ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌లో… మోహ‌న్‌బాబు పాత్ర హైలెట్ అట‌!

ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ తో రాంగోపాల్ వ‌ర్మ ఏం కొంప ముంచుతాడో.. అని నంద‌మూరి ఫ్యాన్స్ త‌ల్ల‌డిల్లిపోతున్నారు. వ‌ర్మ టేకింగు, మేకింగుల‌పై న‌మ్మ‌కం ఉంచుకోవ‌ల‌సిన అవ‌స‌రం లేద‌ని గ‌త చిత్రాలు భ‌రోసా ఇస్తున్నా – లేని పోని వివాదాలు రేపుతాడేమో అని భ‌యం. దానికి త‌గ్గ‌ట్టుగానే ‘ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌’లో కావ‌ల్సిన మ‌సాలా ద‌ట్టించేశాడు వ‌ర్మ‌. ఇప్పుడు టీజ‌రు, ట్రైల‌రు విడుద‌ల చేయ‌డ‌మే త‌రువాయి. ఈనెల 14న టీజ‌ర్‌నీ, 22న ట్రైల‌ర్‌నీ విడుద‌ల చేస్తున్నాడు వ‌ర్మ‌. అన్న‌ట్టు `మ‌హానాయ‌కుడు` కూడా 22నే విడుద‌ల అవుతోంది. ఆ సినిమా ఆడుతున్న థియేట‌ర్ల‌లోనే `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌` ట్రైల‌ర్లు చూపించాల‌ని ప్లాన్ చేస్తున్నాడు వ‌ర్మ‌.

అన్న‌ట్టు ఈ సినిమాలో మోహ‌న్‌బాబు పాత్ర ప్ర‌ముఖంగా క‌నిపిస్తుంద‌ట‌. ఎన్టీఆర్ చివ‌రి రోజుల్లో మోహ‌న్ బాబుతో బాగా ట‌చ్‌లో ఉండేవారు. దానికి తోడు ల‌క్ష్మీ పార్వ‌తితోనూ ఆయ‌న బాగానే ఉండేవారు. ఎన్టీఆర్ మ‌ర‌ణం త‌ర‌వాత‌.. మోహ‌న్‌బాబుకీ – ల‌క్ష్మీ పార్వ‌తికీ మ‌ధ్య గ్యాప్ వ‌చ్చింది. `మోహ‌న్ బాబు దుర్మార్గుడు` అని ఓ సంద‌ర్భంలో స్టేట్‌మెంట్ ఇచ్చింది ల‌క్ష్మీ పార్వ‌తి. అలా ఎందుకు స్పందించాల్సివ‌చ్చిందో స‌వివ‌రంగా… ఈ సినిమాలో చూపించ‌బోతున్నార్ట‌. అయితే మోహ‌న్ బాబుని నెగిటీవ్ గా చూపించే ద‌మ్ము, ధైర్యం వ‌ర్మ‌కి ఉన్నాయా? అనేది అస‌లు ప్ర‌శ్న‌. ఎందుకంటే `రౌడీ` పేరుతో మోహ‌న్ బాబుతో ఓ సినిమా తీశాడు వ‌ర్మ‌. మంచు విష్ణు, మ‌నోజ్‌ల‌తోనూ ప‌నిచేశాడు. ఆ స‌మ‌యంలో వ‌ర్మ‌కీ మంచు కుటుంబానికీ మంచి ఎటాచ్‌మెంట్ ఏర్ప‌డింది. దాన్ని ఈ సినిమాతో పోగొట్టుకోవ‌డానికి వ‌ర్మ రెడీ అవుతాడా? అనేది ఆస‌క్తిక‌రం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com