ఆఖరి ఉత్తరంలో కొడుక్కి జీవితసారాన్ని బోధించిన రచయిత

వందేళ్ళ జీవితం ఉంది కదా అని చెప్పి విలువైన సమయాన్ని వృధా చేస్తూ ఉంటాం మనం. మన చదువులు కూడా అంతే. సంవత్సర కాలం అంటారు. కానీ ఎక్కువ శాతం మంది మాత్రం మూడు నెలల కాలం మాత్రమే పూర్తిగా చదువుకు కేటాయిస్తారు. అదే పిల్లలకు జీవిత పాఠాన్ని బోధించాలంటే జీవిత కాలం పడుతుంది అని అనుకుంటాం. టైం యొక్క విలువ మనకు తెలిసి ఉండాలి. మన దగ్గర చాలా చాలా తక్కువ టైం ఉండాలి. అలాంటి పరిస్థితే వస్తే కేవలం ఓ పది నిమిషాల వ్యవధిలో వ్రాసిన ఉత్తరం చాలు. కొడుక్కి జీవితసారాన్ని మొత్తం బొధించవచ్చు. నమ్మడం లేదా? తమిళంలో చాలా తక్కువ కాలంలోనే అగ్ర స్థాయి రచయితగా పేరు తెచ్చుకున్న రచయిత ముత్తుకుమార్ అదే చేశాడు. జీవిత చరమాంకంలో ఉన్న టైంలో చాలా చిన్న వాడైన తన కొడుక్కి ఒక చిన్న ఉత్తరం ద్వారా జీవితాన్ని ఎలా జీవించాలో చెప్పేశాడు. బంధువులతో ఎలా ఉండాలి? స్నేహితులతో ఎలా ఉండాలి? బుక్ రీడింగ్, ప్రయాణాలు జీవితానికి ఎంత అవసరం? సాటి మనిషి సాయంలో ఉంటే ఎలా స్పందించాలి? జీవితంలో ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి? ఒక్కటనేంటి జీవితానికి సంబంధించిన అన్ని విషయాలను చెప్పాడు. ఒక్క ముత్తుకుమార్ కొడుక్కి మాత్రమే కాదు మనందరికీ కూడా ఉపయోగపడే పాఠాలే ఇవి. మనుషులను చదివిన రచయిత కదా. తన జ్ఙానాన్ని కొడుకుతో పాటు ప్రపంచానికి కూడా ఇచ్చి వెళ్ళాడు. ఆ రచయిత జీవిత చరమాంకంలో చెప్పిన జీవిత పాఠాలు మీకోసం. (లెటర్ క్రెడిట్ గోస్ టు ముత్తుకుమార్). ముత్తుకుమార్ రచించిన లెటర్ ఇదే.

‘‘ముద్దుల కొడుక్కి మీ నాన్న రాస్తున్నది. ఇది నేను రాసే మొదటి ఉత్తరం. దీన్ని చదివి అర్థం చేసుకునే వయసులో నువ్వు లేవు. అక్షరాలు నేర్చుకుంటూ భాష వేళ్లు పట్టుకుని నడుస్తున్నావు. నా దగ్గర నుంచి మా నాన్న దాచిన రహస్యాల పెట్టె తాళాన్ని నేను వెతికినట్టే నువ్వూ వెతుకుతావు. కానీ జీవితంలో చాలా జాగ్రత్తగా అడుగులేయాలి. ఎక్కువగా ప్రయాణాలు చెయ్. ఆ ప్రయాణాలే నీకు విలువైన అనుభవాన్నిస్తాయి. పుస్తకాలను ప్రేమించు. ఒక్కో పుస్తకం ఒక్కో అనుభవాన్ని నేర్పిస్తుంది. మీ తాత – నాన్న పుస్తకాల ప్రపంచంలోనే కనుమరుగయ్యారు. నీ రక్తంలోనూ ఆ నది ప్రవహిస్తూనే ఉంటుంది.

నీ దగ్గరకు వచ్చిన దొరికిన పని కన్నా.. నచ్చిన పని చెయ్. ఆనందమైన జీవితాన్ని కొనసాగించు. అలాగే ఎవరైనా నిన్ను సాయం కోరితే అప్పు చేసి అయినా సాయపడు. అందులో లభించే ఆనందం చాలా గొప్పది. మాటల్లో వర్ణించలేనిది. బంధువులతో సన్నిహితంగానూ ఉండు. అదే సమయంలో వారికి దూరంగానూ ఉండు. ఈ ప్రపంచంలో అన్ని బంధాలకన్నా విలువైనది స్నేహం మాత్రమే. మంచి స్నేహితులను చేర్చుకో. నీదారి చక్కబడుతుంది.

ఇవన్నీ మా నాన్న నాకు చెప్పకుండా చెప్పినవే. నేను నీకు చెప్పాలనిపించి చెబుతున్నా. నువ్వు జన్మించిన తర్వాతే నా తండ్రి ప్రేమను – అనురాగాన్ని అప్పుడప్పుడు అర్థం చేసుకోగలిగా. రేపు నీకో కొడుకు పుడితే అప్పుడు నా ప్రేమానురాగాలు అర్థమవుతాయి. రేపు – ఎప్పుడో నువ్వు నీ మనవళ్లతో ఏదో ఒక వూరిలో నవ్వుతూ మాట్లాడుతున్నప్పుడు నా జ్ఞాపకం వస్తే.. ఈ ఉత్తరాన్ని ఒక్కసారి తీసి చూడు! నీ కన్నీటిలో నేనుంటా’’.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎవరీ రామసహాయం రఘురామ్ రెడ్డి..?

ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా రామసహాయం రఘురాం రెడ్డిని హైకమాండ్ ప్రకటించింది.అనేకపేర్లు తెరమీదకు వచ్చినా అనూహ్యంగా అధిష్టానం రామసహాయం పేరును అభ్యర్థిగా ఖరారు చేయడంతో ఈయన ఎవరు అనే చర్చ జోరుగా జరుగుతోంది....

“సివిల్ సర్వీస్” ఇమేజ్ జగన్ పాలనలో డ్యామేజ్ !

సివిల్ సర్వీస్ అధికారి అంటే ఓ గౌరవం.. ఓ మర్యాద. కానీ ఏపీలో సివిల్ సర్వీస్ అధికారులు చేస్తున్న పనులు చూసి.. కోర్టులు కూడా అసలు మీకెవరు ఉద్యోగం ఇచ్చారయ్యా అని అసహనపడాల్సి...

తీన్మార్ మల్లన్న – ఈ సారి ఎమ్మెల్సీ పక్కా !

తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ ..తెలంగాణ రాజకీయల్లో పరిచయం లేని వ్యక్తి. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ కు సపోర్టుగా ఉన్నారు. ఆయన పేరును కరీంనగర్ లోక్ సభకు కూడా...

మేనిఫెస్టో మోసాలు : పట్టగృహనిర్మాణ హామీ పెద్ద థోకా !

జగన్మోహన్ రెడ్డి తాను చెప్పుకునే బైబిల్, ఖురాన్, భగవద్గీతలో అయిన మేనిఫెస్టోలో మరో ప్రధాన హామీ పట్టణ గృహనిర్మాణం. మూడు వందల అడుగుల ఇళ్లు ఇచ్చి అడుగుకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close