మురుగ‌దాస్ క‌ల నెర‌వేరుతుందా?

త‌మిళంలో ఎన్నో సూప‌ర్ డూప‌ర్ హిట్లు ఇచ్చాడు మురుగ‌దాస్. అక్క‌డ మురుగ‌దాస్ అంటే… హీరోలంతా క్యూ క‌ట్టేస్తారు. అదేంటో… తెలుగులో మాత్రం రెండుసార్లూ నిరాశ ప‌రిచాడు. చిరంజీవితో `స్టాలిన్‌` తీశాడు. మ‌హేష్ బాబుని `స్పైడ‌ర్‌`గా మార్చాడు. రెండూ డిజాస్ట‌ర్‌లే. తెలుగులో హిట్టు ఇవ్వ‌లేక‌పోయాన‌న్న లోటు మురుగ‌దాస్‌ని వెంటాడుతోంది. అందుకే ఇప్పుడు మ‌ళ్లీ తెలుగులో ఓ సినిమా చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నాడు. ఒక‌రిద్ద‌రు టాప్ హీరోల‌తో మురుగ‌దాస్ ట‌చ్‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. వాళ్ల‌లో ఒక‌రిని ఎలాగైనా ఒప్పించి, ప్రాజెక్టుని ప‌ట్టాలెక్కించాల‌ని చూస్తున్నాడు.

అయితే మురుగ‌దాస్‌తో సినిమా అంటే.. తెలుగు హీరోలు, వాళ్ల అభిమానులూ భ‌య‌ప‌డుతూనే ఉన్నారు. త‌మిళంలో టాప్ ద‌ర్శ‌కుడైనా స‌రే, తెలుగు ప్రేక్ష‌కుల నాడీని మురుగ‌దాస్ పెద్ద‌గా ప‌ట్టుకోలేక‌పోయాడ‌న్న‌ది అంద‌రి ఆవేద‌న‌. అలాంట‌ప్పుడు గ‌జిని, తుపాకీ తెలుగులో మంచి వ‌సూళ్లు ఎలా సాధిస్తాయ‌న్న‌ది మురుగ‌దాస్ అభిమానుల ప్ర‌శ్న‌. అదీ నిజ‌మే. కాక‌పోతే.. తెలుగులో స్ట్రయిట్ సినిమాలు తీస్తున్న‌ప్పుడు మురుగ‌దాస్‌కి టైమ్ క‌ల‌సి రాలేదంతే. ఈసారి మాత్రం… స్క్రీన్ ప్లే జిమ్మిక్కులూ, మైండ్ గేమ్‌లూ లేకుండా ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ సినిమా తీద్దామ‌న్న‌ది మురుగ‌దాస్ ప్లాన్‌. కాక‌పోతే… మ‌న హీరోలంతా ఆల్రెడీ చేతిలో రెండేసి మూడేసి ప్రాజెక్టుల్ని పెట్టుకున్నారు. అవ‌న్నీ అవ్వాలి.. అప్పుడు మురుగ‌ని లైన్‌లోకి దింపాలి. మ‌రి మురుగ‌దాస్ క‌ల ఎప్ప‌టికి నెర‌వేరుతుందో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొత్త హీరోయిన్ల తలరాతలు మారుస్తున్న రాంగోపాల్ వర్మ

సినిమా ఇండస్ట్రీలో బ్రేక్ రావడం అన్నది అంత ఆషామాషీ కాదు. వందల మంది ఆర్టిస్టులు బ్రేక్ కోసం ప్రయత్నిస్తున్నా, టాలెంట్ విషయంలో కొదువ లేకపోయినా, అదృష్టం కలిసి రాక, సరైన గాడ్ ఫాదర్...

ఓయ్ ద‌ర్శ‌కుడితో చిరు త‌న‌య‌

చిరంజీవి కుమార్తె సుస్మిత సైతం.. చిత్ర‌సీమ‌తో మ‌మేకం అవుతుంది. చిరు చిత్రాల‌కు కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా సేవ‌లు అందించింది. ఇప్పుడు నిర్మాత‌గానూ మారింది. గోల్డ్ బాక్స్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ సంస్థ ను స్థాపించి కొన్ని వెబ్...

గవర్నర్‌ను లైట్ తీసుకున్న తెలంగాణ అధికారులు..!

కరోనా వ్యాప్తి విషయంలో తెలంగాణ సర్కార్ పట్టించుకోవడం లేదు.. కాస్త పట్టించుకుందామనుకున్న గవర్నర్‌ను అధికార యంత్రాంగం లెక్క చేయడం లేదు. తెలంగాణలో కరోనా పరిస్థితులపై తీవ్రమైన విమర్శలు వస్తున్న సమయంలో.. సీఎం...

‘పుష్ష‌’ కోసం భారీ స్కెచ్‌

30 - 40 మందితో షూటింగులు జ‌రుపుకోండి... అంటూ ప్ర‌భుత్వాలు క్లియ‌రెన్స్ ఇచ్చేసినా - ఒక్క పెద్ద సినిమా కూడా ప‌ట్టాలెక్క‌లేదు. చిన్నా, చిత‌కా సినిమాలు, త‌క్కువ టీమ్ తో ప‌ని కానిచ్చేస్తున్నా,...

HOT NEWS

[X] Close
[X] Close