‘మహానటి’కి పుస్తకాలు, ఫ్యామిలీయే ఆధారం!

సావిత్రికి సినిమాయే జీవితం… ఆమె జీవితమంతా సినిమాయే. సినిమానీ, ఆమెనూ విడదీసి చూడలేనంతగా సావిత్రి బతికింది. పెళ్లి, పిల్లలు, పిల్లల పెళ్లిళ్లు ఆమె సినిమా జీవితంతో ముడిపడ్డాయి. ఒకట్రెండు కాదు.. దగ్గర దగ్గరగా మూడు వందల సినిమాల్లో నటించింది. ఎంతోమంది సినిమా ప్రముఖులతో ఆమెకు స్నేహపూర్వక, గౌరవ సంబంధాలు వున్నాయి. ఆమెతో కలిసి పని చేసిన వారెందరో. అటువంటి నటి జీవితం ఆధారంగా సినిమా తీస్తున్నారంటే ఎంతమందిని కలిసుంటారో? దర్శకుడు ఎంత రీసెర్చ్ చేసి వుంటారో? అని సినిమా ప్రారంభ సమయంలో చాలామంది అనుకున్నారు. సినిమా చిత్రీకరణ పూర్తయ్యి విడుదల దగ్గర పడుతుండగా… అప్పటి సినిమా ప్రముఖులు మమ్మల్ని సంప్రదించలేదేంటి? అని అడగటం మొదలుపెట్టారు. ‘మహానటి’ ఆడియో విడుదల కార్యక్రమంలో దర్శకేంద్రులు రాఘవేంద్రరావు నేరుగా దర్శకుడు నాగ అశ్విన్‌తో ‘సినిమా తీసే ముందు నన్ను సంప్రదించలేదు ఏంటి?’ అని అడిగారు. ఇదే విషయాన్ని నాగ అశ్విన్‌ని అడిగితే… “సావిత్రి జీవితం గురించి తెలియనిది ఎవరికి? ఆమెపై తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో నాలుగు ఐదు పుస్తకాలు వచ్చాయి. అందులో వీకే మూర్తి సోమరాజు రాసిన పుస్తకంలో ఎంతో సమాచారం వుంది. అలాగే, సావిత్రిగారి పిల్లలు చాలా విషయాలు చెప్పారు. నిజం చెప్పాలంటే… వాళ్లు చేసినంత రీసెర్చ్ నేను చేయలేదు. నాకు వాళ్లే ఆధారంగా నిలిచారు. ఒకరి సమాచారంతో మరొకరి సమాచారాన్ని సరిచూసుకున్నా. నేను ఏదీ మిస్ అయినట్టు అనిపించలేదు” అని చెప్పారు. అదండీ సంగతి. అందరికి తెల్సిన సావిత్రి జీవితాన్ని నిజాయితీగా 99శాతం నిజ జీవిత సంఘటనలతో సినిమాగా తీశానని నాగ అశ్విన్ తెలిపారు. కామెడీ కోసం ఒక్క శాతం స్వేచ్ఛ తీసుకున్నార్ట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

విజ‌య్ పాత లెక్క‌ల‌న్నీ బ‌య‌ట‌కు తీస్తారా?

విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన 'డియ‌ర్ కామ్రేడ్‌', 'ఖుషి' చిత్రాల తాలుకూ క‌మ‌ర్షియ‌ల్ రిజ‌ల్ట్ ఏమిటి? ఈ సినిమాల వ‌ల్ల నిర్మాత‌లు న‌ష్ట‌పోయారా, లాభ‌ప‌డ్డారా? ఈ లెక్క‌ల‌న్నీ బ‌య‌ట‌కు రాబోతున్నాయి. విజ‌య్...

రాయలసీమపైనే షర్మిల గురి !

కాంగ్రెస్ పార్టీ బలాన్ని రాయలసీమలో బలంగా చూపించేలా షర్మిల ప్రయత్నం చేస్తున్నారు. విస్తృత పర్యటనలు చేస్తున్నారు. కడప పార్లమెంట్ నియోజవకర్గం మొత్తం ఓ సారి సంచలనం రేపారు. వైఎస్ వివేకా హత్య...

‘సైరెన్’ రివ్యూ: థ్రిల్ తక్కువ… డ్రామా ఎక్కువ

ఎమోషనల్ డ్రామా టచ్ తో క్రైమ్ థ్రిల్లర్స్ రావడం అరుదే. జయం రవి, కీర్తి సురేశ్‌ కీలకపాత్రల్లో నటించిన ‘సైరెన్‌’ ఇలాంటి ట్రీట్మెంట్ తోనే తయారైయింది. చేయని తప్పుకు శిక్షని అనుభవించిన వ్యక్తి...

ధోనీ… ఆ మెరుపులు మ‌ళ్లీ!

కెరీర్ తొలి రోజుల్లో ధోనీ చాలా ధాటిగా ఆడేవాడు. త‌ను ఆడిన తుపాను ఇన్నింగ్సులు ఎన్నో. ఆ దూకుడు చూసే అత‌న్ని అభిమానించ‌డం మొద‌లెట్టారు. సీనియారిటీ పెరిగేకొద్దీ, త‌న వికెట్ ఎంత విలువైన‌దో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close