మావోయిస్టు కేసులు ఎ పి లోనే ఎక్కువ 4 రాష్ట్రాల హద్దుల్లో ఉధృతంగా కూంబింగ్

మావోయిస్టుల కార్యకలాపాలు మళ్ళీ చిన్నగా మొదలౌతున్నాయన్న సంకేతాలు అందడంతో తూర్పుకనుమల్లో తెలంగాణా, చత్తీస్ ఘఢ్, ఒడిస్సా, అంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దుల్లో పోలీసుల జాయింట్ కూంబింగ్ మొదలైంది. విశాఖ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి,ఖమ్మం జిల్లాల బోర్డర్ లో దాదాపు 60 కిలోమీటర్ల పరిధిలో ఈ వెతుకులాట లేదా వేట కొనసాగుతోందని పోలీసు వర్గాల ద్వారా తెలిసింది. పోలీసు కూంబింగ్ ఇపుడు ఉధృతమైన ఫలితంగా దాదాపు 30 గిరిజనగ్రామాల ప్రజలు భయపడిపోతున్నారు. మావోయిస్టుల కార్యకలాపాలు లేకపోవడంతో నాలుగేళ్ళ నుంచీ ప్రశాంతంగా వున్న గిరిజనులకు నక్సల్స్ సమాచారం కోసం పోలీసు వేధింపులు మళ్ళీ మొదలౌతాయి. ఏ హింసాకాండ జరిగినా తమకు పోలీసు చిత్రహింసలు తప్పవన్నది వారి గతానుభవం.

సెప్టెంబరు 21 మావోయిస్టు ఆవిర్భావ దినం. అంతకు ముందు నుంచే ఆవిర్భావ దినోత్సవ పోస్టర్లు గ్రామాల్లో వెలిశాయి. ప్రభుత్వ అక్రమాలు, పోలీసుల దురాగతాల పై పాంప్లెట్లు పంచుతున్నారు. ఇవి మావోయిస్టుల ఉనిక, కార్యకలాపాలకు రుజువులు కావడంతో పోలీసు నిఘా పెరిగింది. గాలింపు ఉదృతమైంది. ఆ నేపధ్ధ్యమే తెలంగాణాలో శివసాగర్ రెడ్డి, శృతి ల ఎన్ కౌంటర్, ఒడిస్సాలో సోరానాధ్, ఆయన అంగరక్షకుల ఎన్ కౌంటర్ కు దారితీసింది. ప్రభుత్వాలు, ప్రభుత్వాధినేతల మధ్య అభిప్రాయబేధాలు వున్నాకూడా మావోయిస్టుల విషయంలో అన్ని రాష్ట్రాల పోలీసులూ ఏకాభిప్రాయంతోనే పనిచేస్తారనడానికి ఈ సంఘటనలే ఉదాహరణలు.

దళాల్లోకి యువతీ యువకులను చేర్చుకునే ప్రయత్నంలోనే మావోయిస్టులు మారుమూల గిరిజన గ్రామాల్లో విస్తృతంగా సంచరిస్తున్నరన్న సమాచారం పోలీసులవద్ద వుంది. ఈ ఏడాది జనవరి నుంచి ఇంతవరకూ తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నలుగురైదుగురిని చంపివేయడం తో సహా అనేక పబ్లిక్ ఆస్ధులను తగలబెట్టడం లాంటి 40 వరకూ సఘటనల్లో మావోయిస్టుల పాత్ర, ప్రమేయం ఉన్నట్టు గుర్తించారు. ఈ సంఘటనల్లో 44 మందిని మావోయిస్టులు లేదా వారి సానుభూతిపరులను పోలీసులు అరెస్టుచేసి కేసులు పెట్టారు. దాదాపు అందరూ రిమాండు ప్రిజనర్లుగా జైళ్ళలో వున్నారు. వీరిలో 14 మంది తెలంగాణాలో, 30 మంది ఆంధ్రప్రదేశ్ లో నేరాలకు పాల్పడ్డారు.

గతంలో కొన్ని సందర్భాల్లో కీలకమైన మావోయిస్టు నాయకులు పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం లాడ్జీల్లో మకాం వేసి కార్యకలాపాలు సాగించిన నేపథ్యంలో జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత అటవీ ప్రాంతంలోనూ పోలీసులు జల్లెడ పడుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close