పరాకాష్టకి చేరిన టీ-కాంగ్రెస్ లో అంతర్యుద్ధం..ఎవరు బయటకి పోతారో?

నిజమే! కాంగ్రెస్ పార్టీని ఆ పార్టీ నేతలే ఓడించుకొంటారు…మరెవరికీ ఆ అవకాశమే ఇవ్వరని టీ-కాంగ్రెస్ నేతలు నిరూపిస్తున్నారు. పార్టీ ఎంపి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి మళ్ళీ జానారెడ్డి మీద తీవ్ర ఆరోపణలు చేశారు. ఈసారి డిల్లీ వెళ్లి ఆయనపై కాంగ్రెస్ అధిష్టానానికి పిర్యాదులు చేసిన తరువాత ఆరోపణలు చేశారు. “తెలంగాణా కాంగ్రెస్ లో కొంతమంది సీనియర్ నేతలు ఒక్కొక్కరు రూ. 1,000 కోట్లు, 800 కోట్లు విలువగల కాంట్రాక్టులు దక్కించుకొని, తెరాసకి తొత్తులుగా మారి, కాంగ్రెస్ పార్టీలో దాని కోవర్టులుగా పనిచేస్తున్నారు. వారెవరో నేను ఇదివరకే చెప్పాను. కనుక మళ్ళీ వారి పేర్లను నేను చెప్పనవసరంలేదు. వారెవరో తెలంగాణాలో ప్రతీ ఒక్కరికీ తెలుసు. వారి కాంట్రాక్టులు, దాని కోసం పార్టీకి వారు చేస్తున్న నష్టం గురించి నేను సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు లేఖలు వ్రాశాను. స్వయంగా కలిసి పిర్యాదు చెప్పాను. ఇప్పటికైనా వారు మర్యాదగా తమ పదవులకి, పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోవాలి లేకుంటే పార్టీయే వాళ్ళని బయటకి పంపించే పరిస్థితి వస్తుంది,” అని హెచ్చరించారు.

ఆయన ఆరోపణలకి తీవ్రంగా స్పందించిన జానారెడ్డి తన ఎమ్మెల్యే పదవితో సహా అన్ని పదవులకి రాజీనామా చేసి ఒక సామాన్య కార్యకర్తగా పార్టీ కోసం పనిచేయడానికి సిద్దంగా ఉన్నానని అన్నారు. తద్వారా పదవుల కోసం తాను ఆరాటపడుతున్నాననే అపవాదుని తొలగించుకొంటానని చెప్పారు. అయితే ముందుగా సోనియా గాంధీని కలిసి ఆమెకి పరిస్థితులన్నీ వివరించిన తరువాతనే రాజీనామా చేస్తానని అన్నారు.

పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఆరోపణలు చేయగానే జానారెడ్డి వాటిని గట్టిగా ఖండించి ఉంటే అవి నిజం కాదని చెప్పినట్లుండేది. కానీ ఆయన ఖండించకుండా తన పదవులకి రాజీనామా చేస్తానని మాత్రమే చెప్పారు. అంటే పాల్వాయి ఆరోపణలను అంగీకరించినట్లే అయ్యింది. పైగా సోనియా గాంధీని కలిసి సంజాయిషీ చెప్పుకొంటానని చెప్పడంతో వాటిని దృవీకరించినట్లయింది. జానారెడ్డిపై అటువంటి తీవ్రమైన ఆరోపణలు చేసినందుకు పాల్వాయికి టీ-కాంగ్రెస్ షో-కాజ్ నోటీసు పంపింది. జూన్ 17న స్వయంగా హాజరై సంజాయిషీ చెప్పుకోవలసిందిగా ఆదేశించింది. కానీ ఆయనకి బదులు జానారెడ్డి సంజాయిషీలు చెప్పుకొంటానని అంటున్నారు. వారిద్దరి పోరాటం పరాకాష్టకి చేరుకొంది కనుక ఇద్దరిలో ఎవరో ఒకరు పార్టీ నుండి బయటకిపోవడం తధ్యంలాగ కనబడుతోంది. ఎవరు వెళ్లిపోతారో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్‌కు శత్రువుల్ని పెంచడంలో సాక్షి నెంబర్ వన్ !

ఎన్నికల సమయంలో జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడేవారి సంఖ్యను పెంచడంలో సాక్షి పత్రిక తనదైన కీలక భూమిక పోషిస్తుంది. ఎవరైనా తమను విమర్శిస్తున్నారో.. లేకపోతే టీడీపీకి మద్దతుదారుడని అనిపిస్తే చాలు వాళ్లపై పడిపోయి.....

‘జై హ‌నుమాన్‌’లో తేజా స‌జ్జా లేడా?

'హ‌నుమాన్తో' తేజా స‌జ్జా ఒక్క‌సారిగా పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇప్పుడు సీక్వెల్‌గా 'జై హ‌నుమాన్' రూపుదిద్దుకొంటోంది. ఇందులో తేజా స‌జ్జా ఉంటాడా, ఉండ‌డా? అనేది పెద్ద ప్ర‌శ్న‌. నిజానికి ఈ సినిమాలో...

RRR రికార్డ్ బ్రేక్ చేసిన ‘పుష్ష 2’

'పుష్ష 2' రికార్డుల వేట మొద‌లైంది. మొన్న‌టికి మొన్న 'పుష్ష 2' హిందీ డీల్ క్లోజ్ అయ్యింది. దాదాపు రూ.200 కోట్లు హిందీ రైట్స్ రూపంలో వ‌చ్చాయి. ఆడియో రైట్స్ విష‌యంలోనూ పుష్ష...
video

‘మిరాయ్‌’… 20 రోజుల్లోనే ఇంత తీశారా?

https://www.youtube.com/watch?v=xnubQ829q0c తేజ స‌జ్జా, కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని కాంబినేష‌న్ లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి 'మిరాయ్‌' అనే టైటిల్ ఫిక్స్ చేసిన‌ట్టు తెలుగు 360 ముందే చెప్పింది. ఇప్పుడు అదే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close