మైత్రీతో కల్యాణ్‌రామ్ సినిమా.. షురూ!

మైత్రీ మూవీస్ సంస్థ‌…. ఫుల్ స్వింగ్ లో ఉంది. సినిమా మీద సినిమా… సినిమా మీద సినిమా ప‌ట్టాలెక్కేస్తోంది. దాదాపు పెద్ద హీరోలంద‌రి చేతిలోనూ మైత్రీ ఇచ్చిన అడ్వాన్సులు ఉన్నాయి. తాజాగా.. క‌ల్యాణ్ తోనూ ఓసినిమా మొద‌లెట్టేసింది. రాజేంద్ర అనే కొత్త కుర్రాడు ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈరోజే.. ఈ చిత్రం లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. క‌థానాయిక‌, ఇత‌ర వివ‌రాల్ని చిత్ర‌బృందం త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించ‌బోతోంది. ఈనెల‌లోనే రెగ్యుల‌ర్ షూటింగ్ కూడా ప్రారంభిస్తారు. క‌ల్యాణ్ రామ్ `తుగ్ల‌క్‌` అనే మ‌రో సినిమాలోనూ న‌టిస్తున్నాడు. వేణు మ‌ల్లిడి ద‌ర్శ‌కుడు. సోషియో ఫాంట‌సీ నేప‌థ్యంలో సాగే క‌థ ఇద‌ని తెలుస్తోంది. ఇందులో.. క‌ల్యాణ్ రామ్ పాత్ర‌లో నెగిటీవ్ షేడ్స్ కూడా ఉంటాయ‌ని స‌మాచారం. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఏ విష‌యాలూ ఇప్ప‌టి వ‌ర‌కూ అధికారికంగా బ‌య‌ట‌కు రాలేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close