించారు. అందుకే ఆయన `ఇండియన్ నేషనల్ ఆర్మీ’ని స్థాపించారు. `మీ రక్తాన్ని ధారబోయండి, మీకు స్వాతంత్య్రాన్ని ఇస్తాను’ అని అంటుండేవారట. కాగా, 1945 ఆగస్టు 18న తైవాన్ నుంచి టోక్యోకి ప్రయాణం చేస్తుండగా విమానప్రమాదంలో నేతాజీ మరణించారంటూ వచ్చిన వార్తలు – ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయాయి. నేతాజీ అదృశ్యం, లేదా మరణానికి సంబంధించిన 64 అధికారిక పత్రాలను బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బహిరంగపరచడంతో నేతాజీ ప్రస్థానంలోని నిజాలేమిటన్న ఉత్కంఠ ఒకటొకటిగా తొలిగిపోతుంది. అయితే, కేంద్రం వద్ద ఉన్న 130 డాక్యుమెంట్స్ కూడా వెలుగులోకి వస్తే అప్పుడు నేతాజీ మరణం గుట్టు సంపూర్ణంగా బయటపడుతుంది. ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన 64 డాక్యుమెంట్స్ ద్వారానే నేతాజీ మరణతేదీపై ఒక పెద్ద కట్టుకథే అల్లినట్టు తేలిపోయింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1945 ఆగస్టు 18 మరణించారంటూ వచ్చిన వార్తలు నిజమయ్యే పక్షంలో 1949లో ఆయన ఒక రేడియోలో ఎలా మాట్లాడలనుకుంటారు?
నేతాజీ మేనల్లుడైన అమియ నాథ్ బోస్ లండన్ లో ఉన్న తన సోదరుడు శిశిరి కుమార్ బోస్ కు లేఖరాస్తూ ఈ రేడియో టాక్ గురించి ప్రస్తావించారు. 1949 నవంబర్ 18న రాసిన లేఖను నాటి నెహ్రూ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలమేరకు పోలీసులు ఆ పర్సనల్ లెటర్ ని చించి చూశారు. అప్పటికి నెలరోజుల నుంచి రేడియోలో ఒక విచిత్రమైన ప్రకటన వస్తున్నదనీ, నేతాజీ సుభాష్ చంద్ర మాట్లాలనుకుంటున్నారంటూ- షార్ట్ వేవ్ లో 16ఎంఎం వద్ద రేడియోలో ప్రకటనలు వచ్చాయని ఆ లేఖలో ఉంది. అంతేకాదు, మరో రహస్య డాక్యుమెంట్ తెరిచి చూసినప్పుడు నేతాజీ బతికేఉన్నట్టు ఆయన సోదరుడు శరత్ చంద్రబోస్ భావించినట్టు తెలుస్తోంది.

నెహ్రూ కుట్ర ??

బ్రిటీష్ హయాంలోనే అంటే స్వాతంత్య్రానికి పూర్వమే, నేతాజీ కుటుంబంపై నిఘాపెట్టారు. ఈ విషయంలో కొన్ని సందర్భాల్లో నెహ్రూ సూచనలను కూడా బ్రిటీష్ పాలకులు మన్నించారు. అంటే నెహ్రూ ఉద్దేశపూర్వకంగానే నేతాజీ లక్ష్యాన్ని మోసపూరితంగా, కుట్రపూరితంగా దెబ్బతీశారనే అనుకోవాలి. నేతాజీ మరణించారని ప్రపంచాన్ని నమ్మించిన తర్వాత కూడా నెహ్రూ చాలా సంవత్సరాలపాటు బోస్ కుటుంబసభ్యులపై గూఢచారి నిఘా పెట్టించడంలో ఆంతర్యమేమిటి? అంతేకాదు, ఒక సందర్భంలో నాటి (1945నాటి) ఇంగ్లండ్ ప్రధానమంత్రి క్లెమెంట్ ఆట్లే కి జవహర్ లాల్ నెహ్రూ పేరిట ఒక లేఖ వెళ్ళింది. అందులో `మీ యుద్ధ క్రిమినల్ అయిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ ని రష్యాలోకి ప్రవేశించడానికి మార్గం సుగమంచేశారు…’ అని రాస్తూ, చివర్లో ఇది గుర్తుపెట్టుకుని మీకు ఏది సరైనదని అనిపిస్తే అది చేయండంటూ నెహ్రూ ఈ లేఖలో ముక్తాయింపు ఇచ్చారు. తొలి ప్రధానిగా ప్రజలమన్ననలు అందుకున్న నెహ్రూ ఇలాంటి కుట్రపూరిత లేఖ రాయడం నెహ్రూ నైజాన్ని బయటపెట్టినట్లయింది. నెహ్రూ, నేతాజీ చాలాకాలం భారత జాతీయ కాంగ్రెస్ కు సేవలందించినా వారిమధ్య సిద్ధాంతపరంగా కొన్ని తేడాలుండేవి. కాంగ్రెస్ పార్టీకి రెండుసార్లు జాతీయ అధ్యక్షునిగా బోస్ నియమితులైనా గాంధీ తోనూ, నెహ్రూతోనూ సిద్ధాంతపరంగా అభిప్రాయభేదాలొచ్చేవి. ఇదే నెహ్రూ ఆలోచనలు మార్చేసింది.

మోదీ వ్యూహం

ఒకవేళ నేతాజీకి అంతా అనుకూలంగా ఉంటే ఆయనే మనదేశపు తొలి ప్రధాని అయిఉండేవారేమో… కానీ అలా జరగకుండా నెహ్రూ తనకు చేతనైనంత ప్రయత్నాలు చేశారన్న అనుమానం, లేదా సందేహమే ఇప్పుడు మోదీ వ్యూహానికి నాందీవాచకం. సెప్టెంబర్ 20వ తేదీ (2015)ఆదివారంనాడు ప్రధాని నరేంద్ర మోదీ తన నెలవారీ రేడియో కార్యక్రమం `మన్ కీ బాత్’లో మాట్లాడుతూ, వచ్చే నెలలో ప్రధాని నివాసానికి (తన నివాసానికి) నేతాజీ సుభాష్ కుటుంబసభ్యులను ఆహ్వానించినట్లు మోదీ వెల్లడించారు.

నేతాజీ కుటుంబసభ్యులను ఆహ్వానించి మోదీ వారివద్ద నుంచి ఎలాంటి సమాచారం సేకరించబోతున్నారన్నది పెద్ద ప్రశ్న. బోస్ కుటంబసభ్యుల్లో కొంతమంది విదేశాల్లో ఉన్నారు. వారిని కూడా ఆహ్వానించబోతున్నట్టు తెలుస్తోంది. ఈఏడాది మేనెలలోనే మోదీ కోల్ కతా వెళ్ళినప్పుడు నేతాజీ కుటుంబసభ్యులు కొందరిని కలుసుకున్నారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో అతిముఖ్యమైనది బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తమ రాష్ట్రం వద్దఉన్న 64రహస్య డాక్యుమెంట్లను వెల్లడించడం. దీంతో కేంద్రంపై ఒత్తిడి పెరిగింది. అంతర్జాతీయ సంబంధాలకు ఇబ్బందులు వస్తాయన్న కారణంగానే కేంద్రం తన వద్ద ఉన్న డాక్యుమెంట్స్ ను ఇంతకాలం వెల్లడిచేయడంలేదు. అయితే, అలాంటి ఇబ్బందుల సంగతి అటుంచితే, దేశంలో కాంగ్రెస్ పార్టీని ఒక కుట్రపూరిత పార్టీగా చిత్రీకరించడానికి ఈ డాక్యుమెంట్స్ ఏవిధంగా సహాయపడతాయన్న ఆలోచనొకటి మొగ్గతొడిగినట్టు తెలుస్తోంది. నేతాజీ కుటుంబసభ్యులు, ఇతరుల నుంచి వస్తున్న తీవ్ర ఒత్తిడుల దృష్ట్యా, కీలక పత్రాలను వెల్లడిస్తున్నామన్న పేరుతో వందేళ్లకుపైగా చరిత్రఉన్న కాంగ్రెస్ పార్టీపై వీలైనంత బురదచల్లాలన్నది బీజేపీ యోచనలా ఉంది. నేతాజీ కుటుంబ సభ్యులతో తన నివాసంలోనే మోదీ భేటీ అయ్యాక ఆయన చకచకా పావులుకదిపే వీలుంది.

ఏతావాతా తొలిప్రధాని నెహ్రూ చేసిన అకృత్యాలను వెల్లడించే డాక్యుమెంట్స్ ఆధారంగా కాంగ్రెస్ పార్టీని కుట్రపార్టీగా చిత్రీకరించడమే బిజేపీ లక్ష్యంలా కనబడుతోంది. ఇందుకు మోదీ ఇప్పటికే బీజం వేశారు, త్వరలో నాందీప్రస్తావనలు పూర్తిచేసుకుని అసలు నాటకానికి తెరతీస్తారు. నెహ్రూ వ్యూహాల కారణంగానే నేతాజీ అదృశ్యం (మరణం) సంభవించిందని బీజేపీ ఒక వేళ నిరూపించగలిగితే, ప్రజలను నమ్మించగలిగితే, కాంగ్రెస్ పార్టీకి అంతకంటే ఆత్మహత్యాసదృశం మరొకటి ఉండదు. అదే జరిగితే కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ వంటి వారు సైతం పెట్టాబేడా సర్దుకుని ఇటలీకి వెళ్ళాల్సిందే. బిజేపీకి కూడా ఇదే కావాలి. అయితే, ఏనాడో జరిగిన (చావులు, హత్యలు, ప్రమాదాలు, దేవుళ్లు, చారిత్రిక పురుషులు)
సంఘటనలను ఎప్పటికప్పుడు తవ్విబయటకుతీసే నైజం ఉన్న బిజేపీకి నేతాజీ రహస్య పత్రాల వ్యవహారం ఏమేరకు అక్కరకు వస్తుందో చూడాల్సిందే.

– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏబీపీ సీఓటర్ సర్వే : బీఆర్ఎస్‌కు ఒక్కటే !

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి మంచి జోరు మీద ఉన్న కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో గట్టి పోటీ ఎదురయినప్పటికీ పది వరకూ లోక్ సభ సీట్లను గెల్చుకునే అవకాశం...

ఏబీపీ సీఓటర్ సర్వే : టీడీపీ కూటమికి 20, వైసీపీకి 5 లోక్‌సభ సీట్లు

ఎన్డీఏ కూటమి బలం రోజు రోజుకు పెరుగుతోంది. వైసీపీపై వ్యతిరేకత అంతకంతకూ పెరుగుతోందని సర్వేల వెల్లడిస్తున్నయి. అత్యంత ఖచ్చితంగా సర్వేలు, ఒపీనియన్ పోల్స్ వెల్లడిస్తుందని పేరున్న ఏబీపీ- సీఓటర్ ఎన్నికలకు ముందు నిర్వహించిన...

సునీత సాక్ష్యాలకు పాత ఆరోపణలే అవినాష్ రెడ్డి కౌంటర్ !

వివేకా హత్య కేసులో సునీత జస్టిస్ ఫర్ వివేకా పేరుతో పెడుతున్న ప్రెస్ మీట్లు వెల్లడిస్తున్న సంచనల విషయాలతో అవినాష్ రెడ్డికి మైండ్ బ్లాంక్ అవుతోంది. స్పందించకపోతే నిజం అని...

రాయి కేసు : లీకులిచ్చి జగన్ పరువు తీసిన పోలీసులు !

అనవసర డ్రామాలతో భద్రతా వైఫల్యమని పోలీసుల్ని చేతకాని వాళ్లుగా చేస్తున్నారని కోపం వచ్చిందేమో కానీ విజయవాడ పోలీసులు వైసీపీతో పాటు జగన్ పరువు తీసే లీకులు మీడియాకు ఇచ్చారు. జగన్ పై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close