కేసీఆర్ మీద మాట‌ల దాడి పెంచిన ధ‌ర్మ‌పురి అర‌వింద్!

తెలంగాణ‌లో రెండోసారి తెరాస అధికారంలోకి వ‌చ్చాక మాటల‌ తూటాలు పేల్చే స్థాయిలో ప్ర‌తిప‌క్షం లేకుండా పోయింది. దీంతో, వాటికి ధీటుగా ఘాటుగా స్పందించి కౌంట‌ర్లు ఇచ్చే అవ‌స‌రం సీఎం కేసీఆర్ కి కూడా లేకుండా పోయింది! అయితే, ఇప్పుడా ట్రెండ్ మ‌ళ్లీ వ‌చ్చేట్టుగానే ఉంది. ఇప్పుడు భాజ‌పా నేత‌లు మాట‌ల తూటాలు బాగా లోడ్ చేసుకుని రెడీ అవుతున్న‌ట్టున్నారు. నిజామాబాద్ ఎంపీ ధ‌ర్మ‌పురి అర‌వింద్.. తాజాగా కేసీఆర్ పై మాట‌ల తూటాలు పేల్చారు. కూతుర్ని గెలిపించుకోలేక‌పోయ్యావ్, కొడుక్కి సీఎం కావాల‌ని షోకుందీ, నీకు ప్ర‌ధాని క‌వాల‌నే షోకుండే అంటూ డైరెక్ట్ ఎటాక్ స్టార్ట్ చేశారు.

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీని చూస్తున్నా, భాజ‌పాని చూస్తున్నా ముఖ్య‌మంత్రి కేసీఆర్ కి వ‌ణుకు పుడుతోంద‌ని ఆరోపించారు భాజ‌పా ఎంపీ ధ‌ర్మ‌పురి అర‌వింద్. ఢిల్లీలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ… ఆ భ‌యంతోనే అసెంబ్లీ ఎన్నిక‌ల్ని ముంద‌స్తుగా జ‌రిపించుకున్నార‌నీ, అదే భ‌యంలో పార్ల‌మెంటు ఎన్నిక‌ల ఫ‌లితాలు రాక‌ముందే లోక‌ల్ బాడీ ఎన్నిక‌లు పెట్టార‌నీ, ఇప్పుడు అదే ద‌డ‌తో మున్సిప‌ల్ ఎన్నిక‌ల్ని హ‌డావుడిగా చేసేద్దామ‌ని చూస్తున్నార‌న్నారు. నీకు నిజంగ‌నే ద‌మ్మూ ధైర్యం ఉంటే, రిజర్వేష‌న్లు వ‌చ్చాక‌, ప‌దిహేను రోజులపాటు… అద‌నంగా ఎవ‌రికైనా అభ్యంత‌రాలుంటే విన‌డానికి టైమియ్య‌గ‌ల‌రా అని స‌వాల్ చేశారు. భాజ‌పా అంటే భ‌యం లేక‌పోతే టైం ఎందుకు ఇవ్వ‌డం లేద‌న్నారు.

పొద్ద‌స్త‌మానం న‌లుగురే భాజ‌పా ఎంపీలు గెలిచార‌ని కేసీఆర్ విమ‌ర్శిస్తుంటార‌నీ, దిక్కులు కూడా నాలుగే ఉంటాయ‌నీ, ఈ న‌లుగురూ క‌లిసి నీ దిక్కు చూసిన్ర‌నుకో.. దిక్కుమాలిన స్థితికి చేర‌త‌వ్, తెరాస‌ను మోసుకెళ్లి ఈ న‌లుగురే బొంద‌వెడ‌తారు అని వ్యాఖ్యానించారు అర‌వింద్. తాము ఎవ్వ‌ర్నీ మ‌భ్య‌పెట్టో, మ‌హిళ‌ల్ని భ‌య‌పెట్టో గెల‌వ‌లేద‌నీ, ప్ర‌జాస్వామ్యబ‌ద్ధంగా మోడీ స‌ర్కారు విజ‌యాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లి గెలిచామ‌న్నారు. నీ బిడ్డ‌నే కాపాడుకోలేని నువ్వు, ఇంకా టి.ఆర్.ఎస్. పార్టీని ఇంకేం ఏం కాపాడ‌తవ్ అని సెటైర్ వేశారు అర‌వింద్. నీకు ఉప ప్ర‌ధాని కావాల‌ని షోకుండే, డెప్యుటీ పీఎం అనుకుంటివి నువ్వు, క‌ర‌ప్ష‌న్ల సంపాయించిన‌ పైస‌ల్నీ తీస్క‌పోయి ఆంధ్రాకీ క‌ర్ణాట‌క‌కీ పంపించి దండ‌గ చేస్తివి, నీకు అధికారం మీద ఎంత దాహ‌ముందో స‌క్క‌గా క‌నిపిస్తోంద‌న్నారు. నీ కొడుకుని కూడా మ‌భ్య‌పెడుతున్న‌వ్, ఆయ‌న‌కి సీఎం కావాల‌ని షోకున్న‌ద‌ని ఎద్దేవా చేశారు. ధ‌ర్మ‌పురి అర‌వింద్ కాస్త ఘాటుగానే స్పందించార‌నే చెప్పాలి. సూటిగా కేసీఆర్ కి త‌గిలేలానే కొన్ని మాటలున్నాయి. మ‌రి, వీటిపై ఆయ‌న స్పందిస్తారా లేదా అనేది చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close