బ‌న్నీని వెంటాడుతున్న భ‌యం

‘డీజే’తో డ‌బ్బులొచ్చినా అల్లు అర్జున్‌లో ఏమాత్రం సంతృప్తి లేదు. ఎందుకంటే డీజే చుట్టూ చాలా వివాదాలు రేగాయి. మ‌రీ ముఖ్యంగా… ఆ వ‌సూళ్ల‌న్నీ ఫేకే అంటూ స్వ‌యంగా మెగా అభిమానులే గ‌ళం ఎత్తారు. రివ్యూలు కూడా నెగిటీవ్‌గానే వ‌చ్చాయి. అందుకే ఈసారి అంద‌రి నోళ్లూ మూత‌ప‌డేలా క్లీన్ హిట్ ఇవ్వాల‌ని చూస్తున్నాడు బ‌న్నీ. ‘నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా’ ని చాలా జాగ్ర‌త్త‌గా ఆడియ‌న్స్‌లోకి తీసుకెళ్లాల‌ని భావిస్తున్నాడు. విడుద‌ల‌కు రెండు మూడు నెల‌ల ముందు నుంచే ప్ర‌మోష‌న్లు కూడా మొద‌లెట్టేశాడు. ఈసినిమా కోసం అల్లు అర్జున్ భీక‌రంగా క‌ష్ట‌ప‌డ్డాడ‌న్న‌ది నిజం. టీజ‌ర్‌తో కావ‌ల్సినంత బ‌జ్ వ‌చ్చింది. రెండు పాట‌లూ బ‌య‌ట‌కు వ‌చ్చాయి. కాక‌పోతే బ‌న్నీని ఓ భ‌యం వెంటాడుతోందిప్పుడు. టీజ‌ర్‌, పాట‌ల వ‌ల్ల ‘ఇది మ‌రీ సీరియ‌స్ సినిమాలా ఉందే’ అనే ఫీలింగ్‌జ‌నాల్లో నాటుకుపోయింది. టీజ‌ర్ మొత్తం సీరియ‌స్ లుక్‌తోనే క‌ట్ చేశారు. పైగా బ‌న్నీ సైనికుడు. అత‌న్ని ఓ యుద్ద వీరుడిలా చూపించాల‌న్న ఉద్దేశంతో.. హ్యూమ‌ర్ యాంగిల్‌ని పూర్తిగా విస్మ‌రించారు.

అయితే సినిమాలో ఫ్యామిలీ ఎమోష‌న్స్ చాలా ఉన్నాయ‌ట‌. ఆర్మీ పాయింట్ అనేది ఓ భాగం మాత్ర‌మే. కుటుంబ బంధాలు, రొమాన్స్‌, ల‌వ్‌.. ఇవ‌న్నీ సినిమాలో ఉన్నాయ‌ని, అయితే సీరియ‌స్ యాంగిల్ ఒక్క‌టే ఇప్ప‌టి వ‌ర‌కూ ఎలివేట్ అయ్యింద‌ని చిత్ర‌బృందం భావిస్తోంది. అందుకే ఇక మీద‌ట‌.. వ‌దిలే టీజ‌ర్లు, స్టిల్స్‌ల‌లో.. ఈ ‘ఆర్మీ’ యాంగిల్‌కి దూరంగా ఉండాల‌ని భావిస్తున్నార్ట‌. సినిమాలో ఉన్న ఫ్యామిలీ ఎమోష‌న్స్‌ని ఎలివేట్ చేసేలా… ప్ర‌చార చిత్రాలు రూపొందించాల‌ని బ‌న్నీ చిత్ర‌బృందాన్ని సూచించిన‌ట్టు స‌మాచారం. సో.. ‘నా పేరు సూర్య‌’ లుక్ ఇక మీద‌ట మార‌బోతోంద‌న్న‌మాట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.