చరణ్ వద్దన్నాడు సాయి ధరం సై అన్నాడు.!

మెగా వారసుల్లో పర్ఫెక్ట్ మ్యాజిక్ తో సూపర్ ఫాంలోకి వచ్చిన కుర్ర హీరో సాయి ధరం తేజ్. తీసిన మూడు సినిమాల్లో రెండు హిట్స్ తన ఖాతాలో వేసుకున్న ఈ హీరో మెగా ఇమేజ్ వద్దు వద్దు అంటూనే మామలిద్దరిని భలే వాడేస్తున్నాడు. ప్రస్తుతం సుప్రీం, తిక్క సినిమాల్లో నటిస్తున్న సాయి ఓ రీమేక్ సినిమా చేయనున్నాడని తెలుస్తుంది. అది కూడా చరణ్ చేయాలనుకుని కుదరక వద్దనుకున్న సినిమాను చేస్తున్నాడట.

కన్నడ సూపర్ హిట్ సినిమా ‘మిస్టర్ అండ్ మిసెస్ రామాచారి’. యశ్, రాధికా పండిత్ నటించిన ఈ సినిమా కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. అయితే ఈ సినిమాను రాం చరణ్ తో తెలుగులో రీమేక్ చేసే ఆలోచన చేశారు దర్శక నిర్మాతలు. కాని ప్రస్తుతం బిజీ షెడ్యూల్ వల్ల ఆ సినిమాను కాదన్నాడట చెర్రి. ఇక చరణ్ కాదన్న ఆ కథతోనే సాయి సినిమా చేస్తున్నాడని టాక్.

ప్రస్తుతం వరుసెంట హిట్ సినిమాలతో మంచి ఫాంలో ఉన్న సాయి ధరం కు ఈ మిస్టర్ అండ్ మిసెస్ రామాచారిపై మనసు పడ్డాడట. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న రెండు సినిమాలను పూర్తి చేయగానే ఈ సినిమా స్టార్ట్ చేస్తున్నాడట. అయితే ఈ ప్రెస్టిజియస్ ప్రాజెక్ట్ కు ఎవరు దర్శకత్వం వహిస్తారన్నది ఇప్పుడు టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయ్యింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com