మ‌హేష్ – రాజ‌మౌళి సినిమా.. నిర్మాత‌లు పెరిగారా?

రాజ‌మౌళి సినిమా అంటే.. ఇప్పుడు రూ.1000 కోట్ల బ‌డ్జెట్ మినమం ఉండాల్సిందే. దానికి రెట్టింపు రాబ‌ట్టుకోవ‌డం ఎలాగో రాజ‌మౌళికి కూడా బాగా తెలుసు. అందుకే రాజ‌మౌళి సినిమాకి ఎంత బ‌డ్జెట్ పెడుతున్నా – అదేం భారంగా అనిపించ‌దు. రాజ‌మౌళి – మ‌హేష్‌బాబు కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. ఈ సినిమాకి దాదాపు రూ.1500 కోట్ల బ‌డ్జెట్ పెడుతున్న‌ట్టు టాక్. అదే నిజ‌మైతే… మ‌న దేశంలోనే అత్య‌ధిక బ‌డ్జెట్ తో రూపొందే సినిమా ఇదే అవుతుంది. కె.ఎల్.నారాయ‌ణ ఈ చిత్రానికి నిర్మాత‌. అయితే.. రాజ‌మౌళికి ఆయ‌నొక్క‌డిపైనే భారం వేయ‌డం ఇష్టం లేదు. అందుకే.. రాజ‌మౌళి సైతం ఈ చిత్ర నిర్మాణంలో పాలు పంచుకోనున్నార్ట‌. ఆయ‌న‌కు పారితోషికం అంటూ ఏం ఉండ‌దు. లాభాల్లో వాటా తీసుకొంటారు. ఇప్పుడు ఈ సినిమాలో మ‌రో ఇద్ద‌రు నిర్మాత‌లు కూడా చేరే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఆర్కా మీడియా, సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ‌లు ఈ చిత్రంలో భాగ‌స్వామ్యం అందుకోబోతున్న‌ట్టు స‌మాచారం. వాళ్లిద్ద‌రూ తెర వెనుక ఉంటారా? లేదంటే అఫీషియ‌ల్‌గానే నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తారా? అనేది చూడాలి. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ఇప్ప‌టికే మొద‌లైపోయాయి. ఈ యేడాది చివ‌ర్లో కానీ, 2024 ప్ర‌ధ‌మార్తంలో కానీ ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తలుపులు బద్దలు కొట్టి బండారుకు నోటీసులిచ్చిన పోలీసులు

ఆంధ్రప్రదేశ్ లో పోలీసులు సినిమా స్టైల్ సీన్లు పండించడంలో రాటుదేలిపోతున్నరు. లోకేష్ కు వాట్సాప్ లో నోటీసులు పంపి ఢిల్లీలో షో చేశారు. కానీ నారాయణకు మాత్రం వాట్సాప్‌లో పంపి చేతులు...

ఎవరీ జితేందర్‌ రెడ్డి ?!

ప్రీలుక్ టీజర్ తో క్యురియాసిటీని పెంచింది జితేందర్‌ రెడ్డి. ఉయ్యాలా జంపాలా, మజ్ను సినిమాలతో డైరెక్టర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విరించి వర్మ దర్శకత్వంలో వస్తున్న చిత్రమిది. ఇటీవలే టైటిల్‌ రోల్‌లో...

రాజధాని రైతుల కౌలూ నిలిపివేత – ఉసురు తగలదా !?

రాజధాని నిర్మాణం కోసం తొమ్మిదేళ్ల క్రితం భూములు ఇచ్చిన రైతులకు ప్రతి ఏటా ఇచ్చే వార్షిక కౌలు కూడా జగన్ రెడ్డి సర్కార్ ఇవ్వడం లేదు. అన్ని ఒప్పందాలను ఉల్లంఘించారు. చివరికి కౌలు...

చంద్రబాబుకు గాంధీ మార్గంలో ప్రజల బాసట !

లేని స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయి కనీస ఆధారం లేకపోయినా పాతిక రోజులుగా జైల్లో ఉన్న టీడీపీ అధినేత , ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడుకు మద్దతుగా ప్రజలు గాంధీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close