4+1 చేరికలు: తొలి అంకంతో చంద్రబాబు శ్రీకారం!

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీనుంచి నలుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీన తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. నేను తలచుకుంటే.. చంద్రబాబు ప్రభుత్వం గంటలో కూలిపోతుంది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు చాలా మంది నాతో టచ్‌లో ఉన్నారు. వారి సంఖ్య 21 కు చేరగానే.. పేర్లు ప్రకటిస్తాను. ప్రభుత్వం కూలుతుంది.. అంటూ ప్రతిపక్షనేత జగన్మోహనరెడ్డి డాంబికంగా సెలవిచ్చి వారం రోజులు కూడా గడవక ముందే.. చంద్రబాబు తన చాణక్యాన్ని ప్రదర్శించారు. ఆయన పార్టీనుంచే తెదేపాలోకి ఎమ్మెల్యేలను ఆకర్షించారు.

చేరికల విషయంలో చాలా రాజీచర్చలు, రకరకాల పరిణామాలు మధ్యలో చోటు చేసుకున్నప్పటికీ.. మొత్తానికి నలుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ వైకాపానుంచి సోమవారం రాత్రి 9 గంటల సమయంలో చంద్రబాబు నివాసంలో ఆయన సమక్షంలో తెలుగుదేశంలో చేరారు. దీంతో తెదేపా ఎమ్మెల్యేల సంఖ్య 106కు పెరిగినట్లు అయింది. వైకాపా ఎమ్మెల్యేల సంఖ్య 67 నుంచి 63 కు పడిపోయింది. సోమవారం రాత్రి చేరిన వారిలో భూమా నాగిరెడ్డి, ఆయన కుమార్తె అఖిలప్రియ, దేవగుడి ఆదినారాయణరెడ్డి, జలీల్‌ఖాన్‌ ఎమ్మెల్యేలు కాగా, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి కూడా చేరారు.

అయితే ఈ అయిదు చేరికలను చంద్రబాబు ఆకర్ష రాజకీయాలకు తొలి అంకంగా మాత్రమే భావించాల్సి ఉంటుంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌నుంచి తెలుగుదేశంలో చేరడానికి ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు తెరవెనుక తమంతనాలు సాగిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తమ తమ జిల్లాల్లోని కీలక నేతలు, మంత్రులతో వారు టచ్‌లో ఉండి తమకు తగిన ఆఫర్లు మాట్లాడుకుంటున్నారు. మరి కొన్ని రోజుల్లో ఇంకా వైకాపానుంచి మరిన్ని చేరికలు తెలుగుదేశంలోకి ఉండే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

‘మై డియర్ దొంగ’ రివ్యూ: స‌హ‌నం దొంగిలించేశాడు

అభినవ్ గోమఠం అంటే నవ్విస్తాడనే నమ్మకం ఏర్పడింది. ఒకవైపు క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే మెయిన్ లీడ్ గా కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడాయన టైటిల్ రోల్ లో 'మై డియర్ దొంగ' సినిమా...

4 చోట్ల టీడీపీ అభ్యర్థుల మార్పు ?

తెలుగుదేశం పార్టీ నలుగురు అభ్యర్థులను మార్చాలని నిర్ణయించుకుంది. నరసాపురం సిట్టింగ్ ఎంపీ అయిన కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం దాదాపు ఖాయమే. మంతెన రామరాజుకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close