ఎంవీవీఎస్ మూర్తి నేటి తరానికి ఆదర్శం..!

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గీతం యూనివర్సిటీ సంస్థల అధినేత ఎంవీవీఎస్ మూర్తి దుర్మరణం పాలయ్యారు. ఓ సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన ఆయన జీవన పయనం ఎంతో మందికి ఆదర్శనం. విద్యాదానాన్ని మించినది లేదన్నట్లుగా.. నలుగురికీ విద్యను పంచితే.. ఎంత పేరు వస్తుందో.. ఆయనను చూస్తే తెలిసిపోతుంది. ఎన్నో వ్యాపారాలు చేసినా.. ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా గీతం వ్యవస్థాపకునిగానే పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. తల్లిదండ్రులు పట్టాభిరామయ్య, మాణిక్యమ్మ.. చిన్నతనం నుంచి చదువులో చురుగ్గా ఉండే ఆయన కాకినాడలో ఉన్నత విద్యను అభ్యసించారు. అనంతరం ఆంధ్రా విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు. 1980లో గీతమ్ యూనివర్సిటీని నెలకొల్పి దానికి ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఎన్టీఆర్ పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీలో చేరిన ఆయన 1991లో విశాఖ నుంచి తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. అనంతరం 1999లో రెండవసారి ఎంపిగా గెలిచారు. రెండుసార్లు ఎమ్మెల్సీగాను సేవలందించారు.

ఎంవీవీఎస్ మూర్తిది ఓ చరిత్ర. వైజాగు ప్రజానీకానికే కాదు, డీమ్డ్ యూనివర్శిటీ గీతం విద్యాసంస్థల వ్యవస్థాపకుడిగా కొన్ని లక్షల మంది విద్యార్థులు, వాళ్ల తల్లిదండ్రులకు మూర్తి ఆత్మీయులు. ఆయన మరణం టీడీపీకి కూడా నష్టమే. టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబానికి కూడా లోటే. బాలయ్య బాలయ్య రెండో కూతుర్ని ఎంవీవీఎస్ మూర్తి మనమడికి ఇచ్చి పెళ్లి చేశారు. అంటే బాలయ్య వియ్యంకుడి తండ్రే మూర్తి. మొన్నమొన్ననే హరికృష్ణను రోడ్డుప్రమాదంలో కోల్పోయిన టీడీపీకి, చంద్రబాబుకు, బాలయ్యకు ఇది మరో షాక్. మరో మాజీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు స్వయానా ఈ మూర్తికి వియ్యంకుడు.

కెరీర్ ప్రారంభంలో కొన్నాళ్లు లాయర్ ప్రాక్టీస్ కూడా చేశాడు. వైజాగ్ బాట్లింగ్ కంపెనీని స్థాపించారు. అందుకే అప్పట్లో గోల్డ్ స్పాట్ మూర్తి అనేవారు తనను ఆ తరువాత ఆ వీబీసీ గ్రూపు అనేక వ్యాపారాల్లో అడుగు పెట్టింది. కోనసీమ పవర్ ప్రాజెక్టుతోపాటు వీబీసీ ఫెర్రో అల్లాయ్స్, మైనింగు, ఎడ్యుకేషన్, ఫర్టిలైజర్స్, కోల్ బెనిఫికేషన్, హాస్పిటాలిటీ ఇలా అనేక రంగాల్లోకి విస్తరించారు. వుడా ఛైర్మన్‌గా, విశాఖ పోర్టు ట్రస్టు, ఎల్ఐసీ, రిజీనల్ డైరెక్ట్ ట్యాక్సెస్, ఎఐఆర్ తదితర ప్రైవేటు, ప్రభుత్వ సంస్థల్లోనూ అనేక హోదాల్లో పనిచేశారు. గీతం ఇప్పుడు డీమ్డ్ యూనివర్శిటీ వైజాగ్, హైదరాబాదు, బెంగళూరులో కూడా ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్ సర్కార్ చేస్తున్న అప్పుల కన్నా “రీ పే” ఎక్కువ !

రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అప్పులు భారీగా చేస్తోందని బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలకు కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది. తాము తెచ్చిన అప్పుల కన్నా చెల్లించేది ఎక్కువని లెక్కలు విడుదల చేసింది. కేసీఆర్...

వైసీపీలో బొత్స వర్సెస్ విజయసాయి..!?

దశాబ్దాల చరిత్ర ఉన్న విశాఖ వాల్తేరు క్లబ్ పై వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు పార్టీలో కొత్త వివాదానికి తెరలేపాయి.2014లో వైఎస్ విజయమ్మ ఓటమికి ప్రధాన కారణాల్లో ఒకటిగా ...

కవిత కోసం బీజేపీకి కేసీఆర్ సరెండర్ అయ్యారా..?

లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన కవితను కాపాడుకునేందుకు కేసీఆర్ ప్రధాని మోడీతో కుమ్మక్కయ్యారా..? అందులో భాగంగానే ఐదు లోక్ సభ స్థానాల్లో బీజేపీకి సహకరించేందుకు కేసీఆర్ ఒప్పందం కుదుర్చుకున్నారా..? రాష్ట్రంలో రేవంత్...

డబ్బుతో కొడుతున్నారు : లాజిక్ మిస్సవుతున్న వైసీపీ !

డబ్బుతో ఏమైనా చేయవచ్చా ?. ఏమీ చేయలేరని చాలా ఘటనలులు నిరూపించాయి. చివరికి ఎన్నికల్లో కూడా గెలవలేరని.. డబ్బులు విచ్చలవిడిగా పంచినా.. బీఆర్ఎస్ ఓటమి నిరూపించింది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close